Bharatiya Samskruthi    Chapters   

శ్రీః

శుద్ధస్ఫటిక సంకాశం రమ్య సింహాసన స్థితం|

పద్మయాసహితం దేవం శ్రీ నృసింహం భజామ్యహం||

యత్కృపాలవమాత్రేణ మూకోభవతి పండితః|

వేదశాస్త్ర శరీరాంతాం, వాణీం వీణాకరాం, భ##జే||

గురుబ్రహ్మా గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః|

గురుసాక్షాత్పరబ్రహ్మా తసై#్మశ్రీ గురవేనమః ||

నమోబ్రహాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో

వంశ ఋషిభ్యః, పరమగురుభ్యః సర్వోపప్లవరహితః

ప్రజ్ఞాన ఘనఃప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి

బ్రహ్మైవాహమస్మి ఓం శాన్తిః శాన్తిః శాన్తిః

వేదేబ్రహ్మ సమస్తదంగనిచయే| గర్గోపమస్తత్కధా|

తాత్పర్యార్థవివేచనే గురుస్తత్కర్మ, సంకీర్తనే|

ఆసీజ్జెమిని రేవ సూత్రనిచయ స్వార్థోవసంవర్ణనే|

వ్యాసే నైవసమస్సశంకర గురుర్జేజీయ తాంమానసే||

అసేతు సీతనగ వర్యన్తముగల యీభూభాగమునకు భరతఖండమని పేరు. ఈ భరత ఖండమున నివశించు మనకు భారతీయులని మన శాస్త్రకారుల వ్యవహారము. పాశ్చాత్యులు మన భరతఖండమునకే హిందూదేశమని చెప్పిరి. మనలను హిందువులనియు వ్యవహరించిరి. కాని హిందూదేశము - హిందువులు, అని వాడుటకన్నా, మన వేదశాస్త్రప్రసిద్ధము. మన ఆర్య సంప్రదాయసిద్ధమనదగిన, భారతదేశము. భారతీయులని మనము వ్యవహరించడమే ధర్మము.

మన పూర్వికులు మొదలు మనము మన సంతతి వారు సహ ఆజీవితము, సుఖసంతోషములకొరకై, ఇహపరసాధనార్థమై, జననము మొదలు నడచుకొను నడవడికలకే ''ధర్మము'' అను పేరుపెట్టిరి. ఈ ధర్మమునకే సనాతన ధర్మమనియు నామాంతరమిడిరి. ఈ సనాతనధర్మము నాచరించు మనకు, ''సనాతన ధర్మపరాయణులు'' అనియు వ్యవహార మొప్పుచున్నది.

ఈ సనాతనథర్మము వేదములలో వచింపబడినట్టిది, ఈ వేదములను మన పూర్వీకులైన మహర్షులు పరిశోధించి నిగూఢ భావములనుగూడ సుబోథకమగుటకునై, శాస్త్రరూపమున వివరించిరి. ఈ శాస్త్రమునకే ధర్మశాస్త్రములందురు.

ఈ రీతిని వేదధర్మములను శాస్త్రరూపమున మన్వాది మహనీయులు వివరించిరి. యీ మహనీయులు మహాయోగ సమాధిలో ఆయుష్కాలమెల్ల వినియోగించుచు దివ్యజ్ఞానమును దివ్యదృష్టి నార్జించి తమ తపోథనముచే, ధర్మ పారావారమనదగు వేదమును మధించి యందలి సారమును ''ధర్మ''మనుపేర వివరించిరి, యీ మహనీయులు. ప్రత్యక్ష, అనుమాన, ఆగమము, మొదలైన ప్రమాణములతో నీ థర్మములను లోకహితార్థమై వివరించిరేగాని హేతువాదనలచేతను, గ్రుడ్డి నమ్మకముల చేతను, మూఢవిశ్వాసముల చేతను, కేవలము ఏదో వ్రాసి తామొక పండితుడుగనో, కవిగనో. నాయకుడుగనో. చలామణియై స్వార్థమును నింపుకొనుటకు వ్రాసిన వ్రాతలు యివిగాదనియు సర్వమానవ శ్రేయమునకై వ్రాసిన థర్మములేగాని వేరుగాదని ప్రతి భారతీయుడు విధిగ నమ్మదగినది. నమ్మునట్లు యితరులను చేయదగినదనియు ప్రతియొక్క సనాతన ధర్మపరాయుణి విధియైయున్నదనియు మరచిపోరాదు.

నేడు మనము కాలకర్మ వశమున మన మహర్షుల వైభవమెల్లc గోల్పోయి దరిద్రులవలె నైతిమి. నాటి మన మహర్షుల వైభవమును మాత్రము జెప్పికొని సంతసించువారమైతిమి. ఆ కాలము వార్లకు వీలుండినదనియు యీ కాలమాన పరిస్థితులకు తగినట్లు ఆనాటి థర్మములనాచరింప వీలులేకున్నదనియు కొందరనువారు లేకపోలేదు. ఇదంత సద్ధేతుకం కాదనిమాత్రం గట్టిగ చెప్పగలను.

ఈనాడు థర్మవిప్లవమధికముగనున్నది. సార్వత్రికముగ నల్లుకొనుచున్న యీ యజ్ఞానాంథకారమును దొలగించు దీపికమునకు ముఖ్యాతి ముఖ్యము. ఎందుకనగా

'కేచిదజ్ఞానతోనష్టాః' తెలియక చెడువారు కొందరు, 'కేచి నష్టాః ప్రమాదతః' తెలిసియుండియు ప్రమాదవశమున చెడువారు మరికొందరు 'కేచిత్‌. జ్ఞానావలేపేన' కొందరు, తెలిసి తెలియని. అల్పమైన జ్ఞానముచే చెడుచుందురు. కేచిన్నష్టాఃవినాశితాః' వేరొకకొందరు, చెడినవారిచే, చెఱుపcబడుచుందురు. యీ రీతిని అజ్ఞానముచే, ప్రమాదముచే అల్పజ్ఞానముచే, చెడినవారినిచూచి చెడిపోవడము వంటి, దోష చతుష్టయము చెడిపోవుటయే విధిగ యేర్పడుచున్న యీ తరుణమున జ్ఞానులైన పెద్దలెల్లరు, మన సనాతన థర్మప్రబోధమెంతేని చేయదగు తరుణ మాసన్నమైయున్నది. యీతరుణమున మన విధ్యుక్త థర్మమే యెరుంగ నేరనిచో మన సంతతివార్లను సహితము థర్మ భ్రష్టులుగcజేసినవార్లము కాకపోము ఇందుకుతోడు పరంపరగా వచ్చు వేద విద్యాభ్యాస మడుగంటుటయు సంస్కృత భాషా పరిచయము సన్నగిల్లుటయు, మహర్షుల దివ్యబోధనలను మహామహిమలను నెఱుగనేరకయు తటస్థించుచున్నది.

నిఋక్తములో చెప్పినరీతిని ''సాక్షాత్కృతధర్మాణ ఋషయోబభూవుః అనునట్లు మన పూర్వీకులెల్లరు దర్మవేత్తలైన మహర్షులు, యీ మహనీయులు మన హితార్థమై, వేద వేదాంగములను సంపాదించి మనకు వంశ పరంపరగా ననుభవించు ధనముగ నొసంగియున్నారు. యీ విషయమునుగూర్చి యే నిరుక్తముననూ గలదు. తేతేవరేభ్యో సాక్షాత్కృత దర్మభ్య, ఉపదేశేన మంత్రాన్‌ సంప్రాదుః, ఉపదేశాయ గ్లాయంతో వరే బిల్మ గ్రహణాయే గ్రంధం సమామ్నాసిషుర్వేదంచవేదాంగానిచ'' అని నిరుక్తమున, ೧೬,లో యాస్కమహవర్షి వచించిన అమృత వాక్కులివి.

ఇట్టి యాచారధర్మాదులు కాలకర్మ వశమున పట్టుదప్పి కాcపుదల లేకరూపుచెడి నశించుచున్నవి. సాత్వికస్ఫూర్ధులు తొణికిసలాడు, ఆర్యసంతతియొక్క వర్చస్సేమాఱి పోవుచున్నది. చిత్తైకాగ్రతయు శరీరదార్ఢ్యము లేక బుద్ధి వికాసము సన్నగిల్లి యీ దురవస్థకు దిగజారువారమగుచున్నాము. యీ దోషనివారణమునకు కొకటే యొకమార్గమున్నది. సాధన సంపత్తి నెఱీంగి వేదశాస్త్ర విహితంబైన మార్గమునc జరింతుమేని మన కసాథ్యమెద్దియు లేదు చిత్తైకాగ్రము, ఆహారవిహార నియమము, ప్రాణా యామాఖ్యాసము, వేద శాస్త్రములు నేర్చుట స్వధర్మానుష్ఠానముచే నీదుర్గతిని తొలగింపజేసికొనగలము.

మన వేధశాస్త్ర విహితమైన ధర్మాచరణముచే చిత్తమాలిన్యము తోలంగును. చిత్త సంస్కారమగు కొలది ధర్మాచరణము ప్రబలును తద్వారా జ్ఞాన వికాసాదులు గలుగగలవు.

అందుచేతనే 'వేదోదితం స్వకంకర్మ నిత్యం కుర్యా దతంద్రితః తద్ధికుర్వన్‌ యధావక్తి ప్రాప్నోతి పరమాంగతి మే అని వ్యాసభగవానులు, వైదిక సాంప్రదాయ సిద్ధమైన, కర్మాచరణము ముఖ్యాతి ముఖ్యమని వచించెను.

ఈ వేదోదితమైన కర్మాచరణముద్వారా ''పరమాంగతిం'' పొందనర్హులగునురని వ్యాసభగవానుల లోకహిత వచనములను బలపరుచుటకై ఆదిశంకర, భగవత్పూజ్య పాదులు సహితము 'వేదో నిత్యమధీయ తాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం|| అని, వేదాధ్యయనము వేదమున చెప్పిన కర్మానుష్ఠానము, ముఖ్యాతి ముఖ్యమని వచించెను. ఇన్ని తెలిసిననూ యిప్పుడు మనవల్ల నేమగునులే! యనిగాని, ఎవరో పండితులైనవారే యీ వైదిక కర్మానుష్ఠాన మాచరింపదగిన దనిగాని నిరుత్సాహబడదగదు

అనుగన్తుం సతాంవర్త్మ కృత్స్నంయది నశక్యతే

స్వల్పమవ్యనుగన్తవ్యం మార్గస్థోనావసీదతి|| అను నానుడి చొప్పున వేదచోదితములైన కర్మలను సంపూర్ణముగా నాచరింప శక్తి లేకపోయిన నూ యధాశక్తి నేని ననుసరింప దగును. గారిని వెళ్ళువాడేనాటికేని పడి పోడుగదా!

''వేదో నారాయణః సాక్షాత్‌, తదఖ్యాసే మహా& భ##వేత్‌' అని హేమాద్రియను, యాదవరాజ మహామంత్రి తన థర్మశాస్త్రమున వేద ప్రాముఖ్యమును గూర్చి వచించెను వేదాభ్యాసము చేయువారు మహనీయులని వాకొనెను. కనుకనే, ఆరణ్యకశ్రుతిలో 'బ్రాహ్మణభ్యో వేదవిద్యోదివేదివే నమస్కుర్యాత్‌'' అని గలదు. వెదవేత్తలైన బ్రాహ్మణులను చూచినచో ప్రతిదినము నమస్కరింపుమని పై వేదవాక్కునకు భావము.

కనుకనే ''వేదోఖిలంథర్మమూలమ్‌'' సమస్త ధర్మములకు వేదమే మూలమందురు. ''ధర్మమూలంవేదమాహుః'' అనియు పై విషయమును గూర్చి మరియొక మహనీయుడంగీకరించెను. ఆపస్తంబ మహర్షిపుంగవుడు పైయిరువురి మహాత్ముల భావాలను గూర్చి వివరించుచు ''థర్మజ్ఞసమయః ప్రమాణం వేదాశ్చేతి'' యని వచించెను. ''వేదమూలాః స్మృతయః'' యని శంభుడను ఋషీశ్వరుని వచనము.

అందుచేతనే 'శ్రుతింపశ్యన్తి మునయఃస్మరన్తిచ తదాస్మృతిం| తస్మాత్‌ ప్రమాణముభయం ప్రమాణౖఃప్రమితంభువి అని నుడివిరి, మహర్షులు వేదములలోని థర్మములను స్మరించిరి. ఆ స్మరించ నథర్మములను 'స్మృతులు' అనుపేర వ్రాసిరి. కాన యీ వేదములనదగిన శ్రుతులును. శ్రుతులలో థర్మములను స్మరించి వ్రాసిన స్మృతులును రెండు లోకమానమనవంటి మానవ సామాన్యమునకు ప్రమాణభూతములైనవి యనినిర్ణయించిరి.

కాన ''ప్రమాణాని, ప్రమాణజ్ఞైః పరిపాల్యానియత్నతః| సీదన్తిహి ప్రమాణాని ప్రమాణౖః ఆవ్యవస్థితైః అను రీతిని వేదశాస్త్రముల రెంటిని ప్రయత్నముచేతనేని రక్షించుచుండదగినది, రక్షించడమనగా నందలి థర్మములను యథాశక్తిని ఆచరించుటయే రక్షణమునకు చరితార్థము

ధర్మంశ##నైఃసంచినుయాత్‌, వల్మీకమివవర్తికా|

పరలోక సహాయార్థం, సర్వభూతాన్యపీడయ&.

ఈ వేదశాస్త్రములలో చెప్పిన సనాతన దర్మములను మనము యధా శక్తిని ఆచరించుచునె యుండదగినది. ఎట్లనగా చీమలు పుట్టను పెట్టి పెంచులాగున ధర్మ వృద్ధిచే మానవునకు కల్గు ఫలములు రెండు. ఒకటి ఈ లోకమున సర్వులకు బాధను కలిగించనట్టి సుఖజీవనము మరొకటి పరలోకమున సుఖ సంతోషములు బడయు సాధన సంపత్తికి కారణము గాగలదు. అందుచేతనే ''ధర్మేణహి సహాయేవ తమస్తరతిదుస్తరమ్‌||'' అనిరి. ఎంతటి దుస్తరమైన బాధనుంచియేనియు ధర్మముయొక్క సహాయముతో తరింపగల్గుచుందురు.

కనుక వైదిక ధర్మమునుగూర్చి మన పెద్దలంతగా నాచరించుచు నాచరింపజేయ విథిగ ప్రయత్నించుచు వచ్చిరి. ఎందుకనగా ''ప్రధానం వైదికం కర్మ గుణభూతం తధేతరత్‌ | గుణనిష్ఠః ప్రధానంతు, హిత్వా గచ్ఛత్యధోగతిమ్‌''|| అనియనిరి. వేద ధర్మ ప్రోక్తమైన కర్మాచరణము తుచ్ఛమని మానివేసినచో అధోగతిపాలగుదురేగాని వేరు గతేలేదు. అందుచేతనే

''యావైదికమనాదృత్సకర్మ. స్మారేతిహాసకం|

మోహాత్యమాచరే ద్విప్రోనసపుణ్యనయుజ్యతే||''

ఎవరైతే. వేదమార్గ ప్రతిపాదితమైన కర్మలను వదలివేసి అనగా ఆచరించక మాని, అన్యములైన వానిని యాచరింప చూచినచో పుణ్యగతులు లేవనిరి.

శ్రౌతం కర్మనచేచ్ఛక్తఃకర్తుం స్మార్తం సమాచరేత్‌ |

తత్రాప్యశక్తః కరణకుర్యాత్‌ ఆచారమంతతః||

శ్రౌతసంబంధమైన యజ్ఞయాగాదులు చేయుటముఖ్యము. అట్లు చేయ శక్తిహీనులైనచో, స్మృతికర్మలనేని యాచరింపదగుననిరి. ఇవియు చేయనొల్లనిచో ఆచారవంతుడుగనేని మెలంగుచుండవలయుననిరి. శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠానములెల్లయు మూఢప్రాయముగ నాచరింపక, వానియొక్క యర్థము నఱింగి యాచరించినచో ఫలాధిక్యముమెండు కాన

''జ్ఞాన యుక్తస్యకర్మణః ఫలాధిక్యం, ఛందోగాః ఆమనన్తి అను నానుడి చొప్పున, వేదదశాస్త్ర సంబంధమైన సంధ్యా వందనాది కర్మలెల్లయు, కాలము - ఫలము అర్థము తెలిసికొని ఆచరించునెడల ఫలాధిక్యముగలదని పెద్దల తలంపు, ఈ యర్థమే ''యదేవ విద్యయాకరోతి తదేవ వీర్య వత్తరంభవతి'' అని పెద్దలు పై శాస్త్ర భావాలకు ప్రమాణముగ నీవేద శ్రుతిని ప్రమాణముగ భావించుచుందురు,

దీనివలన తేలిన సారాంశ##మేమనగా మానవుడు ఇహపర సాధనార్థమై వైదిక కర్మలాచరించుట విధియనియు, అందులోను, అర్థము తెలిసి కొని యాచరించు నెడల ఫలము మెండనియు తేట తెల్లము. అందుచేతనే

''యజ్ఞానాం తపసాంచైవ శుభానాంచైవ కర్మణాం|

వేదఏవద్విజాతీనాం నిశ్రేయ సకరః పరః||

యజ్ఞానాం - శ్రౌతస్మార్తానాం, తపసాం - కాయసన్తాప రూపాణాం చాంద్రాయణాదీనాం, శుభానాంచ కర్మణాం - ఉపనయనాది సంస్కారాణాం, అవబోధకత్యేన. వేద ఏస ద్విజాతీనాం పరమో - నిశ్రేయ సకరో మోక్షకరోనాన్యః, వేదఏ వెతి తన్మూలత్వేన స్మృతేః అపిఉపలక్షణార్థం ''అను వాఖ్యరీతిని'' శ్రౌతస్మార్తకర్మలకును చాంద్రాయణాది తపస్సులకును, వేదమే ప్రధానము. ఆరీతిని స్మృతులును పదమ ప్రమాణములుగ నొప్పుచుండును.

తవసశ్చ పరస్యెహ నిత్య స్వాధాయవాన్‌ ద్విజః నిత్యము వెదాభ్యాసమొనర్చుచుండునెడల నదియే తపస్సుగ ప్రకాశించగలదు. కాన ''పరస్యచ తపసః చాంద్రాయణాదేః, యత్భలం తదపి నిత్య స్వాధ్యాయ వానా ప్నోతి'' అనవరతము వేదాభ్యాస మొనర్చుచుండునేల, చాంద్రీయణాది తపములచే గల్గు ఫలమెల్ల వేదము పఠించు విప్రునకుc గలుగ గలదు.

మఱియు వేదశాస్త్రములయొక్క యాధిక్యమునుగూర్చి యోగవాశిషమున నీరీతి నుగ్గడింపబడియున్నది.

''యదాస్మాత్ర్పాప్యతే శాస్త్రాత్‌ తత్తద్వేదాదవాప్యతే.

అస్మిక్‌ జ్ఞాతే క్రియం జ్ఞానం ద్వయం యాతిపవిత్రతాం శాస్త్రము చేసెద్ది యెరుంగదగునో దానినే వేదముచేతను నెరుంగదగును. కాన వేదశాస్త్రములు రెండు ప్రమాణములు. కనుకనే

''దృడ బద్ధ ధర్మమూలః, వేదస్కంధః పురాణ శాఖాఢ్యః

క్రతుకుసుమః మోక్షఫలః మధుసూదన పాదపః. జయంతి''

అని ధర్మము మూలము, వేదము స్కంధము, పురాణములు, శాఖలు, యాగములు. పుష్పములు, మోక్షము ఫలము పరమేశ్వరుడు, యీవృక్షమునకు వేరువంటివాడు గాన జయమగుగాక యందురు. అనగా వేద కార్యములచే పొందు ఫలముచే విజయము లభించుగాక యని భావము.

కొందరు కర్మతుచ్ఛము జ్ఞానముమిన్న యను భావముచే కర్మమార్గ ప్రవర్తకులుగాక భ్రష్టులగుచుందురు. అట్టిభావము కలుగకుండుటకై యోగవాశిష్ఠమున

''మోక్షస్య కారణంకర్మ? జ్ఞానంవా? మోక్షసాథనము

భయంవా? వినిశ్చిత్య ఏకం కథయ కారణమ్‌''|| అను ప్రశ్నకు

''ఉభాభ్యామేవ పక్షాఖ్యాం, యధా, ఖే. వక్షిణాంగతిః

తధైవ జ్ఞానకర్మాభ్యాం జాయతే పరమంపదయ్‌,

అని మోక్షమునకు కర్మ కారణమా? లేక జ్ఞానం కారణమా? రెండు కారణములేనా? యని యడుగగా. పక్షి యాకసమున యెగురుట కెట్లు రెండు రెక్కలు ముఖ్యమో నారీతిని మోక్షపదము చూఱగొనుటకు గూడ వేదబోధితములైనకర్మజ్ఞానములు రెండు ముఖ్యములని నిర్ణయించిరి. కాన కర్మాచరణము యత్యంన్తావశ్యము.

ఈకర్మజ్ఞానములురెండు యనవసరములే మరియు నీరీతిని వచించిరి.

కేవలాత్‌ కర్మణో జ్ఞానాన్నపి మోక్షోభిజాయతే కిన్తూ

భాభ్యాం భ##వేన్మోక్షం సాధనం తూభయంవిదుః

కేవలము కర్మ కారణముకాదు, కేవలము జ్ఞానము మోక్షమునకు కారణములు కాజాలదు కర్మజ్ఞానములు రెండూ మోక్షమునకు కారణభూతములు గాన వేద సంబంధమైన కర్మజ్ఞానములు రెండు ప్రధానములగుచున్నవి.

ఇందుకై యోగ వాశిష్ఠమున నొక యుపాఖ్యానముగలదు. కాని యా కథయంతయు వివరిమించడందనవసరము, అవసరమున్నచో నందు విపులముగ చూడనగును. సంక్షేపముగ మాత్రము వచింతును.

అగ్ని వేశ్యుడని యొక మహర్షిగలడు. అతనికి కారుణ్యుడనియెడి పుత్రుడు గలడు ఈ కారుణ్యుడు, ఉపనయనానంతరము విద్యాభ్యాసమునకై వెళ్లి, వేదశాస్త్రముల నెల్ల పఠించి యింటికివచ్చెను. అనవరతము జ్ఞానమె ముఖ్యాతి ముఖ్యమని భావించి కర్మాచరణముమాని మెలంగుచుండెను.

ఈ కుమారుని ప్రవర్తననము తండ్రి గుర్తించినవాడై నిటు ప్రశ్నించెను.

''కీమేతత్‌ పుత్రకురుషేపాలనంనస్వకర్మణః''

నీ వెందుకీరీతిని నిత్య కర్మానుష్ఠానమును పాలించుట లేదు?

''అకర్మనిరతః కథం సిద్ధింప్రాప్స్యసితద్వద|''

కర్మాచరణములేనిది సిద్ధిని నీవెట్లు పొందగలవు? అనగా దైవసంబంధమైన శక్తిని (సిద్ధి) నీవెట్లు పొందగలవు?

''కర్మణోస్మాన్నివృత్తేః కింకారణం తన్ని వేద్యతాం''

కర్మాచరణము మానినందులకుగల కారణమును వచింపు? మని ప్రశ్నించెను,

ఎందుకనగా ''యావజ్జీవమగ్ని హోత్రం| నిత్యం సంధ్యాముపాసయేతీ|

ప్రవృత్తి రూపోధర్మోయం| శ్రుత్యాస్మృత్యాచ చోదితః||

అను ధర్మానుసారము జీవితపర్యంతము, ఔపాసనము, నిత్యము సంధ్యావందనము వదలక యాచరింపదగిన ప్రవృత్తి రూపమనదగిన ధర్మమయ్యది వేదశాస్త్రములచే నిర్ణయింపబడిన విధులుగదా! వీనిని నీవెట్లు వదలి వేయగల్గితివో వచింపుమని వేడగ పుత్రుడైన కారుణ్యుడు నిరుత్తరుడై తండ్రి యాజ్ఞచే కర్మాచరణమునకు పూనుకొని సిద్ధిని బడసినట్లుగలదు. ఈ యుపాఖ్యానముచే తేలిన సారాంశ##మేమనగా తాము తొలుత కర్మాచరణమునకు పూనుకొనియుండి బిడ్డలకు సహా వేదశాస్త్ర సిథ్ధములైన కర్మజ్ఞాన మార్గములు ప్రబోధించుటకు తగిన యర్హత సంపాదించుకొని యుండడమవసరము. కానీ నేడు తండ్రులకు తొలుత తెలియదు, బిడ్డలకు యీ వేదశాస్త్ర జ్ఞానముయొక్క యావశ్యకతను గూర్చి బోధించుదామనే తలంపేని తలంపరు. ఈ రితిని దుస్థితికివచ్చి కర్మ భ్రష్టులుగ మారుచుండుట మిక్కిలి శోచనీయము.

మనము కర్మాచరణము చేయకున్ననూ మన సంతతియేని కర్మజ్ఞానములను సాధించి వంశోద్ధారకులు కావలయుననెడి తలంపు గలుగవలయును. ఎందుకనగా,

''కాలే కాలే పృధక్‌ బ్రహ్మస్‌ భూరివీర్య విభూతయః|

భూతేష్వభ్యుదయం యాన్తి, ప్రతీయన్తేచ కాలతః|

అను ధర్మానుసారము బల సంపదలు ఒక్కొక్క కాలమున ఒక్కొక్కని యందు వికసించి వృద్ధిపొంది లీనమగు చుండునుగాన, ఎవని యదృష్టవశమున నేరీతినేని వేదశాస్త్ర జ్ఞానబలముచే కర్మాచరణమాచరించి, యితరులకు మార్గదర్శికుడై రాణించెడి సంపదచే దైవబలమున నెవరి యందెట్లెట్లుండునో? గదా! కాన మనమాచరింపలేకపోయిననూ నిరుత్సాహబడక బిడ్డల నేని యుత్తమ కర్మిష్ఠులుగ తీర్చవలసిన ధర్మము ప్రతి తల్లి దండ్రలందును విధిగ నున్నదని విస్మరించరాదు.

''జయత్యధిక యత్నవా&'' అను నానుడి చొప్పున యెక్కువగా ప్రయత్నించుకొలది జయము సాధించగల్గుటకు వీలుండును. అందుచేతనే ''సర్వేణ పౌరుషాతీ సమవాప్యతే''యనియందురు. పురుషప్రయత్నముచే సర్వమూ సాధింపబడుచుండును. పురుషప్రయత్నమైన కర్మ రెండు విధములుగ నుండునందురు. ''ద్వివిధం విద్ధిపౌరుషం'' ఈ రెండువిధములైన కర్మలనదగినవి పురుష ప్రయత్నమునకే ''ప్రాక్తనం చైహికం చేతి'' అని. ప్రాక్తనకర్మ, యైహిక, కర్మయని రెండు విధములు, ప్రాక్తన కర్మకే. అదృష్టమనియు నామాంతరము. ఈ యదృష్టప్రాప్తి సాథనకె, కర్మాచరణము ముఖ్యమందురు, ఈ కర్మాచరణమునకై మెలంగు విధికే ''సదాచార'' మని నామాంతరము.

''యస్తూదార చమత్కారః సదాచార విహారవాన్‌|

సనిర్యాతి జగన్మోహాత్‌, మృగేంద్రః పంజరాదివ||

అనునానుడి చొప్పున. చతురుడైన సదాచార కుశలుడు, ఈ లోకమోహమను బోను నుండి' సింహము బోనులోనుండి వెలువడి వచ్చులాగుస మోహమునుండి వెలువడగలడు.

''శాసై#్రః సదాచార విజృంభిత దేశధర్మైః|

యత్కల్పితం ఫలమతీవ చిరవ్రరూఢం|

తస్మిక్‌ హృది స్మృరతి చోపన మేతి చిత్త |

మంగావళీ తదను పౌరుష మేత దాహుః||

అనునట్లు మానవుని చిత్తశుద్ధి, జ్ఞానము, వేదాది శాస్త్రముల వలననూ సత్పురుషుల ఆచారాదుల వలననూ, స్వథర్మానుష్ఠానము వలననూ, సత్పలవిద్ధికై, మనస్సున ఉపాయ రూపమున స్మృరింపజేయును, ఈ సత్ఫలమును పొందవలయుననెడి వాంఛయే, పిదప కార్యరూపమున మానవుడుపయోగించును. ఈ కార్యరూపమున మెలంగుటకే ''పౌరుషమని'' పెద్దలు చెప్పుదురు. కాన తన చేతగాలేదే! యని నిరుత్సాహాబడక తన సంతతివారేని సాధింపదగు రీతిని సత్కర్మాచరణమునకై దోహద మొసంగుట విథియై యున్నది. ఎందుకనగా

పుత్రేణ లోకా& జయతి పౌత్రేణా నంత్యమశ్నుతే|

అధ పుత్రస్య పౌత్రేణ నాకమే వాధిరోవాతి||

యను థర్మము ప్రకారము ధర్మబద్ధమైన పుత్రునిచే లోకములు జయింపవచ్చును, ధర్మబద్ధమైన పౌత్రునిచే సమస్తము బడయవచ్చును, కాన పుత్ర పౌత్రులు ధర్మవంతులై సత్కర్మానుష్ఠాన ధురీణులై యున్నచో ఇహపర సుఖములెల్లయు పొందననువగును గాన,

సప్తపరాన్‌ సప్తపూర్వా& షడన్యాస్‌ ఆత్మసప్తమాన్‌

సత్పుత్ర మథిగచ్ఛానః తారయే దేనసో భయాత్‌ ||

సత్పుత్ర జననముచే తనకు మునుపుండిన యేడ్గురి తరింపజేయును. అనంతర మేడ్గురిని తరింపజేయగలడు గాన సత్పుత్రి జననమవసర మందురు.

ఈ సత్పుత్ర జననమునకుగాను. వైదికి కర్మానుషానమున. పుంసవన సీమంత జాతకర్మ నామకరణాది సంస్కారములు విధిగ జేయవలయునని సూత్రకారులు నిర్ణయించి యున్నారు.

ఈశ్వర సాన్నిథ్య ప్రాప్తికిగాను మన పూర్వీకులైన వేద వేత్తలగు మహర్షులు నలువది సంస్కారములను. ఎనిమిది ఆత్మగుణములను యేర్పరచి యున్నారు. ఇది యన్నియు స్మృతిరూపాలనియు పెద్దలందురు. స్మృతులు యిరువదియెన్మిది గలవు. ఇందులో పదునెనిమిది ముఖ్యములు మిగిలిన పదియు యుపస్మృతులందురు, మనువు. యాజ్ఞవల్కులు, హరితులు, పరాశరులు మొదలైన మహనీయులీ స్మృతికర్తలు,

ఈ స్మృతులను శ్రుతులను పరిశీలించి' ఆపస్తంబమహర్షి, ఆశ్వలాయన మహర్హి, బౌధాయన మహర్షి, మొదలైన వేద వేత్తలు సూత్రములను రచించిరి. వీనికే ఆపస్తంబ మహర్షి సూత్రము. ఆశ్వలాయన మహర్షి సూత్రము. బౌధాయన మహర్షి సూత్రము అని వ్యవహరించుచుందురు.

ఈ సూత్రముల సహాయమున వేదమంత్రములను మనమెట్లెట్లు యేయేకార్యములకు వినియోగించుకొనునది తెలిసికొనగల్గు చున్నాము యీవైదిక కార్యములకే ''సంస్కారములనెడి నామాంతరము గలదు ఈ సంస్కారములు నలువది.

''సంస్రియతే జ్ఞానమోగ్యతాం ఆపద్యతే పురుషస్య చిత్తం అనే నేతి సంస్కారహః అను వ్యుత్పత్తి ననుసరించి, మానవుని మనస్సు బ్రహ్మజ్ఞానమునుc బొందుటకు యోగ్యమగురీతిని సంస్కరింపబడునుగాన ''సంస్కార'' మని వ్యవహారము, యీచత్వారింశత్సంస్కారములచే గల్గుఫలమేమనగా

''చత్వారింశత్సంస్కారా, అష్టావాత్మ గుణాశ్చ

సబ్రహ్మణస్సాయుజ్యం సాలోక్యంచ గచ్ఛతి''

''యస్యఖలు సంస్కారాణాం ఏక దేశోపి, అధాష్టావాత్మ గుణాయది సబ్రహ్మణః సాయుజ్యం సలోకతాంచ గచ్ఛతి'' అను గౌతమ ధర్మసూత్రములో (೮ ೧೪ ೨೪) చెప్పిన రీతిని' ఎవడీ నలువది సంస్కారములు గలిగి ఎనిమిది ఆత్మగుణములు గలిగియుండునో నట్టివాడు బ్రహ్మలోకమునుబొంది బ్రహ్మసాయుజ్యము నందగలడు.

ఒకవేళ నలువది సంస్కారములను సంపూర్ణముగ బొందక బోయిననూ. కొన్నింటినేని పొందియుంటి, ఆత్మగుణాష్టకముతో కూడియున్న చో అట్టివాడు సహితము బ్రహ్మసాయుజ్య పదవి నందగలడు.

''సచ సంస్కారః శ్రవణాదేసతి జ్ఞానే ఉవకరోతి'' ఈ సంస్కారములు. వేదాన్త విషయకమైన, శ్రవణ మనన నిధిధ్యాసాదులు గలిగి నప్పుడు, మానవునకు జ్ఞాన విషయమున నుపకరించగలవు,

పందొమ్మిది సంస్కారములకు ''బ్రహ్మ సంస్కారములందురు. ఎనిమిదింటిని ''పితృకర్తృకములందురు. నాలుగింటిని అచార్య కర్తృకములని పేరుః ఏడింటిని స్వకర్తృకములని వ్యవహారము ఇరువదొకటికి దైవ సంస్కారములు. అనియు నందురు, దయాదాక్షిణ్యాది యెనిమిదింటిని ఆత్మగుణములందురు. వీని వివరణము సవివరముగ నిందు పరిశీలించెదను పరికింతురుగాక:-

పితృకర్తృకములన దగిన యెనిమిది సంస్కారము లెవ్వియన, 'గర్బాధాన, పుంసవన, సీమంతోన్నయన, జాతకర్మనామకరణాన్న ప్రాశ చౌలోపనయనములనదగిన యెనిమిది సంస్కారములు బాలునికి గాను తండ్రి జేయదగిన సంస్కారములు.

ప్రాజాపత్య, సౌమ్య, ఆగ్నేయ, వైశ్వదేవములనదగు నాలుగింటిని ఆచార్య కర్తృకములు అనగా సంస్కారములు చేయించు, గురువు (పురోహితుడు) చేయదగినవి వీనినే ''వేదవ్రతములనియు నామాంతరముగ వ్యవహారమున్నది.

సమావర్తన, సహధర్మచారిణీ సంయోగ, దేవ, పితృభూత, మనుష్య బ్రహ్మ యజ్ఞాదులున్ను చేరి యేడింటిని తానే స్వయముగా చేయదగిన సంస్కార సప్తకము.

ఆష్టక, పార్వణ, శ్రాద్ష, శ్రావణీ. ఆగ్రహాయణీ, చైత్రీ అశ్వయుజీ, అగ్న్యాధేయం. అగ్నిహోత్రం, దర్శ పూర్ణమాస. చాతుర్మాస్యాని. ఆగ్రయణష్టి, నిరూఢపశుబంధ సౌత్రామణీ, అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ. ఉక్థ్యన. షోడశీ వాజపేయ, అతిరాత్ర. అప్తోర్యామ. నామక ఏకవింశితి సంస్కారములు దైవ సంస్కారములు అని యందురు.

దయా, క్షాన్త్యన నూయా శౌచానాయాస మాంగల్యకార్పణ్యా స్పృహాదులనదగు నెనిమిది గుణములు ఆత్మగుణములని పేరు. ఈ నలువది సంస్కారములు, ఎనిమిది ఆత్మగుణములు కలిసి, అష్టాచత్వారింశత్సంస్కారములని సంస్కారుల నిర్ణయము.

శ్రీశ్రీశ్రీ జగద్గురు వర్యులు కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు చంద్రశేఖరేంద్ర గురువర్యులొకచోట నీ సంస్కారముల ప్రాముఖ్యమునుగూర్చి వంచించు నిట్లనిరి, ''కర్మ'' అంటే యేమిటి? పని. ఒకబట్ట తయారుకావాలంటే, పూర్వాం గంగా నెన్నో పనులు చేయాలి, అట్లె ఒకడు ఆత్మవేత్త కావాలంటే యెన్నో పనులు చేయాలి. గుణకర్మలతో నీ పనులు చేయాలి. ఈ పనులకే ''సంస్కారములని పేరు,

ఒక పదార్థనికున్న దోషం పోగొట్టి దానిని గుణవంతంచేసేది సంస్కారం. జీవాత్మకున్న దోషాలను పోగొట్టి గుణపూర్ణం చేయడానికేర్పడిన కార్యాలే సంస్కారాలు.

యీ సంస్కారములలో మొదటిది ''గర్బాధానము|| ''గర్బః ఆధీయతే యేననిషిక్తం వీర్యం అమోఘం భవతి తథ్గర్బాధానం.'' అను వర్ధముప్రకారము అమోఘమైన వీర్యముచే గర్బము ధరింపబడు సంస్కారము గాన గర్భాదానమందురు దీనినే ''నిషేకః యనియువ్యవహరింతురు ''నిషేకాత్‌ బైజికం, చైనోగార్భికంచాప మృజ్యతే'' యనగా ఈ సంస్కారముచే బీజ దోషము గర్భదోషము శాంతించునుగాన నిషేకమనియు నందురు. బీజదోషశాంతి, గర్భదోష శాంతికిగాను చేయు సంస్కారమయ్యది తొలుత జన్మమెట్లు కలుగునది యెరుంగుట యవసరము.

''పుణ్యౖః దేవత్వమాప్నోతి. పాపైస్థావరతామియాత్‌|

సమాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం ప్రాప్నుయాన్నరః||

అను సూతసంహిత వచనము ప్రకారము పుణ్యముచె దైవత్వము పాపత్వముచే. నీచపుజన్మ. పుణ్యపాప మిశ్రముచే మనుష్యత్వము లభించును. ఈ వచనమునకు తగిన వేదవాక్యమిట్లుగలదు ''(పుణ్యౖర్దేవత్వం ఇతిపుణ్యన పుణ్యం లోకంజయతి. పా పీన పాపం, ఉభాభ్యామేన మనుష్యలోకం ఇతి శ్రుతిః)

సూర్యాద్వృష్టిః, వృష్టేః ఓషధయః, ఓషధీభ్యోన్నం,

అన్న పానంచ నిత్యం భుంక్తేచ మానవః | పంచభూతాత్మకం|

భుక్తం. అష్ట సారాత్మనాద్విధా|

సూర్యుని వలన వర్షము. వర్షమువలన పంటలు. పంటలవలన ధాన్యము (అన్న పదార్థములు) అన్న పానములను మానవుడు గ్రహించుటచే యెనిమిది విధములైన ధాతువులు శరీరమున వృద్ధియగుచుండును.

ఈ యష్టధాతువులు ''కిట్టం వురీషం మూత్రాస్థి మేదోమజ్జాత్మనా భ##వేత్‌ యనురీతిని ''శుక్ల శోణిత. పురీష మూత్రములు, ఎముకలు మేధస్సు మజ్జధాతువు'' అనునవి శరీరమున వృద్ధినొందును.

''అగ్నినావర్ధతే మజ్జా'' అనురీతిని ''మజ్జాధాతువు అగ్నివల్ల వృద్ధిపొందును. ''లోహీతంవర్థతే జలాత్‌'' జలతత్వముచే ''లోహితధాతువు వృద్ధిపొందును. ''భువామా ంసస్య వృద్ధిస్యాత్‌'' భూతత్మముచే మాంసము వృద్ధిపొందును.

ఆకాశాద్ధాతవః సర్వేవర్ధంతే, వాయునాబలమ్‌'' అను రీతిని ధాతువులన్నియు వాయుతత్వముచే, ఆకాశతత్వముచేతను. వృద్ధిపోందును,

''శుక్ల శోణిత సంయుక్తం కలిలం బుద్బుదంతధా'' స్త్రీపురుష సంయోగముచే నేర్పడు శుక్లశోణితములచే ఏకరాత్రోషితం కలిలం'' అనునట్లు ''కలిలం'' అను పేర చేరియుండును.

సప్తరాత్రోషితం బుద్బుం భవతి'' ఏడు దినములు స్త్రీ గర్భమున బుద్భుదాకారమున (నురుగుగ) నుండును.

''అర్ధమాసాభ్యన్త రే పిండోభవతి'' పదు నేను దినములకు పిండా కారము వహించును.

మాసాభ్యన్తరేణ కఠినోభవతి'' ఒక నెలకే పిండము గట్టిబడును,

''మాసదృయేన శిరఃకురుతే'' రెండు నెలలకు శిరస్సు మొలచును,

మాసత్రయేణ పాదప్రదేశోభవతి'' మూడు నెలలకు పాదములు మొలచును.

''చతుర్ధేమాసి, అంగుళి, జఠర, కటివ్రదేశా భవన్తి''

నాలుగవ మాసమున, వ్రేళ్ళు, కడుపు, నడుము యేర్పడును.

పంచమేమాసి వృష్ఠ వంశోభవతి, అయిదవనెలలో వెన్నెముక యేర్పడును

షష్ఠేమాసి, నాసాక్షిణి శ్రోత్రాణిభవన్తి'' ఆరవనెలలో ముక్కు చెవులు, కండ్లు యేర్పడును.

''సప్తమేమాసి జీవేన సంయుక్తోభవతి'' ఏడవనెలలో జీవుడు ప్రవేశించును.

''అష్టమేమాసి సర్వాంగ సంపన్నోభవతి'' ఎనిమిదవ నెలలోసర్వావయవములు యేర్పడును.

నవమేమాసి సర్వలక్షణ సంపూర్ణోభవతి'' తొమ్మిదవనెలలో సర్వలక్షణ లక్షితమైన యాకారముతో శిశువుగ మారును.

ఈ రీతిని యెనమిదవ మాసంనుంచే గర్భస్థ శిశువు పూర్వజ్ఞాన విశేషముచే ''పూర్వజాతిం స్మరతీ,తి, కృతాకృతంచకర్మ భవతి, శుభాశుభం చకర్మ విందతీతి గర్భోపనిషత్‌'' అను గర్భోపనిషత్తులో చెప్పినరీతిని శిశువు గర్భమున పూర్వజ్ఞాన బలముచే, నానాయోనులలో జన్మించిన తెరంగు. పూర్వజాతి, మంచి చెడులను. చేయదగిన కార్యములు చేయరాని, కార్యములు స్మరించుచుండును.

''నానాయోని సహస్రాణి దృష్ట్యా చైవతతొమయా''

ఆహారాః వివిధాభుక్తాః పీతా నానావిధాస్తనాః

జాతసై#్యవమృతసై#్యవ జన్మ చైవపునః పునః

అహోదుఃఖోదధేమగ్నోన పశ్యామి ప్రతిక్రియాం|

అని గర్భస్థ శిశువు పూర్వజ్ఞానముచే, పలు జన్మలు యెత్తితిననియు. తల్లి గర్బమున ఆహారాదులు భుజించితిననియు, స్తన్యముగ్రోలితిననియు, పుట్టుక గడచుచున్న దేగాని ఈ దుఃఖమునుండి విడి వడు మార్గము కనుగొన నేరకున్నాననియు వాపోవుచుండును.

''యోని ద్వారేణ సంప్రాప్తో, యంత్రేణా పీడ్యమానో

మహతా దుఃఖేన జాతమాత్రస్తు వైష్ణవేన వాయునా

సంస్కృశ్యతదాన స్మరతీ

ఇట్లు గర్బమున విలపించు శిశువు యోనిద్వారమున వైష్ణవ వాయుచే త్రోయబడి వెలువడును, ఇది ప్రతిప్రాణి జన్మకు సామాన్య ధర్మమై యుండును.

మానవజన్మ యెత్తడము, అందులో పురుషుడై జన్మించడము దుర్లభమందురు దైవానుగ్రహహేతువుచేగాని, మనుష్యత్వముముక్షుత్వాదులు గలుగనేరవు.

''దుర్లభం త్రయమేవైతత్‌ దైవానుగ్రహహేతుకం|

మనుష్యత్వం ముముక్షుత్వం. మహాపురుషసంశ్రయః

అనునట్లు దైవానుగ్రహముచేతనే మానవత్వము గల్గును మానవునిలోను మోక్షము పొందవలయున నెడివారు అరుదు. ఈ జ్ఞానము దైవయోగము చేతనే గల్గును. ఈ జ్ఞానమునకు మార్గముచూపు పెద్దల సేవయు దైవాను గ్రహశక్తి చేతనే యలవడును.

ఈజన్మరాహిత్యమైన జ్ఞానముగలుగ వలయుననినచో ''స్వవర్ణాశ్రమధర్మేణ, తపసా హరితోషనాత్‌| జ్ఞానముత్పాద్యతేపుంసాం| అను శంకర గురుదేవుల యమృతవచనముల రీతిని ఈశ్వరసేవ చేతనే, జ్ఞానము గల్గును. స్వధర్మాచరణము ముఖ్యము. ఈ స్వధర్మాచరణమే. పూర్వము వచించిన, సంస్కారవంతమైన ఆత్మగుణములతో గూడిన కర్మాచరణము, కాన, జీవన్ముక్తిని జన్మరాహిత్యమునకై చేయు ప్రయత్నమునకు, చతుర్వింశతి సంస్కారములు అత్యన్తావసరములైనవి గనుకనే గర్బాదానాది సంస్కారములు విథిగ పాటింపవలసి వచ్చినవని మహనీయులైన మహర్షి పుంగవులే లోకహితార్థమై యాచరించి, మనచే యాచరింపజేయుటకైరి విధిగ నిర్ణయించిరి.

''తస్మాచ్చాస్త్రం ప్రమాణంతే కార్యా కార్యవ్యవస్థితౌ''

అను పెద్దలవచనము రీతిని. చేయదగిన కార్యములు చేయరానికార్యములు అనేవి చికిత్సలో శాస్త్రమే ప్రమాణము. అని గీతలో భగవానుని వచనానుసారము, ఈ వైదిక సంబంధమైన సర్వకార్యములు చేయదగిన విథి శాన్తరీతిని గలదు. కాన శాస్త్రములలో చెప్పిన చొప్పున నాయాకార్యములకు వ్యుత్పత్తులు. విధులు ఫలములు మొదలైనవి విమర్శించెదముగాక

''గ ర్భా దా న ము''

''గర్భ ఆధీయతేయేన నిషిక్తం వీర్యం అమోఘం భవతి,

తద్గర్బాధానం (నిషేకః నిషేకాత్‌ బైజికం చైనోగార్భికం చాపమ్రజ్యతే, అను వ్యుత్పత్తుల రీతిని ఈకార్యమునకు గర్బాదానమనియు, నిషెకమనియు రెండు పేర్లుగలవు, అమోఘమైన వీర్యము గర్బమున ధరింపబడు కార్యము అనిగాని, బీజదోష గర్బదోషములను శాంతింపజేయు కార్యమనిగాని పై రెండు పేర్లకు భావము.

నూతన వథూవరులైనచో ''తతఃవథూవరయోః నూతనవస్త్రాలం కారాదిధారయేత్‌'' యను ధర్మము ప్రకారము నూతన వస్త్రాదులు ధరించవలయును.

స్వగృహే ప్రాజ్ముఖఃకుర్యాత్‌ శ్వాశురే దక్షిణాముఖః

ప్రత్యజ్‌ ముఖఃప్రవాసేచ నకదాచి దురజ్‌ ముఖః

అను వచనముల రీతిని, స్వగృహమున తూర్పు ముఖమున శయనించవలయును, అత్తగారింటిలో దక్షిణాభిముఖుడై శయనించవలయును. ప్రవాసమున పశ్చిమాభిముఖుడై శయనించవలయును. ఎన్నడుగూడ ఉత్తరాభిముఖుడై శయనించరాదు.

దీపేనష్టేతు యస్సంగం కరోతి మనుజోయది|

యావజ్జన్మ దరిద్రత్వం సంతతేర్నాత్రసంసయః

అను విధి రీతిని దీపము లేని తఱిని భార్యాభర్తలు శయనించుదురేని. అట్టి తణిని గలిగిన సంతానము యావజ్జీవము దరిద్రము ననుభవింతురు.

రాత్రౌ శుభలగ్నే గర్భాదానమితి కర్తవ్యం

దంపత్యోః ఆయుర్బలాభివృధ్యర్థం, గర్భాధానాఖ్యం కర్మకరిష్యమాణః'' అని సంకల్పము చేయమని సూత్రకారుల నిర్ణయము, మఱియు, ''అస్యాం భార్యాయాం ప్రధమ గర్భ సంస్కారద్వారా సర్వ గర్బశుధ్యర్థం గర్బాధానాఖ్యం కర్మకరిష్యె'' అనియు వచింపజేతురు.

రాత్రికాలమున శుభకరమైన లగ్నమును నిర్ణయించి, అట్టి శుభలగ్నమున. ఈ ప్రధమ గర్బ సంస్కారముచేతనే. అనంతరము గల్గు సంతాన సంబంధమైన గర్భ సంస్కారములు పరిశుద్ధి జెందులాగున వేద మంత్రములతో పుణ్యాహ వాచన గణపతి పూజాది సంస్కారములు జరపుకొనదగినది.

ఇందుకు తగిన శుభలగ్నము ముఖ్యాతిముఖ్వము సరియైన శుభలగ్నము లేనిచో దంపతుల ఆయుర్మలాదులు క్షీణించుటయేగాక నష్టసంతతి వగైరా దోషములు గలుగ గలవు. కనుకనే జ్యోతిష పండితులిందులకై శుభలగ్నముల నీరీతిని నిర్ణయించిరి.

పాడ్యమి మొదలు పౌర్ణమి వరకును అమావాశ్యకును అధిపతులు గలరు. ఈ యధిపతులు శుభులుగనున్న తిధి ప్రశస్తముగ నిర్ణయించుకొనవలయును. కాన ఆ యాతిథులకుగల యధిపతులను వచింతును. పరికించునది.

1. అగ్నిః ప్రతిపదః - పాడ్యమికి అగ్ని అధిపతి

2. బ్రహ్మా ద్వితీయాయాః - విదియకు బ్రహ్మ

3. పార్వతీ తృతీయాయాః - తదియకు పార్వతి

చతుర్ధాః గణపతిః - గణపతి చవితికి

పంచమ్యాః శేషః - పంచమికి ఆదిశేషుడు

కుమారః షష్ఠ్యా: - కుమారస్వామి షష్ఠికి

సూర్య: సప్తమ్యా: - సూర్యుడు సప్తమికి

శివోష్టమ్యా: - అష్టమికి సదాశివుడు

వసవ : నవమ్యా: - నవమికి అష్టవసుపులు

దిగ్గజా: దశమ్యా: - దిగ్గజములు దశమికి

యమ ఏకాదశ్యా: - ఏకాదశికి యమధర్మరాజు

విష్ణు : ద్వాదశ్యా: - ద్వాదశికి విష్ణువు

మన్మథ: త్రయోదశ్యా; - త్రయోదశికి మన్మధుడు

కలిపురుష: చతుర్దశ్యాః - చతుర్దశికి కలిపురుషుడు

చంద్ర: పౌర్ణమాస్యా: - పున్నమకు చంద్రుడు

అగ్నిష్వాత్తాదిపితర : అమావాశ్యా: - అగ్నిష్వాత్తు మొదలైన పితృ దేవలు అమావాస్యకు

క్రమాదధిపా: - క్రమముగా నధిపతులు,

కనుక శుభతిధులుగ చూచి నిర్ణయించ వలయును,

సూర్య; భానువారస్య - ఆదివారమునకు సూర్యుడు

చంద్ర: సోమవారస్య - సోమవారమునకు చంద్రుడు

అంగారక: కుజవారస్య - మంగళవారమునకు అంగారకుడు

బుథ: సౌమ్యవారస్య - బుథవారమునకు బుధుడు

బృహస్పతి: గురువారస్య - గురువారమునకు బృహస్పతి

శుక్ర: శుక్రవారస్య - శుక్రవారమునకు శుక్రుడు

మంద: శనివారస్య - శనివారమునకు శనియు

వారేశ్వరా: క్రమాద్బవేయు: - వారాధిపతులుగ క్రమముగా గలరు.

స్త్రీ తొలుత పుష్పవతియగు తిధి వారము నక్షత్రము ననుసరించియు వారికి వారి సంతతికిని శుభాశుభములు గలుగ గలవు. వీనిని గమ నింపదగి యున్నది.

1 అశ్వని 2 రోహిణి 3 మృగశిర 4 పుష్యమి 5 ఉత్తర 6 హస్త 7 చిత్త 8 స్వాతి 9 విశాఖ 10 అనూరాధ 11 మూల 12 ఉత్తరాషాఢ 13 శ్రవణం 14 థనిష్ఠ 15 శతభిషం 16 ఉత్తరాభాద్ర 17 రేవతి'' అను యీ పదునేడు నక్షత్రములయందు పుష్పవతియైనచో శుభకరము. అనగా దంపతులకు సంతతికి శుభములు చేకూరుచుండగలవని భావము.

1. భరణి 2. కృత్తిక 3 ఆర్ద్ర 4 పునర్వసు 5. ఆశ్లేష 6 మఖ 7 పుబ్బ (పూర్వఫల్గుణి) 8 జ్యేష్ఠ 9 పూర్వాషాఢ 10 పూర్వాభాద్ర అను నీ పది నక్షత్రములలో తొలుత సమర్తాడెనేని అశుభకరము.

ఈ రీతిని వారములు సహ శుభాశుభములుగలవు.

సోమ - బుధ - గురు - శుక్ర వారములు శుభకరములు. అది - మంగళ - శనివారములు అశుభకరములు.

పై చెప్పిన దుష్ట నక్షత్రములకు యిచ్చు ఫలములేవనగా మఖ - ఆర్ద్ర నక్షత్రములలో ప్రధమ రజస్వలయైన వనిత దుఃఖము ననుభవించును.

పునర్వసు - వ్యభిచారిణి, జ్యేష్ట - కృత్తికలు దరిద్రురాలు భరణి పుబ్బ - పూర్వాషాఢ - పూర్వాబాద్ర - ఆశ్రేషలు తొలిపాదమున వైధవ్యము - రెండవపాదమున గొడ్రాలు, మూడవ పాదమున దరిద్రురాలు. నాలుగవ పాదమున శుభములు బొందును. ఆది - మంగళ - శని వారములలో ప్రధమ రజస్వల యైనచో రోగవంతురాలునగును. కాన వీరికి పరిహారముగ శాంతి వేద సాంప్రదాయము ప్రకారము గలదు. గాన నారీతిని శాంతి జరుపుకొని యనంతరము గర్భాదాన శుభ మహూర్తము నిర్ణయించుకొనవలయును.

ఈ రీతిని మరికొన్ని తిధి వార నక్షత్రాదుల వివరముగలదు, పరికించునది, అనగా రజోదుష్టకాలము లీరీతిని గలవు.

సూర్యోదయాస్తమయ కాలములు, గ్రహణము, అమావాస పౌర్ణమి, బహుళాష్టమి, బహుళచతుర్దశి. మేషాదిసంక్రమణ కాలములు, చవితి షష్టి అష్టమ నవమి ద్వాదశిత్యాజ్వ ఘడియలు, అవమా. త్రిద్యుస్పృక్‌లు, (అవమ-మూడు తిధులుగల వారము) (త్రిద్యుస్పృక్‌ - మూడు వారములతో గూడిన తిధి) పై చెప్పిన దుష్ట నక్షత్రములలో సూర్యుడుండగనూ. ప్రధమావర్తమునకు దోషకరములుగాన యధావిధినీ శాంతి జరుపుకొనుట శ్రేయస్కరము.

మేష మిధున సింహ తులా ధనుః కుంభములు, పుంలగ్నములు గాన నీ పుంలగ్నములు పురుష జననమునకు దోహదకారిగా నుండును.

గర్భదాన లగ్నమున కష్టమరాశిలోనే గ్రహము నుండదగదు. దీనికే ''అష్టమశుద్ధి'' యందురు. ఈ యష్టశుద్ధి లగ్నశుద్ధి ముఖ్యము గర్బాదానమునకు. అష్టశుద్ధిలేనిచో భర్తకాయుః క్షయమగును, సోమ బుధ గురు శుక్రవారములు ప్రశస్తము.

ఈ రీతిని ప్రధమరజస్వలమైన తిది వార నక్షత్రములు చూచుకొని దోషములున్న శాంత్యాదులు జరపుకొని, శుభ తిది వార నక్షత్రలగ్నములు గుర్తించి, లగ్న శుద్ధి అష్టమశుద్ధిగల పుంలగ్నమున నిషేకము యధాశాస్త్రీయముగ జరపినచో గల్గు సంతతి, మంచి ఆయుర్దాయము, అదృష్టము అధికారము. కీర్తి ప్రతిష్టలు తేజోకాంతులు గల్గినవారై మంచి ధర్మాత్ములుగను, నుండగలరు.

2. ''పు ం స వ న ము''

''పుమాన్‌ సూయతేతత్‌ పుంసవనం గర్భ సంస్కారః

అను వ్యుత్పత్తిరీతిని ''ఈ పుంసవనం'' అనబడు సంస్కారముచే పుత్రుడు జన్మించుటకవకాశము గలదు, స్త్రీ గర్భము ధరించినపిదప ''వ్యక్తే గర్భే తృతీయేమాసి శుభతిదే ఫుష్యనక్షత్రే, పున్నక్షత్రేషువా, పత్న్యాః పుం సవనం కర్మ కరిష్య ఇతిసంకల్ప్య'' అనురీతిని గర్భము ధరించిన మూడవ మాసమున పురుషశిశువు జనించుటకుగాను, భర్త ఆయుష్యాభివృద్ధికిగాను చేయు సంస్కారమునకు పుంసవనము (పుంసువనంఅనియు పేరు) అని యందురు.

''శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. మమాయుష్యాభివృద్ధ్యర్థం,

అస్యాం మమ భార్యాయాం జనిష్యమాణ గర్బస్య పుంరూప తాప్రాప్యర్థం, గర్భస్థ పిండశుద్ధ్యర్థం, పుంసవనాఖ్యం కర్మకరిష్యమాణః'' అని సంకల్పింతురు.

ఆయుష్యాభివృద్ధికిగాను. గర్భస్థ పిండ శుద్దికిగాను. పురుషశిశుజన్మించుటకుగాను యీ పుంసవనాఖ్య కర్మ విధింపబడినది.

ఈ సంస్కారమునకు ప్రశస్తమైన తిది వార నక్షత్రములు

అశ్వినీ - రోహిణి - మృగశిర - పునర్వసు - పుష్యమి - ఉత్తర - హస్త - చిత్త - స్వాతి - అనూరాథ - మూల - ఉత్తరాషాఢ - శ్రవణం - ధనిష్ట - శతభిషం - ఉత్తరాభాద్ర - రేవతినక్షత్రములు ప్రశస్తములు.

చవితి - నవమి - చతుర్ధశి - అమావాస్యలు వదలి మిగిలిన తిధులు సోమ - బుధ - గురు - శుక్రవారములు వృశ్చికం సింహం వదలి, మిగత లగ్నములు. సప్తమ నవమరాశులు, శుద్ధిగగల లగ్నమును నిర్ణయించుకొని పుంసవనము చేయునెడల సంస్కార ఫలముబొంద సమర్థులగుదురు.

3. సీ మ ం త ము

(సీమంతో న్నయనం)

సీమంతస్య - కేశరచనా విశేషస్య, ఉన్నయనం - ఉత్తొలనం ఆత్రేతి - సీమన్తోన్నయనం ఇతి గర్బ సంస్కార భేదః కేశరచనా విశేషముచే సీమంతము (పాపట తీయుట) సమానముగ నెత్తియెత్తుచు చేయు నొక గర్భ సంస్కారమునకు సీమంతోన్న యనిగాని లేక సీమంతమనిగాని వ్యవహారము.

''షష్ఠే చతుర్ధేష్టమే ఏతేషా మన్యత మేమాసి సీమంతోన్న యనాఖ్య కర్మకుర్యాత్‌'' అనువిధి ననుసరించి, గర్బము థరించిన దాది, నాలుగవమాసమునగాని, ఆరవమాసమునగాని, అష్టమమాసమునగాని, సీమంతోన్న యనాఖ్య గర్బసంస్కారక కర్మ చేయదగినది.

ప్రధమే గర్బే చతుర్ధేమాసి షష్ఠే ష్టమేవా శుభేహని

దంపతీమంగళస్నాతే భూత్వా. ''జనిష్యమాణ సర్వగర్బాణాంబీజ గర్బసముద్బవైనోని బర్హణ ద్వారా ప్రతిగర్బ సంస్కారాతిశయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, సీమంతోన్నయనం కర్మ కరిష్యేయని సంకల్పింతురు.

తోలిగర్బముల, నాలుగు. ఆరు, ఎనిమిది మాసములలో నీ సీమంత మాచరింతురు. ఈసీమంతముచే, గర్బ బీజ దోషశాంతులు గల్గును. అనంతర గర్బములకు నీ సంస్కారబలముచే శుద్ధిగల్గును. పురుష జననమునకు కారణమగును. కాన సూత్రకారులీ సీమంత సంస్కారమునకు ప్రాముఖ్య మొసంగిరి. ఉ సంస్కారము సహితము తిది వార నక్షత్ర లగ్నములనెరింగి, శుభ తిది వారాదులలోనే చేయదగినది.

4. ''జా త క ర్మ''

గర్బాంబు పానజోదోషః జాతాత్సర్వోపినశ్యతి''

ఈ జాతకర్మ సంస్కారముచే శి వు గర్బమునందు, గర్జ జలపానాది దొషము నివర్తించును.

కుమారే జాతేసతి జన్మదినసమారభ్య దశదిస పర్యన్తం, దశదిన మధ్యె యస్మిన్‌ కస్మి& దిససే తజ్జాతకర్మ పుత్రవిషయే కుర్యాత్‌''

పుత్రోత్పత్తి కాలమునగాని, పదిదినములలోనే నాడేనియు లేదా పదియవ దినమందైననూ జాతకర్మ యనబడు సంస్కారము చేయదగినది, జన్మించిన శిశువునకీ కార్యముచే ఆయుర్వృద్ధి గల్గును.

''కుమారస్య ఆయుష్యాభివృధ్యర్థం జాతేన కర్మణా సగ్గ్‌స్కరిష్యే అని సంకల్పము, ఇందు ఫలీకరణ హోమమను పేర హోమకార్యముగలదు ఈ హోమ కార్యముచే, ''ఆయుష్యాభివృద్ధర్థం, అనయోర్బాల సూతికయోః చండాలాదిపిశాచే భ్యోరక్షణార్థం. ఫలీకరణ హోమం కరిష్యే||'' అని సంకల్పింతురు,

జన్మించిన బాలునికి పిశాచాది బాధలనుండియు, బాలగ్రహాది బాధలనుండియు, రక్షణార్థమై యీ ఫలీకరణ హోమము చేయుదురు. దీని వల్ల బాలారిష్టాదులకు శాంతికల్గును.

శిశువు జన్మించిన సమయము ననుసరించి, మాతా పితరులకు క్షేమకరమగునా? లేదా? యనియు, జన్మించిన శిశువునకు బాలరిష్టాది దోషములు లేకను, ఆయుర్వృద్ధికరమైన విధానమున్నదా? లేదా యనియు విచారింపదగియున్నది. అట్లు తల్లి దండ్రులకు, మేనమామలకు, జన్మించిన శిశువునకు దోషములున్నచో, నవగ్రహ, జప, హోమదానాదులచేతనూ తదితర జప హోమశాంతులచేతను దోషనివారణమునకు శాంతికలాపములుగలవు వానిని యెరింగిన మహనీయులనడిగి, తగిన శాంతులు జరుపుకొని యంనతరము దాని జాతకర్మ నామ కరణాదులు జరపుకొనుట పెద్దలయాచారము. తల్లి దండ్రులకు మేనమామలకు, దోషకరమైన రీతిని కొన్ని జన్మలుండునుగాన విధిగ పెద్దలనడిగి శాంత్యాదులు జరుపుకొనుట శ్రేయస్కరము. ఈ జన్మ దోషాదులు జ్యోతిషము తెలిసిన పెద్దలు చెప్పగలరు. వానికి శాంతులు చక్కని పురోహితులు జరిపించగలరు.

5. ''నా మ క ర ణ ము''

""A¸R…VVLRi*L][èÕ³Áª«sXµôðj…aRPè zqsµôðj…LRi*Qùxmsx¤¦¦¦X ¾»½[xqsòµ³ye

నామ కర్మఫలం త్వేతత్‌ సముద్దిష్టం మనీషిభిః''

అను రీతిని, ఆయుస్సు, వర్చస్సు, వ్యవహారసిద్ధి, గలుటకై ఈ నామ కరణ సంస్కారము జరుపదగినదని పెద్దల నిర్ణయము.

''జననాత్‌ దశరాత్రే సంపత్స రేవా నామకరణం, అహన్య కాదశీ

నామకరణం|

అనురీతిని పదునొకండవరోజు నామకరణముc జేయదగినది వసతిలేనిచో సంవత్సరంలోపుగ వసతి ననుసరించియు చేయదగును.

ఆడబిడ్డకు నామకరణం చేయునెడల ''ఈకారాన్తం స్త్రీణాం ఏవం కృతే నామ్నశుచి తత్కులంభవతి'' అనురీతిని ఈ కారాన్తముగ పేరుండులాగున నామకరణ మొనర్చినచో వంశమన్తయు పరిశుద్ధి యగునందురు.

''కుమారస్యాయుష్యాభివృద్ధ్యర్థం. సభాసకల సత్పురుషమథ్యే నామప్రకటన సిధ్యర్థం మాసనామ్నా నక్షత్రనామ్నా వ్యావహారికనామ్నా చసగ్గ్‌స్కరిష్యావహే'' యని సంకల్పము ఈరీతిని, ఆయుర్వృద్ధి కొరకును. సభలలో, పెద్దల సమక్షమున వ్యవహరించుటకును మాసనామము. నక్షత్రనామము, వ్యవహారనామములతో నామకరణము జరుపబడును.

చైత్రమాసమున జన్మించినచో కృష్ణుడు. వైశాఖమాసమున అనంతుడు, జ్యేష్ఠమాసమున అచ్యుతుడు. ఆషాఢమున చక్రీ శ్రావణమున వైకుంఠుడు, భాద్రపదమున జనార్దనుడు. ఇశ్వయుజమున ఉపేంద్రుడు, కార్తికమున యజ్ఞపురుషుడు, మార్గశీర్షమున వాసుదేవుడు, పుష్యమాసమున హరి, మాఘమాసమున గోవిందుడు, ఫాల్గునమున పుండరీకుడు అని మాస నామములు తొలుత పెట్టుకొనవలయును.

స్త్రీయైనచో చైత్రమాసమున జన్మించినవారికి భూదేవి, వైశాఖమున కల్యాణి జ్యెష్ఠమున సత్వభామా, ఆషాఢమాసమున పుణ్యవతీ, శ్రావణమాసమున రూపిణీ, భాద్రపదమున ఇందుమతీ, ఆశ్వయుజమున చంద్రావతీ, కార్తికమున లక్ష్మీ, మార్గశీర్షమున వాగ్దేవీ, పుష్యమాసమున పద్మావతీ, మాఘమున శ్రీదేవి, ఫాల్గున సావిత్రీ యని మాసనామములు తొలుత పెట్టుకొన దగియున్నది.

నక్షత్ర నామము పెట్టుకొనిన తదుపరి,

''ఆయుజాక్షరం కుమార్యాః, అవిషమాక్షరం కుమారస్య

ఆద్యన్తయోః శ్రీకారం లిఖిత్వా| వ్యవహారనామసమక్షరం

పుంసః అసమాక్షరం స్త్రియః| అను ధర్మము ప్రకారము నామమునకు ఆద్యన్తములలో శ్రీకారము తోలుత వ్రాసి, అనంతరము సమవర్ణములుగల పేరు పురుషులకును, అసమాక్షరముగల పేరు స్త్రీలకును పెట్టుట శ్రేయస్కరము,

''కులదేవతా నక్షత్రసంబంధం పితా నామకుర్యాత్‌''

అనురీతిని. కులదేవత పేరుగాని, నక్షత్ర సంబంధమైన పేరుగాని తండ్రి పెట్టుకొనుట యుత్తమము.

6. ''అ న్న ప్రా శ న ము''

అన్నాశనాత్‌ మాతృ గర్భమలాశాత్‌ అపిశుధ్యతి''

ఈ అన్న ప్రాశన సంస్కారముచే మాతృగర్భమున నుండుతరిని. గర్బసంబంథమైన మలవస్తు సేవనమువలన దోషము సహితము నశించునుగాన గర్భకాలమున తల్లి గర్భసంబంథ మల దోషనివారణముగల్గును. గాన అన్నప్రాశనమె ముఖ్యమైన సంస్కారమనిరి.

తతోన్నప్రాశనం మాసిషష్ఠెకుర్యాత్‌ | యధావిధి

అష్టమేవాపి కర్తవ్యం, యచ్చెష్టం, మంగళం కులం|| అను ధర్మము రీతిని ఆరవమాసమునగాని, యెనిమిదవ మాసమునగాని బాలునకు అన్నప్రాశనము చేయదగినది.

''జన్మనోభి షష్ఠేమాసి, దధిమధుఘృత మోదనం

ఇతి సంసృజ్యం, ఉత్తరైర్మంత్రైః కుమారం ప్రాశ##యేత్‌|''

అను ఆపస్తంబ సూత్రము ప్రకారము దధి. మధు, ఘృతముతో గూడిన యన్నమును బాలునకు మంత్రములతో నభిమంత్రించి. తినిపించదగినది.

మధ్వాజ్య కనకోపేతం. ప్రాశ##యేత్‌ పాయసంతతః

తేనె. నెయ్యితొగూడిన పాయసమును. బంగారముతొ తినిపించ దగినది.

''7. కా ల ము''

బలాయర్వర్చో వృద్ధిశ్చ చూడా కర్మఫలం. స్మృతం''

బలము ఆయుస్సు వర్చస్సు అభివృద్ధి చెందును గాన. ఈ చూడాకర్మయను సంస్కారము నిర్ణయింపబడినది.

''తృతీయే వత్సరే చౌలం కుర్వీత హ్యుత్తరాయణ|

శుక్లపక్షే, శుభార్థేతుతు, కృత్వాభ్యుదయ యికంతతః||

(జన్మనోభి తృతీయేవర్ధేచౌలం పునర్వసోః)

జననాది మూడవ సంవత్సరమున ఉత్తరాయణమున శుక్లపక్షమున శుభతిధి, వార నక్షత్ర లగ్న యోగమున చౌలమను సంస్కారము చేయదగినది.

''కర్ణరంధేకృత్వా'' అను థర్మము రీతిని చెవులు కుట్టదగినది.

నూనోన్మాతరి గర్భిణ్యాం చూడ కర్మన కారయేత్‌ |

పంచమాసాదధః కుర్యాత్‌ అత ఊర్థ్వంసకారయేత్‌|

అను నియమానుసారము తల్లి గర్భముతోనుండు నెడల, అయిదు మాసములలోపుగ బాలునికి చూడాకర్మ చేయనగును. ఆరుమాసములున్నచో నీ సంస్కారము చేయదగదు.

''మాత్రాసహైవ భుంజీయాత్‌, వివాహే భార్యయాసహ|

మాత్రాసహైవ భుంజీయాత్‌, చౌలమానేక భాజనే||

బాలుడు ఉపనయన సమయమున తల్లితో గూడా భుజింపవలయును, వివాహకాలమున భార్యతోగూడా భుజింపవలయును, చౌలమునందు గూడా బాలుడు తల్లితోగూడ భుజింపవలయును. ''తూక్షేమెతాః క్రియాః స్త్రీణాం, వివాహస్తు సమత్రకం'' అనురీతిని స్త్రీలకు యీ చెవులుకుట్టుట అమంత్రముగనే చేయదగినది.

''అక్షరాభ్యాసము''

ప్రాప్తేతు పంచమేవర్షే హ్యప్రసుప్తే జనార్దనే

షష్ఠీం ప్రతిపదంచైవ, వర్జయిత్వా తధాష్టమీం|

రిక్తాం పంచదశీంచైవ, సౌరభౌమదినేతధా|

ఏవం మనిశ్చితే కాలే, విద్యారంభంతు కారయేత్‌ |

బాలునకు అయిదవ సంవత్సరము వచ్చిన కాలమున అక్షరాభ్యాసము చేయదగినది. ఈ యైదవ వత్సర కాలమున అక్షరాభ్యాసమునకు శుభ తిధి వార నక్షత్రములు గుర్తింపదగినది. అట్టి తఱిని విష్ణువు శయనించిన కాలము కూడదు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలు కార్తీకశుద్ధ ఏకాదశి వరకు విష్ణుశయన కాలమందురు. ఈ కాలము కూడదు. ఆరీతిని షష్ఠి, అష్టమ పాఢ్యమి పౌర్ణమిఅమావాశ్యలు శని మంగళ వారాలు పనికిరావు.

''ఉత్తరాయణ సూర్యే కుంభమాసం వివర్జయేత్‌''

ఉత్తరాయణము శ్రేష్ఠము. కాని రవి కుంభరాశిలోనుండు కాలము మాత్రము పనికిరాదు. తదితరమాసములలో శుభ తిధి వారములనదగిన ''శుభవాసరే, శుభదినే, అహ్నిదివాభాగే. అక్షర స్వీకారలగ్నాత్‌ అష్టమస్ధానే గ్రహరహితేసతి, అక్షర స్వీకృతిః కార్యా'' యను విధి ప్రకారము పగలు, శుభలగ్నమున లగ్నాత్‌ అష్టమమున గ్రహవర్జ్యముగ నుండులాగున శుభముహుర్తము నిర్ణయించి అక్షరాభ్యాసము చేయదగినది.

''పూజయిత్వా హరింలక్ష్మీం, దేవీంచైవ సరస్వతీం

స్వవిద్యా సూత్రాకారాంశ్చ, న్వాంవిద్యాంచవిశేషతః

అను విధిననుసరించి, బాలునకు అక్షరాభ్యాస కాలమున తొలుత గణపూజచేసి, లక్ష్మీనారాయణులను, వాణీ హిరణ్యగర్భులను, స్యశాఖ సూత్రకారుని పూజించి ఓంనమశ్శివాయ సిద్ధంనమః అను మహామంత్రమును, ఒ న మః శి వా యః సి ధం న మః'' అను విరణముగ, ధాన్యముపై వ్రాసి, తొలుత బాలుని వ్రేలితో వ్రాయించి, అనంతరము పలకపైన ముమ్మారు వ్రాయించి ముమ్మారు పఠింపజేయుట పెద్దల సాంప్రదాయము.

9. ''ఉ ప న య న ము''

Dxms¬ds¾»½[M xmnsÌÁLi¾»½[*»R½»`½ µj…*ÇÁ»y zqsµôðj…xmspLji*NSee

వేదాధీత్యధికారశ్చ సిద్ధిరేఋషిభిరీతితా||

ఈ యుపనయమున సంస్కారముచే ద్విజత్వ సిద్ధిగల్గును. వేదాధ్యయనాధికారము సిద్ధించును.

గర్బాష్టమేషు బ్రాహ్మణముపనయీత

గర్భైకాదశేషు, రాజన్యం, గర్భద్వాదశేషువైశ్యం''

అను ఆపస్తంబ మహర్షి సూత్రము ప్రకారము, బ్రాహ్మణ బాలునకు గర్భాష్టమమునను, క్షత్రియునికి గర్భైకాదశమునను, వైశ్యుకుగర్భద్వాదశవర్షమునను. ఉపనయనము చేయుదగినది. అనగా, బ్రాహ్మణ బాలునకు జన్మించినదాది యేడవవత్సరము రాజులకు జన్మ ప్రభృతి, పదియవత్సరము వైశ్యునకు పదునొకండువ వత్సరము జరుగు కాలమున నుపనయనము చేయదగినదని, ఆపస్తంబ సూత్ర నిర్ణయము.

''వసంతో గ్రీష్మశ్శరది త్యృతవో వర్ణాను పూర్వేణా''

అను సూత్రనిర్ణయము మేరకు బ్రాహ్మణునకు వసంతఋతువున నుపనయనము చేయదగినది. క్షత్రియునకు గ్రీష్మఋతువు వైశ్యునకు శరత్‌ఋతువు ప్రశస్తములు.

''అధ ఏతావంతం కాలం అనాశ్రమణః అస్యకుమారస్య ఆశ్రమాధికార సిథ్థ్యర్థం. అథ్యయన సంపాదనార్థం, ఆయుస్తేజో యశశ్శ్రీ పుష్ఠికామ్యాభివృథ్యర్థం, సాంగోపాంగం, సకలవేదాధ్యయన, అధ్యాపన తత్ప్రతి పాదనార్థం, చతుర్వింశత్సక్షర మంత్రోచ్చారణ. ద్విజాశ్రమాధికార యోగ్యతా, సిధ్యర్థం, ఇతుంకుమారం, ఉపనేష్యే'' అని సంకల్పించుదురు.

ఈ యుపసయనముచే గల్గు ప్రయోజనములు, బాల్యమునుంచియుండు అనాశ్రమదోషము తొలగి బ్రహ్మ చర్యాశ్రమ సిద్ధిగల్గును. వేదము నేర్వదగిన యధికారము వచ్చును, ఆయుర్వృద్ధి బ్రహ్మతేజోవృద్ధి. కీర్తివ్యాపకము. పుష్టి వగైరా శక్తులు గల్గును, వేదశాస్త్రములు సమగ్రముగ నేర్వదగిన శక్తి చేకూరును. బుద్ధికుశలత గల్గును, వేదము నేర్వడము నేర్చిన వేదమును బోధించుశక్తి చేకూరును. గాయత్రీమంత్ర జపానుష్ఠానశక్తి యోగ్యతలు చేకూరును. ద్విజన్మత్వం గల్గును. గాన యీ చెప్పిన యోగ్యతలెల్లయు చేకూరుటకై యుపనయనము బ్రాహ్మణులు విధిగ యధాశాస్త్రీయముగ. చేయుట యత్యన్తావశ్యకము.

ఊప + నయనం - వేదాధ్యయనార్ధం, ఆచార్యస్య ఊప - సమీవం, నీయతే ' యేనకర్మణాఇతి - వుపనయనం'' అని వేదము నేర్చుకొనుటకుగాను, వేదము బోధించు ఉపాధాయునివద్దకు చేర్చు నర్హతకై చేయు వైదిక సంస్కారమునకు ఉపనయనమని యర్థము, అనగా అధ్యాపనార్థమై వేదమును బోధించు ఆచార్య సమీపమునకు చేర్చు సంస్కారవిశేషము.

''గృహ్యోక్త కర్మణా యేన, సమీపం నీయతేః గురోః|

బాలో వేదాయతద్యోగాత్‌ బాలస్యోపపనయనం విదుః

అను స్మృతి వచనానుసారము వేదము నేర్చుకొనుటకుగాను గురువు సమీపమునకు బాలుని చేర్చు నర్హతకై చేయబడు గృహ్యోక్తమైన సంస్కార విశేషమే ఉపనయనమునకు పేరు:

గర్భాష్టమేష్టమే వాబ్దే బ్రాహ్మణస్యోపనయనం||

బ్రహ్మ వర్చస కానుస్య కార్యం విప్రస్య పంచమే||

అను ధర్మానుసారము బాలుడు గొప్ప బ్రహ్మవర్చస్వి కావలయునను నెడల నైదవ సంవత్సరముననే నుపనయనము చేయదగినది. లేద, గర్భమునుంచి లెక్కించిన ఎనిమిదవ వత్సరమునగాని అనగా పుట్టినది మొదలు ఏడవ వత్సరమగును. లేక పుట్టినది మొదలు ఎనిముదవ వత్సరమునగాని బ్రాహ్మణ బాలునకుపనయనము చేయుట యుత్తమము, ఇందులో గరాష్టమ వర్షముపనయనమునకు ముఖ్యాతి ముఖ్యము.

''జన్మోదయే, జన్మసుతారకాసు, మాసోధవా జన్మని జన్మభెవావ్రతేన విప్రోన బహుశ్రుతోపి. విద్యా విశేషైః ప్రధితః పృధివ్యాం'' అను ''తత్వచిన్తామణీ'' ప్రమాణానుసారము.

జన్మలగ్నము జన్మనక్షత్రము జన్మమాసము శుభకరము కాలామ్మతముసను ''జన్మక్షరం శుభదం, మౌంజీబంధనపట్టబంథన మహీప్రాప్తిః'' యను రీతిని జన్మ నక్షత్రమున యువనయన సంస్కారము శుభప్రదమగుచున్నది,

''అస్తంగతే దైత్య గురే గురేనా||

ఋక్షేపివా పాపయుతే ప్యనుక్తే |

వ్రతోవనీతో దివసే ప్రణాశం|

ప్రయాతిదే వైరపి రక్షితోయః

అనురీతిని గురువుగాని శుక్రుడుగాని అస్తంగతులై యున్ననులగ్నమునక్షత్రము పాపాక్రాంతమై యున్నను యుపనయనము చేయదగదు.

మందవారే మౌంజీ బంధంయః కుర్యాద్వటునాశనం|

అంగారకే మౌంజీ బంధం యజమానో మృతో భ##వేత్‌''

శనివారమున నుపనయనము చేసినచో నుపనయనమునవటువు (బాలుడు) నశించును, మంగళవారముపనయనము చేసినచో బాలుని తండ్రి నశించును గాన, శని మంగళ వారాలు పనికిరావు.

ఈ యుపనయనమేగాదు ఏ శుభ కర్మగూడ శని మంగళవారాలు చేయరాదు చేసినచో మరణము తప్పదందురు.

సహస్ర గుణయక్తెపి మందవారే కుజే తధా|

శుభకర్మనతకుర్వీ కుర్యాచ్చెత్‌ మరణం ధ్రువం''

అని శని మంగళ వారాలే యొక్క శుభకార్యానికి పనికిరావని నిషేధించిరి.

ఆచార్య కావ్య సౌమ్యనాం వారాః శస్తాః శుభోదయే

అను రీతిని గురు శుక్ర బుధ వారములు ఊపపయనమునకు శ్రేష్ఠము,

జీవః కావ్యోపివా యస్యమౌంజీబంధనలగ్నగః|

తస్య విద్యా ప్రభూతాస్సాత్‌ వివాహశ్చాచిరాద్భవేత్‌ ||

ఉపనయన లగ్నమున గురువుగాని శుక్రుడుగాని యున్నచో నా బాలునకు మంచి విద్యయువచ్చును, త్వరలో వివాహము కాగలదు.

కుజేచేత్‌ కూజితోదోషః శిష్యాచార్యవినాశనం ||

అంగారకుడు, కేంద్రములనదగిన లగ్న, చుతుర్థ, సప్తమ దశమరాశులలో నున్నచో ''కూజిత'' మనుదోషము ఈదోషముచే ఉపనయన బాలునకు వాని తండ్రికి వినాశము గల్గును.

ముందేతు రుధిరోదొష: కరోతి మవాతీంగదాం|

శని యుపనయన లగ్నములకు కేంద్ర స్థానములలోనున్నచో రుధిరమను దోషము సంభవించును. ఈ దోషముచే బాలునకు గొప్ప రోగములు సంప్రాప్తించును.

రాహౌరంధ్రాహ్వయో దోషః శిశోర్మాతృవినాశనం|

రాహువు ఉపనయన లగ్నమునకు కేంద్రములలో నున్నచో బాలుని తల్లికి దోషము గల్గును.

కేతౌకేంద్రేతూగ్ర దోషో విద్యాయుర్థన నాశనం|

కేతువు కేంద్రమున నున్నచో, విద్య, ఆయుస్సు. ధనము నశించును.

ద్వాదశస్థం రవింభౌమః పశ్యన్నాచార్య నేత్రహృత్‌ ||

లగ్నమునకు పండ్రెండవయింట రవి యుండి యారవిని అంగారకుడు చూచుచున్నచో బాలుని తండ్రికి నేత్రములేని రీతిని జేతురు. అనగా తండ్రి గ్రుడ్డివాడగును.

విశేషాత్‌ నైధవస్థానే నేష్యంతే సర్వదాగ్రహాః

ఆచార్యం తం శుభాఘ్నన్తి, శిష్యంఘ్నన్తి శుభేతరాః

ఉపనయనలగ్నమున కెనిమిదవరాశి పరిశుద్ధముగ నుండవలయును. అనగా నేగ్రహములు నందుండరాదు. శుభగ్రహములున్నచో తండ్రిని నశింపజేయుదురు. పాపగ్రహములున్నచో బాలుని నశింపజేతురు. గాన' వుపనయన లగ్నమున కష్టమశుద్ధి ముఖ్యాతి ముఖ్యము,

మాఘేద్రవిణ శీలాఢ్యః, ఫాల్గునేచ దృడవ్రతః|

చైత్రేభవతి మేధావీ వైశాఖె కోవిదోభ##వేత్‌ |

జ్యేష్ఠే గహన నీతిజ్ఞః ఆషాఢే క్రతు భాజనః |

శేషేప్యన్యేషు రాత్రి: స్యాత్‌ నిషిద్ధం నిశిచ వ్రతం||

ఈ యుపనయన వ్రతము బాలునకు మాఘమాసమున చేసినచో ధనశీలములు మెండుగ గల్గును. ఫాల్గుణమాసమున చేసినచో మంచి నియమవ్రతుడగును, చైత్రమాసమున నుపనయనము చేసినచే మేధావి యగును వైశాఖమాసమున నుపనయనముచేసినచో మంచి పండితుడగును జ్యేష్ఠమాసమున నుపనయనము చేసినచో మంచనీతి శాస్త్రవేత్త యగును. మిగతా మాసములు పనికిరావు. రాత్రి కాలమున నుపనయనము చేయదగదు.

''ఆషోడశాత్‌ బ్రాహ్మణస్య అనాత్యయ, అద్వావింశాత్‌ క్షత్రియస్య, అచతుర్వింశా దైశ్యస్యేతి'' యను యపస్తంబ మహర్షి సూత్రానుసారము బ్రాహ్మణునకు గర్భాష్టమము మొదలు పదునారు వత్సరముల వరకుగల కాలమున, వసతినిబట్టి యుపనయనము చేయవచ్చును. క్షత్రియునకు యురువదిరెండు వత్సరములలోపుగను వైశ్యునకు యిరువదినాలుగు వత్సరములలోపుగల కాలము నందైనను యుపనయనము చేయదగును.

''నవమే పంచమే కామ్యం'' బ్రహ్మవర్చస కామస్యపంచమే, బ్దే ఆయుష్కామస్య నవమే, సప్తమే బ్రహ్మ వర్చసం. అష్టమే ఆయుస్యం, నవమే తేజోవృద్ధిః. దశ##మే అన్నాద్యం, ఎకాదశే ఇన్ద్రియం, ద్వాదశే పశూంశ్చ త్రయోదశే మేధాకామం, చుతుర్దశే పుష్టికామం, పంచదశే భ్రాతృమంతః, షోడశే సర్వకామం'' అను బౌధాయన సూత్ర ప్రమాణము రీతిని అయిదవ వత్సరము బ్రహ్మవర్చు ఏడవ వత్సరముననూ బ్రహ్మవర్చసప్రాప్తి. ఎనిమిదవ వత్సరమున ఆయుర్వృద్ధి తొమ్మిదవ వత్సరమున తేజోవృద్ధి, పదియవ వత్సరమున అన్న సమృద్ధి పదునొకండవ వత్సరమున ఇంద్రియపుష్టి పండ్రెవ వత్సరమున పశువృద్ధి పదిమూడవ వత్సరమున మేధావృద్ధి పదునాలుగవ వత్సరమున బలసంపద పదునైదవ వత్సరమున సోదరవృద్ధి పదునారవ వత్సరమున సర్వ సంపదలు వటువునకు గల్గుచుండునుగాన పదునారు వత్సరములలోపుగనే నుపనయనముచేయు తఱిన తండ్రి తొలుత గణపతిపూజ నాచరించి ''శుద్ధ్యర్ధం వృధ్యర్ధం'' స్వప్తి పుణ్యాహ వచనము చేయదగినది.

అనంతరం ''జాతాది కర్మణాం, ఉక్త కాల అనుష్ఠానాభావాత్‌ ప్రాయశ్చిత్తముచ్యతే'' యని బాలుడు పుట్టినది మొదలు ఇంతవరకు చేయదగు జాతకర్మ నామకరణాదులు చెప్పిన చొప్పున సకాలములో శాస్త్రీయముగ చేయనందులకై ప్రాయశ్చిత్తముగా నీరీతిని నాచరింపదగినది. ఈ చేయబడు విధికే ''యనుపనీత ప్రాయశ్చిత్తమందురు

'అనుపనీత ప్రాయశ్చిత్తము'

''యధాశక్తి పరిషద్దక్షిణాం గృహీత్వా'' యను విధి చోప్పున సభలోని పెద్దలకు యిచ్చుటకై తగినరీతిని శక్తి కొలది దక్షిణను తీసికొని లయును. ప్రదక్షిణత్రయమునాచరించవలయును.

''అసేషే పరిషత్‌, మదీయాం విజ్ఞాపనామవధార్యమయాసమర్పితాం, ఇమాం పరిషద్దక్షిణాం యథో క్తదక్షిణాం యధోక్తదక్షిణామివస్వీకృత్య.

మమకుమారస్య జన్మ ప్రభృతి చౌలోపనయనవర్యన్తం. మధ్యే సంభావితానాం పాపానాం, సవర్ణాసవర్ణ ధాత్రీ జనయిత్రీ ప్రభృత్యనేక స్తన్యపాన నిజస్తన్యపాన సహభోజన ఉచ్చిష్టభోజన, పర్యుషితాన్నభోజన, వివసనాన్నపాన, సజాతీయ విజాతీయ సహచర, క్రీడాసలాప సంస్పర్శన, తిష్ఠస్మూత్ర పురీ షోత్సర్జనాదీనాం.

తత్తత్కాతే శౌచాభావ ప్రభృతీనాం సర్వేషాందోషణాం. అపనోదనార్థం, పూర్వ పూర్వ కర్మాతిక్రమదోషనిర్హరణార్థం,

వుత్తరోత్తర కర్మ ద్విజాధికార, యోగ్యతాఫలసిధ్యర్థం చరుర్వింశత్సక్షర మంత్రోచ్చారణ ద్విజాశ్రమాధికార యోగ్యతాసిధ్యర్థ ఫలసిధ్యర్థం. శ్రీ లక్ష్మీనారాయణ ముద్దిశ్య ప్రీత్యర్థం ఇమాం సౌవర్ణీం శాస్త్రీయాం పరిషథ్దక్షిణాం యథోక్త దక్షిణాయవ స్వీకృత్య మామనుగృహ్ణాంతు భవన్తః

అస్యకుమారస్య దంత జనన ప్రభృతి, ఉపనయన శుభలగ్న పర్యన్తం, సంభావితేభ్యః పాపేభ్యః అయం కుమారో ముక్తోభుయాత్‌, విముక్తొ భూయాత్‌, ఉపనయనాధికార సిద్ధి రస్త్వితి భవన్తో బ్రువన్తు, ఉపనయనాధికారి సిద్ధిరస్తు||''

అని. వుపనయనము చేయు తండ్రి తన కుమారునికి యుపనయనము చేయుటకు మునుపు యధాశక్తి దక్షిణను గ్రహించి, లేచి నిలువబడి తన యెదుటనుండు పెద్దల నుద్దేశించి యిట్లు వచించును.

ఓ సభలోని మహనీయులారా! నా కుమారునికి ఆయుర్వృద్ధికై, అనుపనీత ప్రాయశ్చిత్తము నాచరించుచున్నాను. మీ పాదపద్మములను నమస్కరించి వేడుకొనుచున్నాను, నావిన్నపమును ఆలకించవలయునని ప్రార్థన నా యీ దీక్షణను మీరు గ్రహింతురుగాక.

నా కుమారుడు జన్మించినది మొదలు ఈ యుపనయనమున పర్యం ముగల ఈ యేడెమ్మిది వత్సరముల మధ్యకాలములో (ఎనిమిదవ వత్సరముననే యుపనయనము చేయవలయును గాన నందుకు తగినట్లుగ) పల సంభవించిన పాపలయొక్కయు తన కులస్థులైన వారినుండిగాని, ఇతర కులస్థులైన వారినుండి గాని, చనుబాలు సేవించిన పాపాదుల యొక్కయు, కలిసి భోజనము చేసినను, ఎంగిలి పదార్థములు తినినను, సద్దియన్నము తినినందులకును వస్త్రము లేకుండా నుండినందులకును, తనవారితోగాని, ఇతర కులస్థులతోగాని, కలసి తిరుగుచున్నందులకును, ఆడుకొనినందులకును, వినోదముగ వార్లతో మాట్లాడినందులకును, నిలిచి మలమూత్రములు వదలి నందులకును, ఆయాకాలములలో చేయదగిన పాదములు కడుగుకొనుట మొదలగు ఆచారములు వదలిపెట్టి నందులకై వచ్చిన పాపములకును, ఈరీతిని యితరములైన కార్యాదులు చేయుట చేతగాని, విడుచుట చేతగాని వచ్చునట్టి సమస్త పాపములు తొలగుటకుగాను, ముందు చేయదగు కార్యములు సకాలములో చేయని కారణమునను, ఇంకమీదట చేయదగు వుపనయనాది కార్యములు చేయుటకుగాను తగిన యోగ్యత గల్గుట కొరకును. ఇరువదినాల్గు వర్ణములతో గూడిన గాయత్రీమంత్రమును వుచ్చరించు ద్విజన్మ మనబడు సిద్ధిగల్గుటకును శ్రీలక్ష్మినారాయణుని ప్రీతికొరకై. ఈ సువర్ణమయమైన సశాస్త్రియమైన యీ పరిషత్‌ దక్షిణను మీరు స్వీకరించి మమ్ములను అనుగ్రహించవలసినది ఈ బాలునికి దంతములు మొలచినది మొదలు వుపనయన పర్యంతముగల యీ మథ్యకాలములో కలిగిన పాపములనుంచి, విముక్తుడగులాగున ఆశీఃపూర్వకముగ అనుగ్రహింపదగినది. వుపనయనాధికార యోగ్యత సిద్ధించులాగున యను గ్రహీంప దగినది. వుపనయనాధికార సిద్ధిగల్గుగాక''

కుమారస్య ఆయుషాభివృధ్యర్థం. శరీర శుథ్యర్థం, స్వర్ణ ధాన్యాజ్య కృచ్ఛ్రాణాచరిష్యె'' యని స్వర్ణాది దానములు శరీర శుద్ధికొరకై నాచరింప వలయును.

పాహిత్రయో దశహోమము

కుమారస్య ఆయుష్యాభివృధ్యర్థం, జాతకర్మాదీనాం, తత్తత్కాలేషు, తత్తత్కార్మాకరణ ప్రాయశ్చితార్థం పాహిత్రయోదశ హోమం కరిష్యే''

అని కుమారుడు జన్మించినది మొదలు నేటివరకు చేయదగు కార్యములు చేయని కారణమున గల్గిన పాపములు తొలంగుటకై, పాహిత్రయోదశ హోమము నాచరించుచున్నానని సంకల్పించదగును. అనంతరము పదమూడు మంత్రములతో హోమము చేయతగినది.

''అధఏతావంతకాలం అనాశ్రమణోస్య కుమారస్య ఆశ్రమాధికార సిధ్యర్థం, అధ్యయన సంపాద నార్థం, ఆయుస్తే జోయశశ్రీ పుష్టి కామ్యాభివృధ్యర్థం, సాంగోపాంగ సకల వేదాధ్యయన అధ్యాపన తత్తత్ప్రతిపాదనార్థం చతుర్వింశత్సక్షర మంత్రోచ్చారణ ద్రిజాశ్రమాధికార యోగ్యతా సిధ్యర్థం, ఇమం కుమారం ఉపనేష్యే'' అని సంకల్పింతురు.

అనగా జన్మప్రభృతి ఈ యుపనయన కాల పర్యంతము ఏ ఆశ్రమాధికారము లేనందున, అట్లు, అనాశ్రమిగా నుండరాదు గాన, ఆశ్రమాధికార యోగ్యత గల్గుట కొరకు, అనగా బ్రహ్మ చర్యాశ్రమాధికార సిద్ధి గల్గుటకుగాను, వేదపఠనమునకు యోగ్యుడగుటకుగాను, ఉపనయనముగానిది, వేదపఠనము చేయతగదు గాన, వేదపఠనమునకు యోగ్యత గల్గుటకుగాను, ఆయుస్సు తేజస్సు యశస్సు, సంపద, బలము, మొదలగునవి చేకూరుటకొరకు, అంగములతో గూడిన వేదమునేర్చి, వాని విధులు నెరవేర్చుట కొరకు, ఇరువదినాలుగు వర్ణములతో గూడిన గాయత్రీ మహమంత్రముచ్చరించుట కొరకు, ద్విజన్మత్వ సిద్ధి కొరకు, ఈ బాలునికి యుపనయనము చేయుచున్నానని తండ్రిగాని, సోదరాదులుగాని, సంకల్పించదగి యున్నది.

అనంతరము ఉపనయనము చేయబడు బాలునికి రక్షాబందనము గట్టుదురు. ''కుమారస్య ఆయుష్యాభివృద్యర్థం, వుపనయనాంగ త్వేన కర్మాదౌ రక్షాబంథనం కరిష్యే'' యని వుపనయన వటువున కాయుర్వృద్ధికై రక్షాబంథనము చేయదగినది.

అనంతరము యజ్ఞోపవీత ధారణము

''ఆయుష్యాభివృద్యర్థం, శ్రౌతస్మార్తనిత్యకర్మానుష్ఠానయోగ్యతా సిద్యర్థం, పరమ పవిత్ర యజ్ఞోపవీత ధారణం కరిష్యే'' యని, శ్రౌతకర్మలనదగు ఆధాన, సోమయాగ దర్శపూర్ణమాసాదులాచరించుటకును, స్మార్తకర్మలనదగు ఉపనయనాది సంస్కారములచే పవిత్రుడగుటకొరకును ఆయుర్వృద్ధికొరకును యజ్ఞోపవీతము వేయదగినది.

అస్య కుమారస్య ఆయుష్యాభివృథ్యర్థం శీతవాతోష్ణోపశమనద్వారా దౌహాలం కరణార్థం, నూతనవస్త్ర మౌంజ్యాజినదండధారణం, కరిష్యే! అని శీతవాత, వుష్ణబాధల నివారణార్థం దేహాలంకారార్థం, నూతనవస్త్రాలంకరణము, ముంజ అనగా దర్భలతో పేడిన త్రాటిని మూడు చుట్లు వచ్చులాగున నడిమకి మొలత్రాడువలె థరించవలయును. పాలాశ దండధారణము చేయదగినది.

''సావిత్రీం భో అసుబ్రూయాత్‌'' అని వటువు గురువును అడుగవలయును

గాయత్రీ మంత్రోపదేశమునకై ''గాయత్ర్యుపదేశముహూర్త స్సుముహూర్తోస్తు | స్వముత్తరమోష్ఠం, శ్యావాంతపర్యన్తం, వుపస్పృశ్యాచామేత్‌|

వటుడు ఊర్ధ్వోష్టమును, నీటితో స్పృశించుకొనవలయును.

''సుశ్రవఇతిపాలాశందండం, దక్షిణసహస్తేనాదత్తే

ఆయుర్వర్చోయశోబలాభివృధ్యర్థం, గోసర్పభయిని వృత్యర్థం పాలాశదండ ధారణం కరిష్యే అని సుశ్రవస మంత్రమును పఠించుచు మోడుగదండమును వుపనయనమైన బాలుడు (వటువు) ఆయుర్వృద్ధి కొరకు, వర్చస్సు, యశస్సు, బలము, వృద్ధిజెందుటకును, ఆవులు పాముల భయము లేకుండుటకును, పాలాశదండధారణము చేయదగినది.

తతఃస్మృతంచమ ఇత్యేనం, వటుంవాచయతి'' యను విధి ప్రకారము స్మృతంచమాది మంత్రములు వుపనయన వటువు పఠింపవలయును,

అనంతరము పెద్దలకు యధాక్రమానుసారము 'వృద్ధాన్నమస్కృత్య' యను వచనానుసారము నమస్కారము చేయదగినది.

'భిక్షాం యాచయేత్‌' అను విధిప్రకారము ఆహరార్థమై భిక్ష గ్రహింపవలయును.

ఈ తరిని, గురువు యీరీతిని ప్రశ్నించును.

బ్రహ్మచారి యందుకు సమాథానమారీతిని యివ్వవలయును.

1. తతోగురుః బ్రహ్మచార్యసీతి | బాఢమేవంకరోమాతి వటుఃబ్రూయాత్‌,

ఆచార్యః - బ్రహ్మచార్యసి

వటుః - బాఢం కామచారవాదభక్షణ కామోనభవామి

ఆచార్యుడు - బ్రహ్మచారివయితివని బాలునికి చెప్పును. వటుడందులకు కామచార వాదభక్షణాదులుకోరను,

2. ఆచార్యః - అపోశాన కుమారః - బా మశ్నామి

3. ఆచార్యః - కర్మకురు కుమారః - బా ంకరోమి

4. ఆచార్యః - మాషుఎ్థాః కుమారః - బాఢం దివానస్వపామి

5. ఆచార్యః - భిక్షేచర్యంచత కుమారః - బాఢంచరామి

6. ఆచార్యః - ఆచార్యా దీనోభవ, కుమారః - బాఢంభవామి

ఈ యారువాక్యముల ఆచార్యుడు యుపనయన వటువుచే పలికించును దైవసంబంథమైన కార్యములాచరింపుము. నిదురించవలదు, భిక్షాభోజనముతో నుండుము. వేదవిద్యాదులు నేర్చువరకు ఆచార్యధనుడవయి యుండువు. అని నియమించగా వానినన్నింటిని సమ్మతించును. అనగా నీ యారు నియమములు ప్రథానముగ నాచరించుచు బాలుడు వేదాది విద్యలు నేర్చుటకే బ్రహ్మచర్యమందురు. ఈ బ్రహ్మచర్య వ్రత నిష్ఠాగరిష్ఠునకే బ్రహ్మచారీయని లోకమున వ్యవహారము.

వుపనయనమైన నాలుగవదినమున వుపనయన వటువునకు మేథాజననాది బుద్ధి వికాసములకై పాలాశహుమమాచరింపదగినది.

''చతుర్థేహని పూర్వాహ్ణె, పాలాశవృక్షప్రదేశే అలంకృత్య| మమకుమార స్యాయుష్యాభృవద్ధ్యర్థం మేధాజననసిథ్యర్థం, పాలాశకర్మ కరిష్యమాణః'' అని, సంకల్పించి, కుమారుని బుద్ధివికాసము, ఆయురృధ్యర్థం, పాలాశ వృక్షము కడకు చేరి, యందు, యీ కార్య మాచరింపదగినది. ''ప్రాచీముదీచీం, వాదిశముపనిష్కృమ్య'' యను విధిప్రకారము, తూర్పు దిశనగాని, ఉత్తరపు దిశనగాని, నున్న మోదుగు వృక్షమువద్దకు వెళ్ళి, ఆ వృక్షప్రదేశమును, అలికి మ్రుగ్గులిడి, వృక్షమును పూజింపదగినది.

అనంతరము ఉపనయనమునాడు, స్వీకరించిన మేఖలాజిన దండములు, పాలాశ వృక్షము కడనే యుంచి రావలయును, ''మేఖలామజినం, దండం పాలాగ్రేవినిక్షితిపౌత్‌, తద్వాసో గురవేదద్యాత్‌, అనునియమము మేరకు, తాను ధరించిన వస్త్రములు గురువునకు సమర్పించదగినది, ''వటుః అన్యానిధారయేత్‌'' నూతనములైన, మేఖలాజిన దండ వస్త్రములు గ్రహింపవలయును. అనంతరము ఉపనయనమైన బాలుడు వివాహపర్యంతము, బ్రహ్మచర్య దీక్షతో, వేదశాస్త్ర పురాణ ధర్మ శాస్త్ర సంగీతాదులను యధాశక్త్యాను సారము నేర్వదగినది.

వేదాధ్యయనము బ్రాహ్మణబాలుడు విధిగ చేయవలయును

ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయో నబుధ్యతే

ఏతం విదన్తి వేదేన తస్మాత్‌ వేదస్య వేదతా|

అను సంప్రదాయ విధి ననుసరించి, మానవునికి ప్రత్యక్ష ప్రమాణముచేత గాని, అనుమాన ప్రమాణము చేతకాని తెలియజాలని యేపురుషార్థపాయములుగలవో వానిని తెలియజేయునది గాని వేదమని యందురు.

''ఇష్టప్రాప్తి అనిష్టపరిహార యోర తాకిక ముపాయం

యోగ్రంథో వేదయతి సవేదః|'' అను సాయనాచార్య వేదభాష్యభూమికలో వివరించిన రీతిని, స్వర్గమోక్షాది రూపమగు ఇష్టప్రాప్తికిని, దుఃఖనర కాది అనిష్ట పరిహారమునకు తగిన విధానములను బోధించెడి గ్రంథమునకు వేదమందురు.

ఈ వేదములు నాల్గు ఋగ్వేదము, యుజుర్వేదము, సామవేదము అధర్వణవేదము, అని వీనికి పేరు. ఛందోబద్ధమైన, వేదమంత్రములకు, ఋక్కులందురు. యాజుష సంబంథమైన వేదమంత్రములకు, యజుర్వేదమందురు. గాన రూపాత్మకమైన వేదమంత్రములకు, సామవేదమందురు, అతాకిక శక్తులద్వారా లోక సంబంధమైన కార్యములను నెరవేర్చుకొనుటకు యేర్పడిన వేదమంత్రములకు అథర్వణ వేదమని వ్యవహారము,

శాంతి పుష్ట్యభి చారార్థ ఏకబృహ్మర్త్విగాశ్రయాః

క్రియన్తే థర్వవేదేన త్రయోవాత్మీ యగోచరాః

అను రీతిని శాంతికరమైన కార్యములు పుష్టిని గలిగించు కార్యములు, అభిచారక కర్మములు మొదలైనవి యధర్వణ వేదమంత్రల వలన చేయదగినవి కనుక, ఉపనయనము చేయగనే, గురువు ఆబాలునకు

''ఉపనీయ గురుః శిష్యం మహావ్యాహృతి పూర్వకం|

వేదమధ్యాపయేత్‌, ఏవం, శేచాచారాంశ్చ శిక్షయేత్‌

అను ధర్మవచనము రీతిని, బాలునిచే వేదము నెర్పించి, శేచ ధర్మములు ఆచార ధర్మములు నేర్పించవలయును.

పూర్వము మహనీయులు నాల్గు వేదములు, ఆరు శాస్త్రములు, అష్టదశ పురాణములు, శిక్షాచ్ఛందో జ్యోతిష నిరుక్తాదులు నేర్చుచుండిరి, ఈ శాస్త్రములకే షడంగములని వ్యవహారము.

'బ్రాహ్మణన నిష్కారణో దర్మో షడంగో వేదోధ్యేయోజ్ఞేయశ్చ' అను విధి వాక్యానుసారము బ్రాహ్మణుడు (ఏకోరికలులేకనే) ఏ కారణములులేకనే నాల్గు వెదములను నేర్వవలయును. షడంగములను అనగా శిక్షా, వ్యాకరణ, ఛందో జ్యోతిష, నిరుక్త, కల్పములను నేర్వవలయును, దర్మశాస్త్రములను చదువవలయును. వీనినంతయు నేర్చుటకుగాను దైవికమైన శక్తిని బడయుటకై ఎనిమిదవ వత్సరముననే యుపనయనము చేయవలయునని నిర్ణయించిరి, ఇట్లు ఎనిమిదవ వత్సరమున నుపనయనము చేసి నిష్కామముగ వీనినంతయు నేర్పినచో నా బాలుడు తప్పక లోకమున కంతయు యుపకరించి దైవశక్తి సంపన్నుడై లోకోద్థారకుడు కాగలడు, అందుకై పూర్వము పెద్దలెల్లరు, విధిగ నెనిమిదవ వత్సరమున నుపనయనాది సంస్కారములు జరిపి వేదశాస్త్రములను చదువుచుండిరి.

ఈనాడు పాశ్చాత్య విద్యా నాగరికతలకు లోనై నీ సంస్కారములు సకాలమున చేయకను, నీ వేదశాస్త్ర విద్యలను చెప్పించకను, తమకు దేశమునకు జాతికి, నిర్వీర్యత్వము నాపాదించుకొనగల్గుచున్నారు, ఇది మిక్కిలి శోచనీయము.

ఏదోయుద్యోగ వ్యామోహమునకు లోనై, భూసురత్వమును తొలగించుకొని, వేద సంస్కారములకు దూరులై కేవలము ఉదర నిమిత్తమే జీవించుచున్నామను భ్రాంతికి లోనై మన విద్యలు కళలు సంస్కారములోని గొప్పదనమును తెలిసికొననేరక రత్నమును చూచి నెరుంగలేని యంధునివలె ఈ వేద విద్యలలో గల మహిమనెరుంగలేక యండమావులకై పరుగిడు లేళ్ళపగిది, పాశ్చాత్య విద్యా వ్యామోహమనెడి యండమావులకై పరిగిడి పరిగిడి నిర్వీర్వులై యీరీతిని గుర్తింపలేక యుండడము మిక్కిలి విచారకరమేగదా!

ఈ యుపనయన విధిచే 1. శిఖా 2 యజ్ఞోపవీతము 3. సంధ్యావందనము 4. గాయత్రీ జపము 5. వేదాధ్యయనము అనునవిముఖ్యముగా భావించి ప్రవర్తించిననే యుపనయనమునకు చరితార్థము కాగలదు.

1. శిఖా:- ద్విజన్వత్వముపనయనముచే సిద్ధించును. ఈద్విజన్మము గల్గిన విప్రుని ద్విజుcడనియునందురు. ద్విజునకు శిఖముఖ్యము, శిఖలేనిదియే వైదిక కార్యము ఫలించదు. ధర్మశాస్త్రముననూ శిఖా ప్రాముఖ్యమును గూర్చి నిట్లుగ్గడించి యున్నారు భారతీయులనదగు హిందువులెర్లరు శిఖ విధిగ నుంచుకొనవలయును.

ప్రయోగరత్నే - మధ్యె శిరసిచూడాస్యాత్‌, వాశిష్ఠాన నాంతు దక్షిణ. ఉభయోః పార్శ్వయోః అత్రికశ్యపానాం, శిఖామతా|

మాథవీయేప్యెవం ఆపస్తంబస్త్వాహ|| తూషీంకే శాన్వినీయ యదిర్థిశిఖానదధాతి, యదిర్థి ప్రవరసంఖ్య యాతాసాం, మథ్యశిఖా, వర్జ ముపనయనే వపనం కార్యం ప్రతిదిశం ప్రవపతీ, త్యుపనయనే తేనైవోక్తేః||

రీక్తోవా ఏషోనపిహితో యన్ముండస్తసైఋ తదపి దానం యచ్ఛిఖేతిశ్రుతేః||

విశిఖ్యోప్యుపనీతశ్చ యత్కరోతి నతత్కృతమితిని షేధాచ్ఛ||

నశిఖనోపవీత్‌ స్యాత్‌ నొచ్చరేత్‌ సంస్కృతాంగిరం|

అను ధర్మాలననుసరించి ద్విజునకు ''శిఖ'' ముఖ్యమని, శాస్త్రవేత్తలైన మహర్షులెల్లరు నంగీకరించి నిర్ణయించి యున్నారు, శిఖలేనిదియే వైదికకర్మ యాచరించినను వ్యర్థమందురు. గాన శిఖ ముఖ్యాతి ముఖ్యము.

గాయత్రాతు శిఖాంబద్ధ్వా నైఋత్యాం బ్రహ్మరంధ్రతః

జుటికాంచతతో బద్ధ్వాతతః కర్మసమార భేత్‌''

అను థర్మాన్ననుసరించి వైదిక కర్మలాచరించు తరిని శిఖ ముడి వేసి యనంతరము ప్రారంభింపదగియున్నది.

నిబద్ధ శిఖ ఆశీనోద్విజ ఆచమనం చరేత్‌|

కృత్వోపవీతం సవ్యె7 శే వాఙ్మనః కాయసంయతః||

శిఖాబంధన మొనర్చి కూర్చొని యాచమనాదులాచరింపదగినదందురు.

శిరః ప్రావ్యత్యకంఠంవాసక్తకచ్చశిఖోపివా|

అకృత్వాపాదయోః శేచం ఆచాన్తోప్యశుచిర్భవేత్‌||

పాదములు కడుగుకొనకను, శిఖ ముడివేయకను, వస్త్రము కప్పుకొనిగాని ఆచమనాదులు చేయతగదు. ఈ రీతిని ధర్మశాస్త్ర గ్రంధములు గాని, ఆహ్నికతత్వ గ్రంథములుగాని శిఖ లేనిదే వైదికర్మలకు ప్రాశస్త్యమేలేదని వచించుచున్నవి గాన శిఖి ముఖ్యమని యెంత గ్రహించిన యంత మేలు. ద్విజులు తప్ప నింకనేని శిఖా ప్రాముఖ్యమును గ్రహింతురుగాక,

2. య జ్ఞో ప వీ త ము

యజ్ఞధృతం ఉపవీతం - యజ్ఞోపవీతం లేక యజ్ఞసూత్రమనియు నందురు. బౌధాయనః|| కౌషంసౌత్రం, త్రిస్త్రివృతం, యఘ్నోపవీతమానామేః| మనుః - కార్పాసముపవీతంస్యాత్‌.

కార్పాసముపవీతం, షట్తస్తుత్రివృతం, బ్రాహ్మణస్య అను థర్మశాస్త్రకారుల వచనముల ననుసరించి, ప్రత్తితో వడికిన దారములు మూడు పొరలతో చేర్చి నొక్కపోగువలె మూడు పోగులుకు మూడు మూడులతొమ్మిది పోగులుండులాగున యజ్ఞోపవీతము ధరింపదగినది.

యజ్ఞోపవీతం కుర్వీతసూత్రాణినవతన్తవః

ఏ కేనగ్రంధినాతన్తుస్త్రిగుణోధనా.

యనురీతిని తొమ్మిది పోగులతో చేర్చిన మూడుపోగులను 'బ్రహ్మముడి' యనుపేర నొకముడి వేయదగినది. ''ఏకోగ్రంధిరీతి, నానాత్వ నిషేధార్థం'' యనురీతిని యొ కేముడి యుండదగినది. ఇట్టి నవతన్తు నామకయజ్ఞోపవీతథారణార్థమై గర్భాష్ఠమేబ్దే బ్రాహ్మణస్యోపనయనంశస్తం'' అను ధర్మాన్ని పురష్కరించుకొని యేడవ వర్షముననే యుపనయనము బ్రాహ్మణ బాలునకు చేయుట యుత్తమము.

షోడశవర్షాణాం ఉపనయనాంగయప్రతీయతే

పతితా యస్యసావిత్రీదశవర్షాణింపంచచా,

అనురీతిని పదు నేడు సంవత్సరములు కాగానే సావిత్రీ పతితుడగును, గాన పదునారు సంవత్సరములలోపుగనే బ్రాహ్మణ బాలున కుపనయనము చేయుట ముఖ్యము.

''బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే'' యను తైత్తిరీయారణ్యకమున యజ్ఞొవీతము బ్రాహ్మణునకు ముఖ్యాతిముఖ్యమని వచింపబడియున్నది,

నవతన్తు యజ్ఞోపవీతమునకు అధిపతులు

ఓంకారః ప్రథమస్తన్తుః

ద్వితీయోగ్నిస్తధైవచ

తృతీయోభగదైవత్యః

చతుర్థస్సోమదైవతః

పంచమః పితృదైవత్యః

షష్ఠశ్చెవప్రజాపతి ః

సప్త మోవిష్ణుదైవత్యః

దర్మశ్చాష్టమఏవచ

నవమః సర్వదైవత్యః

ఇత్యే తేనవతన్తవః.

3. సం ధ్యా వం ద న ము

ఉపనయనము చేసిన దినము సాయంకాలమునుంచి సంధ్యావందనమాచరింపదగియున్నది. ఉదయము, మథ్యాహ్నము, సాయంకాలము మూడువేళల సంధ్య వార్చుట విధి, సంధ్యావందనము చేయనిది యుపనయనము చేసియు వ్యర్థము.

''ఉదన్త మస్తంయన్త మాదిత్యమభిధ్యాయన్‌ కుర్యన్బ్రాహ్మణో విద్వాన్‌ సకలం భద్రమన్నుతే'' యను యారణ్యక శ్రుతిప్రమాణానుసారము ఉదయాస్తమయ సంధ్యాకాలములలో సూర్యున కర్ఘ్యమిచ్చి సంధ్యావందన మొనర్చు బ్రాహ్మణునకు సర్వ శుభములు గలిగించగలనని వేదమాత వచించు చున్నది, ఈ వేదవాక్కు ననుసరించి, సూర్యోదయకాలమున ప్రాతఃసంద్యయు, అస్తమయ(మాన) కాలమున సాయం సంధ్యయు సకాలమున నాచరించువానికి శుభ పరంపరలు కొరత యుండవు. ఈ రీతినే మాధ్యాహ్నిక సంధ్యయు తప్పక యాచరించదగి యున్నది.

''వినాయచ్ఛిఖయాకర్మ, వినాయజ్ఞోపరీతతః|

రాక్షసం తద్ధి విజ్ఞేయం, సమస్తాన్నిష్నలాఃక్రియాః

అను ధర్మము ప్రకారము, శిఖ లేకపోయిననూ, యజ్ఞోపవీతము లేకున్ననూ, వైదికకార్యము లాచరించినచో నిష్పలములే గాన, శిఖా యజ్ఞొపవీతములు సంధ్యావందనమునకుగూడ ముఖ్యమనియే గ్రహింపదగినది.

నాభేరూర్థ్వ మనాయుష్యం| అధోనాభేస్త పక్షయః|

తస్మాన్నాభిసమం కుర్యాత్‌, ఉపవీతం విచక్షణఇతి.

యను రీతిని యజ్ఞొపవీతము నాభికి సమంగా పొడవుండదగినదిగాని, నాభి కూర్థముగానున్నచో ఆయుస్సు క్షీణించును, నాభికి క్రిందనుండినచో చేసిన జపాది తపస్సు నశించును గాన నాభి సమంగా యజ్ఞొపవీతమున్నది లేనిది గమనించి నాభి సమంగా నొనర్చుకొని సంధ్యావందనాది కర్మలాచరింపదగినది.

''స్తనాదూర్థ్వం, అథోనాభేఃనకర్తవ్యంకదాచనా'' అనురీతిని నాభికి పైకినుండరాదు, నాభికి క్రిందికి నుండరాదు. నాభి సమంగానుండుటయే శ్రేయము.

శిఖా యజ్ఞొపవీతము లెప్పటికి ధరించియే యుండవలయును గాని, అవసరమగుతరిని యుంచుకొని మిగతా సమయములలో తీసివేయరాదు. ఇందుకు ప్రమాణంగా ధర్మశాస్త్రకారిట్లు వచింతురు.

కాయస్థమేవతత్కార్యం, ఉత్థాప్యంనకదాచన|

సదోపవీతినాభావ్యం, సదాబద్ధశిఖేనచ||

ఎప్పటికి శరీరముననే థరించియుండదగిది. శిఖను ముడివేసియే నుంచదగినది. ఉతవీతిగనే యజ్ఞోపవీతము థరించియుండదగినది. ఈరీతిని శిఖా యజ్ఞోపవీతములు థరించి యుపనయన ప్రభృతి గాయత్రీ యనుష్ఠానమున కుపక్రమింపదగియున్నది.

మౌంజీబంధదినే తిష్టేత్‌ సావిత్రీమభ్యసన్‌ గురోః

సూర్యేస్తశిఖరం ప్రాప్తే సాయం సంధ్యాం సమభ్యసేత్‌.

ఉపనయనమున వెంటనే నిలచియే సాయంకాలమువరకు సావిత్రీయుపాసనము (గాయత్రీజపము) చేయుచండవలయును. సూర్యాస్తమయమగుతరిని సాయంసంధ్యా వందనము చేయదగినది.

ఉపనయన వటువు సంధ్యావందనమువలెనే మరునాటినుంచి బ్రహ్మయజ్ఞముగూడా నాచరింపవలయును. వేదాద్యయనమే ప్రారంభించలేదు గాదా? బ్రహ్మయజ్ఞమెట్లు చేయడమను సందియముగలుగవచ్చును. అందులకు ధర్మకారుల సమాధానము పరికించునది.

ఆరభేత్‌ బ్రహ్మయజ్ఞన్తు, మధ్యాహ్నెతు పరేహని మరుదినము మథ్యాహ్నమునుంచి బ్రహ్మయజ్ఞముగూడా చేయవలయును.

అను పాకృత వేదస్య, బ్రహ్మయజ్ఞః కథంషవేత్‌|

వేదస్థానేతు గాయత్రీ గద్యతేన్యత్స మంభ##వేత్‌||

వేదము రాకపోయిననూ వేదస్ధానమున గాయత్రీ మంత్రమే పఠింపదగినది

వేద మథ్యాపయేత్‌ ఏనం, శౌచాచారాంశ్చ శిక్షయేత్‌ ||

ఉపనయనము చేసిన వటువునకు వేదము నేర్పించవలయును. శౌచాచారాదులలో బాగా శిక్ష యిప్పించవలయును.

దివా సంధ్యాసుకర్ణన్థః బ్రహ్మసూత్రః ఉదఙ్ముఖః

కుర్యా న్మూత్ర పురీషేవా రాత్రౌచేద్దక్షిణాముఖః||

ఉపనయన వటువు శౌ చా చా ర ము లు తప్పక పాటించడము నేర్వదగియున్నది గాన, పగలుగాని సంధ్యాకాలములలోగాని మూత్ర పురీషములు విడువదగినచో, యజ్ఞొపవీతము కుడి చెవునకు చుట్టుకొని ఉత్తరముఖముగ కూర్చొని మూత్ర పురీషాదులు వదలదగినది.

రాత్రికాలమున మూత్ర పురీషాదులు వదలవలసివచ్చినచో యజ్ఞోపవీతము చెవునకు (కుడిచెవుకు) చుట్టుకొని దక్షిణాభి ముఖముగకూర్చొని విడువదగినది,

మధు మాంసాం జనోచ్ఛిష్టశుక్తం, స్త్రీప్రాణిహింసనం,

భాస్కరాలోకనా శ్లీల పరివాదాది వర్జయేత్‌

మధు మాంసములు తినరాదు, ఎంగిలి తినరాదు. నిష్ఠురమైన మాటలు పలుక రాదు. (శుక్తం-నిష్ఠుర వాక్యం) స్త్రీలను తదితప్రాణి లోకమును బాధించరాదు, సూర్యుని చూడ రాదు. అశ్లీలమైన పలుకులు పలుక రాదు కొట్లాడరాదు. ఈ నియమములు బ్రహ్మచారి (ఉపనయనమైన బాలునకు బ్రహ్మచారి యని పేరు) తప్పక యాచరింపదగినది. ఈ నియమములు విధిగ పాటించుచు సంథ్యావందనము చేయుచు వేదాధ్యయనము చేయుట ముఖ్యము.

అహోరాత్రస్య యస్యంధిః సూర్యనక్షత్ర వర్జితః |

సాతు సంధ్యా సమాఖ్యాతా, మునిభిస్త త్వ దర్శిభిః||

అహోరాత్రముల యొక్క సంధి కాలమునకు ''సంధ్యా'' యని పేరు, ఈ సంధ్యాకాలము ఉదయ సంద్యాకాలము సాయం సంథ్యాకాలమని ద్వివిధము. సూర్యుడు కనబడకయు నక్షత్రము లేకనూ యున్న కాలమే సంథ్యాకాలమనదగును.

ఉపాస్యవిధివత్‌ సంథ్యాం'' అను ధర్మము ప్రకారము ఈ సమయమున సంధ్యోపాసన యథావిధిని చేయదగినది.

యదహ్నా కుకుతేపాపం, కర్మణామనసాగిరా

అసీనఃపశ్చిమాం సంధ్యాం ప్రాణాయ మైస్తుహన్తితత్‌.

ఉదయకాలమున చేసిన పాపములన్నియు, మనో వాక్కాయములకు సంబంధించ పాపములన్నియు, సాయం సంద్యాకాలమున కూర్చొని ప్రాణాయామము చేయుటచేతనే నశించును,

యద్రాత్ర్యాకురుతే పావంకర్మణామనసాపివా

పూర్వాం సంధ్యాముపాసీనః ప్రాణాయామైర్వ్యపోహతి.

రాత్రికాలమున చేసిన మనోవాక్కాయ కర్మలకు సంబంధించిన పాపములన్నియు యుదయ కాలమున చేయు ప్రాణాయామము చేనశించును

ఉపాశ్య పశ్చిమాం సంధ్యాం సాదిత్యాం వైయధావిధి

గాయత్రీమభ్యసేత్తావత్‌ యావదృక్షాణిపశ్యతి

సాయంసంధ్య, సూర్యుడ స్తమించుటకు కొంచెముమునుపే ప్రారంభించవలయును. నక్షత్రములుదయించువరకు గాయత్రీ జపము చేయుచుండవలయును.

పూర్వాంసంధ్యాం సనక్షత్రాముపక్రమ్యయధావిధి

గాయత్రీ మభ్యసేత్తావత్‌ యావదాది దర్శనం.

ప్రాతఃకాలమున సంధ్య నక్షత్రములుండగనే ప్రారంభించవలయును సూర్యోదయమగువరకు గాయత్రీ జపము చేయదగినది. సూర్యోదయ కాలమున ఉపస్థానము చెప్పదగినదని విధిగలదు.

ఛాందోగ్యమున ''సాయమాసీనః, సంథ్యాముపాస్తే'' అని బ్రహ్మవేత్తలు సాయంసంధ్యను కూర్చొని యాచరింపవలయుననియు ''ప్రాతఃతిష్ఠన్‌'' సంథ్యాముపాస్తే'' యను విధిచే నుదయ కాలమున నిలిచి సంద్యావందనము చేయదగినదనియు చాందోగ్యోపనిషత్తులో సవివరముగ బ్రహ్మవేత్తలు తర్కించి నిర్ణయించినట్లు గలదు.

''ఈ విథిని యుల్లఘించినచో దోషము మెండుగాగలదు.

''ఉల్లంఘయతియోమోహాత్‌ సయాతినరకంద్రువం'' అను విథి చొప్పున నరక ప్రాప్తి తప్పదు, సంద్యావందనమున, ఆర్ఘ్యప్రదానము, గాయత్రీజపము సూర్యోపస్థానము అని మూడు విదులు ముఖ్యము. అర్ఘ్యప్రదానము సూర్యోదయ సూర్యాస్తమయ కాలమున సూర్యునితో ''మందేహ'' నామకరాక్షసులుసూ ర్యుని బాదించెదరు. ఆ రాక్షసబాధ నుండి తొలగించుటకై ఆర్ఘ్య ప్రదానము విదిగ సూర్యోదయానికి కొంచెము ముందుగను అస్తమయ కాలానికి కొంచెము ముందుగ చేసినచో మనమిచ్చు మంత్రపూతమైన నీటిబిందువులే వజ్రాయుథరూపమున మారి మందేహ రాక్షసులను దూరముగ పారద్రోలగలవని వేదప్రమాణము గలదు, శాస్త్రప్రమాణముగలదు.

-: వేద ప్రమాణము :-

''పూర్వాభిముఖాః, సంద్యాయాం గాయత్రియా

అభిమంత్రితా, ఆపఊర్థ్వం విక్షిపన్తి''

సంద్యా కాలమున తూర్పుముఖమున నిలిచి దోసిలినిండా నీరునింపుకొని గాయత్రీమంత్రముచే నానీరు నభిమంత్రించి పైకి మూరెడెత్తుకుమించకుండా నుండులాగున ఎగుర (శృంగ ప్రమాణమెత్తుననీరు) వేయదగినది.

''తాఏతాఆపోవజ్రీభూత్వా, తానిరక్షాన్‌సి

మందేహారుణద్వీ పేప్రక్షిపన్తి''

ఆ ఎగురవేసిననీకు వజ్రాయుథమువలె మారి ఆరాక్షస గుణమున మందేహారుణద్వీపమున పడవేయును. అని ఆరణ్యకశ్రుతిలోని సంద్యావందన ప్రాముఖ్యమనదగిన యనువాకమునగలదు.

ఈ యభిప్రాయమునే శాస్త్రకారురితితిని వివరించియున్నారు.

-: శాస్త్రప్రమాణము :

''బ్రహ్మహ్యహృతి సంయుక్తం గాయత్ర్యాచ, అభిమంత్రితం

దహ్యన్తే తేన తేదై త్యాః వజ్రీభూతేన వారిణా.

యను నియమానుసారము వ్యాహృతిత్రయ సంయుక్తమైన గాయత్రీ మంత్రముతో నభిమంత్రించి పైకి వెదజల్లిడిన నీటిబిందువులు వజ్రసదృశములైనవై రాక్షసబాధను నశింపజేయగలవు.

''ఏతద్విదిత్వాయస్సంధ్యాం, ఉపాస్తే సంసిత వ్రతః''

ఈ విషయ మెరింగి నియమముతో సంధ్యోపాసన జేసినవాడు,

''దీర్ఘమాయుస్సవిందేత, సర్వపాపైః ప్రముచ్యతే

యస్తుతాం కేవలాం సంధ్యాం ఉపాసీత సపుణ్యబాక్‌.

సర్వపాప విముక్తుడు, దీర్ఘాయుర్దాయముగలవాడు పుణ్యవంతుడు కాగలడు.

దీనిచే సకాలమున సంథ్యావందనమాచరించు నెడల ఆయుర్వృద్ధి కాగలదు గాన నందు కైన సంథ్యావందనము చేయుట ముఖ్యమని నేటి యువకులు భావించుట యుత్తమము.

ఇట్టి గుణములు మెండుగ సంథ్యావందనము చేయగలవు కనుకనే,

సంథ్యాత్రయంతుకర్తవ్యం ద్విజేన ఆత్మవిదాసదా

ఆత్మవేత్తయగు ద్విజుడు, త్రికాల సంధ్యావందనము తప్పక చేయదగియున్నది.

ఈ యర్ఘ్య ప్రదానముచేయు విధాన మీరీతిని శాస్త్రకారులు నిర్ణయించియున్నారు.

''ఈషన్నమః ప్రభాతేతు, మథ్యాహ్నే ఋజుస్థితః

గాయత్ర్యా ప్రక్షి, పేదర్ఘ్యం, సాయంతూపవిశన్‌భువి.

ప్రభాతకాలమున నిలిచియుండి కొంచెము వంగి దోసిలిలోని నీరు అభిమంత్రించి పైకి గోశృంగప్రమాణమెత్తులో పైకి యెగుర వేసి వదల వలయును. మథ్యాహ్నము చక్కగయుండి వదలవలయును, సాయాహ్నమున కూర్చొని వదలవలయును.

''గోశృంగ మాత్రముధృత్య రవిందదృష్ట్వా జలాం జలిం|

దేహపాదే సమేకృత్వా పార్ణీ ఉధృత్య విక్షి పేత్‌ ||

దోసిలిలో నీరు నింపుకొని, శరీరము పాదములు చక్కగను చేర్చియు, నుంచుకొని, కొంచము వంగి, సూర్యాభిముఖముగ నిలిచి, కొంచము మెడమలు ఎత్తి, గాయత్రీమంత్రముతో నభిమంత్రించిన నీరు, గోశృంగ మాత్రయెత్తు కెగురులాగున నీరు నెగర వేయ వలెను.

ఈ విధి ననుసరించి గాయత్రీ మంత్రముచే యర్ఘ్య మొసంగిన ద్విజునకు సమస్త శుభములు వేద పురుషుడు పరమేశ్వరుడొసంగగలడని వేద ప్రమాణమే గలదు.

గా య త్రీ జ ప మ హి మ

ప్రచ్ఛన్నానిచ దానాని, జ్ఞానంచ నిరహంకృతం|

జప్యానిచ సుగుప్తాని, తేషాం ఫలమనలతకం||

దానము చేయడము రహస్యముగ నుండదగినది, అహంకారములేని రీతిని జ్ఞానవృద్ధిని పొందదగినది. రహస్యముగ జపము చేయదగినది. ఈ విధిని పాటించునెడల, అనంతమైన ఫలములు గలుగగలవు గాన, జపముచేయుతఱిని, గుప్తముగ చేయవలయును.

''పూర్వాం సంథ్యాం జపంస్తిష్ఠెత్‌, సావిత్రీ మర్కదర్శనాత్‌'' అను విధి రీతిని, ప్రాతఃకాలమున, సూర్యాభిముఖముగ నిలిచి జపము చేయదగినది.

''పశ్చిమాన్తు సమాసీనః సమ్యగాఋక్ష విభావనాత్‌''

సూర్యాస్తమయ కాలమున సంధ్యావందనము ప్రారంభించి, సాయం సంధ్యాకాలమున, నక్షత్ర దర్శనమగు వరకు కూర్చొనియే జపము చేయదగినది.

ఆసూర్యదర్శనాస్తిష్ఠన్‌ ప్రాఙ్ముఖో గాయత్రీంజపేత్‌

ఆనక్షత్రదర్శనాత్‌ సాయమాసీనః ప్రత్యఙ్ముఖో జపేత్‌

''తిష్ఠన్‌ ప్రాతర్జ పేదౌవీం, ఆసీనః పశ్చిమాం జపేత్‌,

అని పై విధికి ప్రబలముగా మరికొన్ని ప్రమాణములుగలవని చూపడమైనది, వీనిచే తేలిన సారాంశ##మేమనగానుదయము సూర్యాభిముఖముగ నిలిచి జపము చేయదగినదనియు సాయంకాలము పశ్చిమాభిముఖముగ కూర్చొని గాయత్రీజపము చేయదగినదనియు పెద్దల యభిప్రాయము,

'' గాయన్తం, త్రాయసే యస్మాత్‌ గాయత్రీత్వం తతస్మృతాః

తన్నుగూర్చి స్తుతించువానిని రక్షించునది గాన గాయత్రీయని పేరు,

మకారం మనఇత్యాహుః త్రకారం త్రాణమేవచ|

మనః ప్రాణసమాయుక్తో మంత్రయిత్యభిధీయతే||

మనస్సును రక్షించునది గాన మంత్రమందురు. రక్షించునట్టి మంత్రముగాన ''గాయత్రీ మంత్రమని పేరువచ్చుటకు కారణమయినది.

జకారో జన్మవిచ్చెదః పకారః పాపనాశనః

జన్మకర్మ హరో యస్మాత్‌, జపయితిస్మృతః,

జపమని వ్యవహరింతుము, కారణమేమన, జ అనునది, జన్మ లేకుండా జేయును. ప యనునది పాపము నశింపజేయును. కాన, జన్మకర్మల రెంటిని హరింప జేయు జ్ఞానశక్తి నిచ్చునది గాన జపమని వ్యవహారము, యీకారణములచే ''గాయత్రీ మంత్ర జపము'' అనుటకు కారణమైనది.

''ఉభయతః ప్రణవాం సవ్యాహృతికాం, జపేత్‌'' అను విథి ననుసరించి, వ్యాహృతులకు, మొదట యంత్యమున ప్రణము నుచ్చరించుచు, చేర్చి మంత్రమును జపింపదగినది.

''గృహస్ధో బ్రహ్మచారీచ ప్రణవాద్యామి మాంజపేత్‌''

గృహస్థులు, బ్రహ్మచారులు, ప్రవణత తొలుతనుండులాగున గాయత్రీ మంత్రమును జపించవలయును,

ఉత్తమం మానసం సన్యం, ఉపాం సుర్మథ్యమంస్మృతం|

అధమం వాచికం: ప్రాహుః సర్వమంత్రేషు వైద్విజాః

అన్ని మంత్రములుగూడా, మనస్సులో జపించుట ఉత్తమ ఫలము. కొద్దిగ ధ్వని వచ్చులాగున జపించుట మధ్యమ ఫలము. గట్టిగ జపించుట అధమ ఫలము గలుగగలదు.

"ముక్తి దోమానసోజ్ఞోయః ఉపాంసుస్సర్వ సిద్ధిదః

మోక్షార్థులు మానసికముగ జపించదగును. ఉపాంసుగ జపించునెడల సర్వసిద్ధులు సమకూరును అను విధానము గలదు.

"గాయత్ర్యా వేద మూలత్వాత్‌ వేదః సర్వసుగీయతే|

సావిత్ర్యాన్తు జపస్తాభ్యాం. ఏకోప్యానన్త్యమృచ్ఛతి||

గాయత్ర్యా వేద బీజత్వాత్‌ సర్వభిశ్చ జపస్మృతః

అను విధిననుసరించి, గాయత్రీ మంత్రము జపించు తఱిని వ్రేళ్ళ కళపులతో లెక్కింపదగును, వ్రేళ్ళ కళపులతో లెక్కించుకొనుటయే గాయత్రీ మంత్రమునకు ముఖ్యము.

అనామకా మధ్యరేఖా మారభ్య తర్జనీమూల రేఖా పర్యన్తం. ప్రాదక్షిణ్యక్రమేణ, అంగుష్ఠాగ్రేణస్పృశన్‌ మధ్య మాంగుళి మధ్యరేఖాద్వయం మేరుం|

అనతిఅంఘ్యప్రాతిలోయ్యేన అంగుష్టమానీయ పూర్వవత్‌ గుణయన్‌ తత్తజ్జప సమాపనోక్త కాలపర్యన్తం జపేత్‌||

అనామక (ఉంగరపు వ్రేలు) మధ్యకణపు నుంచి, లెక్కింపదగినది, క్రమముగ, చిటికెన వ్రేలు, అనామిక పైగణపు మధ్యవ్రేలు పై గణపు చూపుడు వ్రేలు మూడు గణపులవరకు లెక్కింపదగినది. ఇక్కడికి దశ సంఖ్య యగును.

(మధ్య వ్రేలు మధ్య గణపు చివర గణపు లెక్కింపదగదు. ఈ రెండు గణపులకు మేరువని పేరు.)

మరలా, చూపుడు వ్రేలు చివరిగణపు. మధ్యగణపు పైగణపు, మధ్యవ్రేలు పైగణపు, అనామక పైగణపు, చిటికెనవ్రేలు పైగణపు మధ్య గణపు, చివరి గణపు, అనామిక చివర గణపు మధ్యగణపు వరకు క్రమంగా లెక్కించునది. ఈరీతిని, అనులోమ విలోమములుగ లెక్కించునది.

"ప్రమాదాత్‌ క్షుతజృంభణ అథో వాయు నిర్గమనే

అచమనస్థానే దక్షిణశ్రవణం, ఆర్ద్రాం భూమింవాస్ప ష్ట్యాజపేత్‌"

పై రీతిని జపించు సమయమున, ప్రమూదవశమున, తుమ్ము, ఆవలింపు అధోవాయు నిర్గనము, వచ్చు నెడల దక్షిణ చెవును స్పృశింప వలయును, లేదా భూమినేని, గాని తాకవలయును.

"ప్రదక్షిణ ప్రణామేచ పూజాయాంహవనే జపే|

న కంఠా వృత వస్త్రస్యాత్‌, దర్శనే గురుదేవయోః||

జపముచేయు తఱిని శరీరమునిండుకు వస్త్రము కప్పుకొని జపము చేయరాదు. ఈ రీతినే. ప్రదక్షిణముచేయు. తరిని, నమస్కరించు తఱిని, పూజచేయునప్పుడు. హోమము చేయువేళలలోను, పైవస్త్రము నడిమకట్టుకొనవలయునేగాని కప్పుకొనరాదు.

"గర్ధాధానాద్యాః క్రియా ఉపనైవ పర్యన్తా యధావిధి కృత్యా

వేదమసై#్మబ్రహ్మచారిణ ప్రయచ్ఛతి సగురుః"

గర్భాదానాది యుపనయన పర్యంతముగల సంస్కారములు యధావిధిని జరిపించి,

వేదము నేర్పినవానిని "గురువు" అని వ్యవహరింపదగినది.

"యః ఉపనయన మాత్రం కృత్వా వేదం ప్రయచ్ఛతి

స ఆచార్యః" ఉపనయన సంస్కార మొక్కటి మాత్రము జరిపించి వేదము బోధించిన

వానిని "ఆచార్యుడందురు.

"మంత్ర బ్రాహ్మయోః ఏకంవా, అంగానివా యోథ్యాపయతి స ఉపాథ్యాయః

వేదము నందలి మంత్ర భాగముగాని, బ్రాహ్మణ భాగముగాని, లే, శిక్షా, వ్యాకరణ, ఛందో జ్యోతిషనిరుక్త కల్పములలోనే యొక్క భాగముగాని బోధించిన వానిని ఉపాథ్యాయుడందురు.

పాకయజ్ఞాదికం కరోతి స ఋత్విక్‌.

యజ్ఞ యాగాది భాగాలు చేయించు వానిని ఋత్విజుడందురు.

"తపసశ్చ పరస్యెహ నిత్య స్వాద్యాయవాన్‌ ద్విజః

నిత్యము వేదాథ్యయనము చేయు నెడల, తపస్సగును, అనగా నింతకన్నా మించిన తపస్సు వేరొండులేదని భావము. కనుక ఉపనయనము నాటినుండి వేదము నేర్చి వేదాధ్యయన, తత్పరుడై తపోవంతుడగుట, యుత్తమలక్షణము, కాన గురువు వచించిన రీతిని నిత్యము గాయత్రీమంత్రజప తత్పరుడగుట ముఖ్యము.

"గృహస్థో బ్రహ్మచారీచ శత మష్టోత్తరం జపేత్‌"

అను ధర్మము ప్రకారము, గృహస్థుడు బ్రహ్మచారియు నిత్యము నూటయెనిమిది సంఖ్యాకముగ గాయత్రీ మంత్ర జపము చేయదగి యున్నది.

"స్వర వర్ణ పదైర్వాక్యం, శుద్ధమావర్తయన్‌ జపేత్‌|

స్వరము, అనగా, ఉదాత్త, ఆనుదాత్త, స్వరితప్రచయాది స్వరములే యే యక్షరములకు గలవో వానిని గురుముఖతః బాగుగ నెరిగి, వర్ణములేవేవి యెట్లెట్లు చ్చరించునది గుర్తించి. పదవిభాగ కాలమునచెందు మార్పులను పరిశీలించి, వాక్యత్రయ యుక్తముగ నుండు రీతినెరింగి తప్పులు, లేక శుద్ధముగ నుండులాగున గమనించి జపింప దగినది.

"ప్రవణం వ్యాహృతీస్తిస్రో గాయత్రీంచ జపేత్క్రమాత్‌"

అను విధి చొప్పున. తొలుత ప్రవణముచ్చరించి, అనంతరము వ్యాహృతీత్రయమును చెప్పి, యనంతరము గాయత్రీ మంత్రము నుచ్చరింపదగినది.

"అచ్ఛిన పాదా గాయత్రీ బ్రహ్మహత్యాం ప్రయచ్ఛతి|

భిన్న పాదాతు గాయత్రీ బ్రహ్మహత్యాం వ్యపోహతి

అను వైద్యనాదీయ స్మృతిముక్తాఫల ధర్మశాస్త్రమున విష్ణు వచనాను సారము గాయత్రీ మంత్రమును, పాద భేదములేక జపించినచో బ్రహ్మహత్యాది దోషములు గల్గును గాన, పాదత్రయ భేదముతో గాయత్రీ మంత్ర జపము చేయునెడల బ్రహ్మహత్యాది దోషము లెల్లయు తొలగును.

"ఉత్తమం మావసంజప్యం, ఉపాం శుర్మధ్యమం స్మృత్‌ం|

అధమం వాచికం ప్రాహుః సర్వమంత్రేషు వైద్విజాః||

అను రీతిని, మానసికంగా చేయు జపముత్తమము ఉపాంశువు అనగా, థ్వని రహితముగా పెదమలు కదలించుచు చేయు జపము మథ్యమ ఫలితము, థ్వనితో బిగ్గరగ జేయు జపము అథమ ఫలితము గల్గును. గాన క్రమక్రమముగా, సాథకుడు, వాచికము నుంచి, వుపాంశువునకు, వుపాంసవునుంచి మానసిక జపశక్తిని, సోపానక్రమముగ నధిరోహింపదగును.

"పాతరుత్తాన పాణిభ్యాం, స్తబ్దాభ్యాం దినమథ్యమే|

అధోముఖాభ్యాం పాణిభ్యాం. సాయం సంలక్షితో జపేత్‌

ప్రాతర్నాసా సమౌకుర్యాత్‌, మధ్యాహ్నే తూరసాసమౌ

సాయంకాలే నాభి సమౌ, కరౌ, కుర్యాదతంద్రితః

అను వైద్యనాదీయాహ్నిక కాండములోని వ్యాసోక్తి ననుసరించి, వుదయము నిలువబడి, హన్తములు రెండు ముక్కుకు సూటిగ నుండులాగున నుంచుకొని, నూటయెనిమిగి సంఖ్యగ, గాయత్రీ జపము చేయదగినది.

మధ్యాహ్నకాలమున హృదయమునకు సరిగ నుండులాగున హస్తములుంచుకొని జపింపదగినది.

సాయంకాలము నాభికి సమముగ హస్తములుంచుకొని జపింపదగినది.

"సత్యైరపినభాషేత జపహోమార్చనాదిషు"

అనుధర్మము ప్రకారము జపము, హోము, పూజ చేయుకాలమున యదార్థవిషయములైనను మాట్లాడరాదు.

'మతిమాన్నకదాచిత్తు గాయత్రీముదకేజపేత్‌

గాయత్ర్యగ్నముఖేప్రోక్తా తస్మాదుత్తీర్యతాం జపేత్‌"

అని వైద్యనాదీయస్మతిముక్తాఫల ధర్మశాస్త్రమున ఆహ్నిక కాండలో గోభిలవచనమురీతిని నీటిలో నిలిచి, యెన్నడూ బుద్ధిమంతుడైనవాడు గాయత్రీ జపము చేయరాదు. గాయత్రి "అగ్నిముఖ" గాన నీటిలో నిలిచి చేయతగదు.

"నజీర్ణేన ననీలేన పరిప్లుష్టేనవాజపేత్‌"

అను నియమము మేరకు చినిగిన వస్త్రము ధరించిగాని; నీలవర్ణ వస్త్రము ధరించిగాని మలిన వస్త్రము ధరించిగాని గాయత్రీజపము చేయతగదు.

ఏతదక్షరమేతాంచ, జపన్వ్యాహృతి పూర్వికాం|

సంధ్యయోర్వేదవిప్రోవేద పుణ్యనయుజ్యతే"

("ఏతదక్షరం - ప్రణవం, ఏతాం - గాయత్రీం")

ప్రణవముతో వ్యాహృతిత్రయముతో గాయత్రీ జపము చేయదగినది.

వ్యాసః ప్రణవవ్యాహృతియుతాం గాయత్రీస్తుతతోజపేత్‌

సమాహితమనాః తూష్ణీం మనసావాపిచిన్తయేత్‌,

అను వ్యాసవచనానుసారము ప్రణవ వ్యాహృతీసహిత గాయత్రిని జపింపదగదది.

బోధాయనః| ప్రణవో వ్యాహృతస్తిస్రః సావిత్రీచేత్యె తే పంచబ్రహ్మ యజ్ఞా అహరహః బ్రహ్మణం కిల్చిషాత్‌ పావయన్తఇతి. అను రీతిని ప్రణవము వ్యాహృతిత్రయముతో గాయత్రిని జపింపదగుననిరి.

యోగయజ్ఞవల్క్యః "ఓంకారం పూర్వముచ్చార్య భూర్జువస్స్వస్తథై వచ| గాయత్రీం

ప్రణపంచాన్తే జపఏవముదాహృతః| అనురీతిని ఆద్యన్తములలోప్రణవసహిత వ్యాహృతీయుత గాయత్రిని జపింపదగుననిరి. బోధాయనోపి "ఉభయతః ప్రణవాం, సవ్యాహృతికాంజపేత్‌" అనురీతిని వ్యాహృతితో గూడిన ఉభయస్థానముల ప్రణవముగ గాయత్రిని పఠింపదగుననిరి,

"షడోంకారాన్‌ జపేద్విప్రో గాయత్రీం మనసాశుచిః

అనేక జన్మజైః పాపైఃముచ్యతే పాత్రసంశయః

అని యీరీతిగ పలుపలు విధములుగ గాయత్రీ మంత్రమునకు ప్రణవమును గూర్చి చర్చించిరి. ఈ చెప్పిన విధానమంతయు "తత్యర్వంగృహస్థబ్రహ్మచారి వ్యతిరిక్త విషయం" అను ప్రమాణము ప్రకారము.

"ప్రణవోప్యత్ర మంత్రాదౌ, వ్యాహృతీత్రితయంతతః| జపేప్రశస్తాసావీత్రీ ప్రణవేన సమన్వితౌ, అతిప్రశస్తాతేనాపి వ్యాహృతిత్రీత యేనచ,

అనురీతిని ప్రణవము వ్యాహృతిత్రయము ప్రణవముతో మంత్రము పఠింపదగినది. అని విశ్వమంత్రవచనములకు భావము.

సంవర్త: "ప్రణవాద్యాంతు, సంధ్యాయాం, జపేతీ వ్యాహృతిభిః సహా" అనురీతిని ప్రణవముతో మంత్రజపము చేయదగును.

"గాయత్రీరహీతావిప్రాః తధైవ నరకం వ్రజేత్‌.

అని గాయత్రీ తంత్రమున చెప్పినరీతిని గాయత్రీ మంత్ర జపములేని విప్రులు నరకమును బొందుదురు.

"శాలగ్రామశిలామగ్రే కృత్వా దివ్యంకరోతియః"

అను గాయత్రీ తంత్ర ప్రమాణానుసారము శాలగ్రామముల యెదుట గాయత్రీ జపమొనర్చు నడల దివ్యత్వము గల్గును.

ఛాందోగ్యోపనిషత్తులోని ద్వితీయ ప్రపాఠకము మొదలీ గాయత్రీ యనుష్ఠాన విధానముగలదు. అందులోని తృతీయ ప్రపాఠకమున "ఇత్యుపాసీత తేజస్వ్యన్నాదో భవతియ ఏవంవేద" అను మంత్రములోని ధర్మము ప్రకారము గాయత్రీ జపతత్పరుడు తేజోవంతుడు కాగలడు, కాన శిష్టానుసారము గురుముఖతః వచ్చినరీతిని ప్రణవసహిత వ్యాహృతీసహిత గాయత్రినిగాని ప్రణవ వ్యాహృతీ ప్రణవసహిత గాయత్రినికాని ప్రణవత్రయ గాయత్రినిగాని జపించదగునని రూఢి.

అగ్నికార్యము - లేక - సమిధాథానము.

ఉపనయనమయిన వటువునకు బ్రహ్మచారియని వ్యవహరింతురు. బ్రహ్మచారియైన వటువు సంథ్యావందనము యెంతముఖ్యమో నంత ముఖ్యము సమిథానము చేయదగినది. ఈ సమిథాథానమునకే అగ్నికార్యమనియుపేరు.

ఈ అగ్ని కార్యము ఉదయము సాయంకాలములయందు చేయదగినది. రాగి సమిధలచేతగాని, మోదుగ సమిధలచేగాని నీ యగ్నికార్యము చేయవలయును.

సమిధాదానము ఉపనయనమునాటినుంచి వివాహ పర్యంతము బ్రహ్మచారి విథిగ చేయవలయును. "ఆయుషా, వర్చసా, యశసా, బ్రహ్మవర్చసేన, అన్నాద్యేన" అనునట్లు అగ్నిహోత్రమున బ్రహ్మచారి, సమిథనలను అర్పించి తనకు ఆయుర్వృద్ధి కావలయుననియు తేజోవృద్ధి కావలయుననియు, కీర్తివృద్థి కావలయుననియు బ్రహ్మవర్చస్సు వృద్ధికి వలయుననియు కోరి యగ్ని కార్యమాచరింపదగియున్నది పదమూడు మంత్రములతో నిత్యము పదమూడు సమిథలు హోమము చేయుటకే సమిధాధానమని వ్యవహారము.

శ్రద్ధాంమేధాం, యశః ప్రజ్ఞాం, విద్యాం బుద్ధిం శ్రియం బలం

ఆయుష్యంతేజ ఆరోగ్యం దేహిమే హవ్యవాహన,

అని శ్రద్ధా మేథాప్రజ్ఞా బుద్ధి బల యారోగ్యాదుల నివ్వమని యగ్నిని ప్రార్ధించి పొందుటకై విధిగ నీ సమిథాథానము యేర్పడియున్నది కాన బ్రహ్మచారులెల్లరు నీ సమిథాధానమాచరించిన తప్పక శ్రద్ధా మేథా బుద్ధి బలాదులు బొందగలరు.

-----ఉ పా క ర్మ-----

ఉపనయన ప్రభృతి ఆ జీవితము శ్రావణపౌర్ణమినాడు ఉపాకర్మ విధి నాచరించుచునేయుండదగినది. ముఖ్యముగ తొలి యుపాకర్మ, లేక ప్రధమశ్రావణము అనురీతిని నూతనముగ ఉపనయనమైన వటువు యధావిధిని యుపాకర్మను నాచరించుటకై ప్రయత్నింపదగియున్నది, ఇందుకు బోథాయనులు;

"శ్రావణ్యాం పౌర్ణమాస్యాం ఆషాఢ్యాంవా ఉపాకృత్య తైష్యాం మాష్యాంవా ఉత్పృజేయుః అను నిర్ణయము ప్రకారము, శ్రావణ పౌర్ణమినాడు గాని ఆషాఢ పౌర్ణమునాడు గాని, ఉపాకర్మనాచరింపదగినదనియు పుష్యపౌర్ణమిగాని మాఘపౌర్ణమిగాని, ఉత్సర్జనము చేయదగినదనియు నిర్ణయించిరి.

ఆపస్తంబహర్షి పుంగవులు:- శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అధ్యాయము పాకృత్య మాసం ప్రదోషెనాధీయీత తైష్యాం పౌర్ణమాస్యాం రోహిణ్యాంవా విరమేద,

అను విధి చొప్పున, శ్రావణ పౌర్ణమినాడు ఉపాకర్మనొనర్చి పుష్యపౌర్ణమినాడు ఉత్సర్జనము చేయదగినది. లేదా, రోహిణీ నక్షత్రయుక్త పుష్యమాసమున యేవి ఉత్సర్జనము చేయదగినది.

"అధ్యాయనాం ఉపాకర్మ శ్రావణ్యాం తైత్తిరీయకాః

బహ్వృచాః శ్రవణ కుర్యుః సింహస్థోర్కోభ##వేద్యది||

యజుర్వేదీములైన తైత్తిరీయ శాఖాధ్యాయులు శ్రావణపౌర్ణమినాడే యుపాకర్మ చేయదగినది. ఋగ్వేదీయులు శ్రావణ మాసములో శ్రావణ నక్షత్ర మెనాడుండునో నాడే యుపాకర్మ చేయదగినది.

"గహణ సంక్రమేచ, తదుపాకర్మనకుర్యుః" అను నిషేధము చొప్పున, శ్రావణ పౌర్ణమినాడు, గ్రహణముగాని, సంక్రమణము గాని యున్నచో, ఉపాకర్మ చేయరాదు, కాన

"సహస్త శుక్లపంచమ్యాం నతద్గ్రహణ సంక్రమే|

అసింహార్కే ప్రౌష్ఠపద్యాం శ్రవణచ వ్యవస్థయా|

అను రీతిని "తత్రాసంభ##వేతన్మాసఏవ హస్తానక్షత్రయుక్త పంచమ్యాం నాకుర్యుః| గ్రహణ సంక్రమేచ తదుపాకర్మన కుర్యుః కాన, శ్రావణశుద్ధ పంచమీహస్త నక్షత్రయుక్తమై యున్నచో పౌర్ణమి గ్రహణ సంక్రమాది దోషమైనచో, యుపాకర్మచేయరాదు గాన, హస్త నక్షత్రయుక్త శ్రావణ శుద్ధపంచమి యుపాకర్మ చేయదగినది.

"ఆసింహార్క ఇతి, యది సూర్యః సింహరాశిస్థోనభవతి. తదా ప్రౌష్ఠపద్యాం తైత్తిరీయకాః కుర్యుః| బహ్వృచాః శ్రవణ నక్షత్రయుక్త తిధే ఇతివ్యవస్థా| చకారాత్‌ భాద్రపదమాసే హస్తా నక్షత్రయుక్త తిధె ఇతి సూచితం||

సింహరాశిలో సూర్యుడులేని తరిని శ్రావణ పౌర్ణమిరోజున తైత్తిరీయులు యుపాకర్మ చేయతగదు గాన భాద్రపదమాస పౌర్ణమినాడుపాకర్మ చేయదగును. ఋగ్వెదులు మాత్రము శ్రవణ నక్షత్రయుక్త శ్రావణమాసముననే యుపాకర్మ చేయదగినది. హస్తా నక్షత్రయుక్త భాద్రపద మాసముననూ చేయదగును.

"పర్వణ్యౌదయికే కుర్యుః శ్రావణ తైత్తిరీయకాః

బహ్వృచాః శ్రవణరెక్షతు హస్తర్‌క్షే సామవేదినః

శ్రావణ పౌర్ణమినాడు ఉపాకర్మ తైత్తిరీయులు చేయదగినది. ఋగ్వెదులు శ్రవణ నక్షత్రమున్న రోజుననే యుపాకర్మ చేయదగినది. సామవేదులు హస్తానక్షత్రతిధి రోజున యుపాకర్మ చేయదగినది.

మలమాసే నిపతితే సూతకే మృతకేసివాః

గ్రహణ సంక్రమేవాపి మేధ్యేపి గురుశుక్రయోః||

ష్ఠపద్యాం ఆథాషాఢ్యాం ఉపాకరణమిష్యతే||

శ్రావణమాసము అథిక మాసముగనున్ననూ, జాతాశౌచ, మృతాశౌచమును వచ్చియున్ననూ, శ్రావణమాసమున పౌర్ణమినాడు ఉపాకర్మ చేయరాదు. ఆరీతిని, శ్రావణ పౌర్ణమినాడు, గ్రహణముగాని, సంక్రమణముగాని లేక గురు శుక్రుల మౌఢ్య దోషములున్ననూ శ్రావణ పౌర్ణమి యుపాకర్మకు తగదు గాన, భాద్రపదమాసమున యుపాకర్మ చేయదగినది ఈ భాద్రపదముననూ దోషయుక్తమేయై యున్నచో ఆషాఢ పౌర్ణమి నాడే యుపాకర్మ చేయదగినది.

"ప్రౌష్ఠపద్యాం ఉపాకుర్యాత్‌, శ్రావణీ దూషితాయిది|

ఆషాఢేవాపి కర్తవ్యం, ప్రౌష్ఠపద్యాస్తు దూషణ|

మాసత్రయేపి దోషశ్చేత్‌ శ్రావణ్యమేవ కారయేత్‌||

శ్రావణ పౌర్ణమి పై చెప్పిన దోషయుక్తమై యున్నచో భాద్రపదపౌర్ణమినాడుపాకర్మ చేయదగును, భాద్రపద, పౌర్ణమి దోషయుక్తమైనచో ఆషాఢపౌర్ణమినాడుపార్మ చేయదగును. ఆషాఢ శ్రావణ భాద్రపద పౌర్ణమీలు మూడు దోషయుక్తములై యున్నచో శ్రావణ పౌర్ణమినాడే యుపాకర్మ చేయదగును.

త్రిష్వపి దుష్టేతు శ్రావణమాసి శాంతిపూర్వకా కర్తవ్యా

ఉదితమంత్రకైః గ్రహయజ్ఞోక్త మంత్రకైః||

అనురీతిని శ్రావణ భాద్రపద ఆషాఢ మాసములు మూడు గురు శుక్రాస్తమయములచేతను, గ్రహణ సంక్రమణాదులచేతను. అధిక మాసాదుల చేతను దోషవంతములైనచో శ్రావణమాస పౌర్ణమినాడే నవగ్రహాది శాంతి జరుపుకొని, యుపాకర్మ చేయదగినది.

కాన యీరీతిని శ్రావణమాసమును పరిశీలించి యుపాకర్మ యాచరింపదగినది ఈ యుపాకర్మ చేసినచో వేద చోదిత కర్మలుతాను యాచరించునెడ, ఫలవంతములగును. వేదపాఠము ఫలించును. లేనిచో అనగా యుపాకర్మ యాచరింపనిచో ఫలితము వైదికర్మలకు తక్కువయగును.

అందుచేతనే, యుపాకర్మ విధిని నీరీతిని గృహఃసూత్రమున చెప్పబడియున్నది.

ఓషధీషు ప్రాదుర్భావే శ్రావణ్యాం పౌర్ణమాస్యాం, శిషై#్యస్సహాచారః నదీం తటాకం వాగత్వా, కేశశ్మశ్రులోమనఖాని వాపయిత్వా మృత్తికాస్సానం, వారుణ స్నానంకృత్వా సంథ్యావందనాదికం కుర్యాత్‌|| పాగ్దేశేగోమయే నానులివ్వ, రంగవల్యాది భిరలంకృత్య, నూతనవస్త్రేణ మంటప మాసాధ్య, తస్యోపరి, యధాశక్తి తండులాన్నిధాయ, ఆదే దీపారాధనంకృత్వా ప్రణమ్య||

అను సూత్రకారులైన, ఆపస్తంబమహర్షుల వచనానుసారము ఓషధులు మొలచిన కాలమైన శ్రావణ పౌర్ణమినాడు, శిష్యులతోగూడి గురువు, నదికిగాని, తటాకమువద్దకుగాని వెళ్ళి ఆయుష్కర్మ నిర్వర్తించి మృత్తికాస్నానములు, వారిణస్నానములు చేసి, సంథ్యావందనాదులు ఆచరించి, తూర్పుదిశలో గోమయముచే నలికి, ముగ్గులు తీర్చి, నూతన వస్త్రముపరచి, యందు బియ్యముపోసి, దీపారాథనాదులు చేసి యుపాకర్మ యారంభింపవలయును.

బ్రహ్మచర్యవ్రతలోప ప్రాయశ్చిత్తార్థం, పాహిత్రయోదశహోమము చేయవలయును, ప్రాజాపత్యాది నవ ఋషులను పూజింపవలయును

చదివిన వేదాధ్యయనము శక్తి వంతమగుటకును అధీతానాంచందసాం సవీర్యత్వాయ అధ్యాయోపాకర్మ హోమంకరిష్యే అని యుపాకర్మహోమము చేయదగినది.

"ఛందసాం సవీర్యత్వాయ, శ్రౌతస్మార్త నిత్యకర్మానుష్ఠానమోగ్యతాఫలసిథ్యర్థం. యజ్ఞోపవీక దానం, ధారణం కరిష్యె" అని యజ్ఞోపవీతదాన ధారణములు చేయవలయును.

సంవత్సరకృత దోష ప్రాయశ్చితార్ధం, విరజాహోమము చేయవలయును.

మారుత మసీతి యను వాకచతుష్టయమును, జపించి స్వగృహమునకు విచ్చేయవలయును.

ప్రాజాపత్యాది వేదవ్రత చతుష్టయమును నిర్వర్తించి, స్నాతకవ్రతము ఆచరించి, యనంతరము వివాహము చేసికొనవలయును ద్విజులు.

అనంతరము "మమఆయుష్యాభివృధ్యర్థం, స్నాతకవ్రతాఖ్యం కర్మకరిష్యమాణః" యని ఆయుర్వృద్ధికై స్నాతకవ్రతము విధిగ చేయదగినది.

"సర్వెషాందోషాణాం అవనోదనార్థం, స్నాతకవ్రతము, నాచరింపదగినది. "ఉపనయనాది సమావర్తన పర్యన్తం మథ్వేసంభావితానాం పాపానాం వృద్ధోలంఘన పాషండాది సంసర్గ ప్రభృతిత్రయ త్రింళన్నిమిత్తానాం సర్వేషాం దోషణాం అపనోరనార్థం,

బ్రహ్మచర్యవ్రతలోపప్రాయశ్చిత్త వినిశ్చిత్య ఉపదిశ్యమామను గృహ్ణంతు భవంతః" అని,

బ్రాహ్మణవటువు, విద్యాభ్యాసాద్యనంతరం స్నాతక వ్రతమను కార్యమును నాచరింప దగియున్నది. అనంతరము వివాహార్ధమై ప్రయత్నాదులు చేయదగును.

"చరిత బ్రహచర్యోహం, కృతవ్రత చతుష్టయః

కాశీయాత్రాం గమిష్యామి అనుజ్ఞాం దేహిమే శుభామ్‌"

అని స్నాతకవ్రతకాలమున చేరిన పెద్దలనుగూర్చి కాశీయాత్రకు, అనుజ్ఞయియ్యవలసినది, విద్యాభ్యాసానంతరిము వేదవ్రత చతుష్టయమును నాచరించిన పిదప, కోరవలయును.

అట్టి తఱిని, కన్యాదాత, యెదురై,

"సాలం కారాంమమసుతాం, కన్యాం దాస్యామి హేద్విజ

పాణీంగృహీత్వా సాగ్నిస్త్వరం గచ్ఛ, స్వాగచ్ఛమద్గృహమ్‌"

అని యాచించి వివాహార్థమై కన్యనొసంగును.

"వి వా హ ము"

గార్హస్థ్య థర్మమునకు వివాహము నాంది. వయస్సు వచ్చిన బిడ్డలకు వారి వారి తల్లిదండ్రులు దాంపత్యము నిమిత్తమై నీ వివాహకార్యము నిర్ణయింతురు.

విశిష్టం వహనం (వి+ వహ+ ఘజ్‌) అను వ్యుత్పత్తి ననుసరించి, వరుడు శ్రేష్ఠమైన కన్యను వరించడము అను భావము వివాహమునకు నిర్ణయింతురు.

ఉహ్యతే అనెనేతి = వహ+కరణల్యుట్‌=హోఢః యధా|| తరణోభేలకే వారి రధోనౌస్తరికః ప్లవః

హోఢస్తరాస్థుర్వహనం పహిత్రం వార్విటఃపుమాన్‌, అను త్రి కాండ శేష నిఘంటువు ననుసరించి" హోఢః.

వివాహము - ఉద్వాహము - దారపరిగ్రహము - పరిణయము - పాణిగ్రహణము, అని పర్యాయ పదములుగా నీ వివాహమునకు లోకమున వాడుటయు గలదు. ఈ వివాహములెనిమిది భేదములని శాస్త్రవేత్తలు నిర్ణయించియున్నారు.

"బ్రహ్మోదైవఆర్షః ప్రాజాపత్య ఆసురో, గాంధర్వో రాక్షసః పైశాచ ఇత్యష్టౌ వివాహః" యని యీ యెనిమిదింటికిని పేరు. అనగా 1. బ్రాహ్మము 2. దైవము 3. ఆర్ష్యము 4. ప్రాజాపత్యము 5. ఆసురము 6. గాంథర్వము 7. రాక్షసము 8. పైశాచము అని యెనిమిదింటినందురు.

1. బ్రాహ్మ వివాహమనగా "యోగ్యపరమాహూయ అలంకృత్య కన్యాదాన విధినా తసై#్మదానం బ్రాహ్మోవివాహః అను థర్మము ననుసరించి యోగ్యుడైన వరుని రావించి యా వరునికి తగినరీతిని యలంకరించి, కన్యాదాన ధర్మము ప్రకారము చేయు వివాహమునకు బ్రాహ్మ వివాహమందురు. ఈ బ్రాహ్మ వివాహమునే ప్రకృతము లోకమున యెల్లరు నాచరించునది. చెప్పబడు నెన్మిది వివాహములపైకి నీ బ్రాహ్మవివాహము మిక్కిలి శ్రేష్ఠము. శాస్త్రకారులెల్లరు నంగీకరించినది. కన్యాదాత వంశమునకు కన్యను గ్రహించిన వరుని వంశమునకు ఇహపర సాధనమైనది, వరుని శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపునిగ భావించి కాళ్ళు గడిగి ధాఃరాదత్తముగ నాచరించు వివాహ మీ బ్రాహ్మీవివాహమే కనుకనే కన్యాదాన సమయమున

"కన్యాం కనక సంపన్నాం కనకాభరణౖర్యుతాం

దాస్యామివిష్ణవేతుభ్యం బ్రహ్మలోకజిగీషయా"

అని వరునికి కన్యాదాత పైరీతిని వచించును కన్వాదాన మొనర్చును.

బంగారాభరణములతో నలంకరించిన యీ కన్యను విష్ణుస్వరూపుడవైన నీకు దానమొసంగుచున్నాను. ఈ దాన కార్యముచే, బ్రహ్మలోకమును పొందు శక్తి నాకు గల్గుగాక.

"కన్యమమాగ్రతోభూయాః కన్యమే దేవి పార్శ్వయోః కన్యమే సర్వతోభూయాః త్వద్దానాత్‌ మోక్షమాప్నుయాం"

"విశ్వంభరస్సర్వభూతాః, సాక్షిణ్యః సర్వదేవతాః

ఇమాం కన్యాం ప్రదాన్యామి పితవాణాం తారణాయనై

"కన్యాం సాలంకృతాం సాద్వీం సుశీలాయ సుధీమతే

ప్రయతోహం ప్రయచ్ఛామ ధర్మకామార్థ సిద్దయే

అను రీతిని. మోక్షార్థము, పితృదేవతలెల్లరు తరించుటకుగాను, ధర్మకామార్థ సిద్ధులు గల్గుటకును, కన్యాదాన మొసంగుచున్నామని కన్యాదాత వరునితో నుడువదగు వివాహము. బ్రాహ్మ వివాహము, అందుచేతనే బ్రహ్మక్షత్రవైశ్య శూద్రులందురు. పై చెప్పిన యెన్మిది వివాహముల పైకి, యీ బ్రాహ్మ వివాహముచే పురార్ధసిద్ధి. పితృదేవతలు తరించడము వంటి మహాఫలములు గలవని భావించి, ఈ వివాహమును ముఖ్యముగ నాచరింపదలంచుచున్నారు.

(2) యజ్ఞెఋత్విక్‌ కర్మ కుర్వతే, అలంకృత్య కనార్పణందైవః అను వచనానుసారము యజ్ఞయాగాదులాచరించు తఱిని, యా కార్యములలో పాల్గొనిన, వటువునకు,

అలంకరించిన కన్యనొసంగడము "దైవ" వివాహమందురు.

అనగా నేదేని యోగాదులాచరించు కాలమున, వచ్చిన వారిలోతగిన వటువునుగాంచి, వానికి వివాహార్థమై కన్యనొసంగడము దైవ వివాహము గాన నిందు కన్యాదానములేదు కన్యను అర్పించడము మాత్రమే. కాన దాన ఫలము సమగ్రముగ చేకూరదు గాన, మొదటి జెప్పిన బ్రాహ్మ వివాహమునే నాచరించుట పరిపాటియైనది.

(3) వరాదేకం గోమిధునం ద్వెవాగృహీత్వాతసై#్మ కన్యార్పణం ఆర్షః" అనురీతిని, వరుని వద్దనుంచి ఆవులను పుచ్చుకొని బదులుగ కన్యను యిచ్చివేసినచో, నీ వివాహమునకు ఆర్ష వివాహమని పేరు. అనగా వరుని నుండి ప్రతిఫలమునుగోరి కన్యనొసంగడము, కాన నిదియు యైహికాముష్మిక ఫలము నివ్వజాలదు. పితృవర్గమును తరింపజాలదు. కన్యాదాతకు బ్రహ్మలోక నివాససిద్ధి యివ్వజాలదు గాన, పెద్దలు తొలుత జేప్పిన బ్రాహ్మవివాహమునే నాచరించుటకు కారణమైనది.

(4) త్వయైతయైవసహ గృహధర్మ ఆచరణీయ ఏతస్యా జీవన పర్యన్తం వివాహోత్తరం చతుర్ధాశ్రమేవాన కార్యఇత్యా భాష్యకన్యాదానం ప్రాజాపత్యః" అను రీతిని. వథూవరులుభయులు, జీవిత పర్యన్తము దాంపత్య థర్మముతోనే మెలంగుచుండవలయునని మాట్లాడుకొని, వారిరువురే, యొకరినొకరు నిర్ణయించుకొని నాచరించు వివాహమునకు ప్రాజాపత్య వివాహమందురు. ఇందు వథూవరులే వివాహ నిశ్చయము జేసికొని తగిన ధర్మాన్ని నిర్ణయించుకొని వివాహము జేసికొందురు గాన, తల్లిదండ్రులకిందు గల్గు బ్రహ్మలోకాది కన్యాదాన ఫలములుండవు గాన పెద్దలు మొదటిరఖ మనదగిన బ్రాహ్మవివాహ ధర్మము శ్రేష్ఠమని వాకొనిరి.

(5) జ్ఞాతిభ్యోయథేచ్ఛం ధనం దత్వా వివాహః ఆసురః" వరుడు బంధువులకు కోరినంత ధనమును యిచ్చి చేసికొను పెండ్లికి ఆసుర వివాహమని పేరు. ఇందు వరుడు కన్య వైపు వారికి థనమిచ్చుటచే, కన్యను కొనినవాడగును. కన్యాదాతలు కన్య నమ్ముకొను వారగుదురు. దీనివల్ల ఉభయలోక ఫలములు నశించును. ఎందు కనగా ఈ లోకమున, కన్య నమ్ముకొని వారినే యపకీర్తి గల్గును.

పరలోకమున కన్యావిక్రయముచే మహాపాపము గల్గిన పరకలో కాదివాసమేర్పడును, అందుచే. రెండు లోకములకు నీ కన్యా విక్రయముచే బాధలుండునుగాన నియ్యదంత శ్రేష్ఠమైనది గాదని భావించి పెద్దలు బ్రాహ్మవివాహ మొనర్చుటకు కారణమైనది.

(6) పరవధ్వోరిచ్ఛయాన్యోన్య సంయోగో గాంధర్వః" కన్య. వరుడు యిరువురు పరస్పరము ప్రేమించుకొని, కలసుకొనుటకు గాంధర్వ వివాహమందురు. ఈనాడు ప్రేమ వివాహాలీ తెగకు చెందగలవు ఇందు కన్యాదాన ఫలమిసుమంత, యేని, కన్యయొక్క తల్లిదండ్రులకు దక్కదు, మరియు వారి ప్రేమ యెంతవరకు పవిత్రమో| ఆవరుడెంతటి గుణవంతుడో ఆ కన్య యెంతటి గుణవతియో| వారి ప్రేమానురాగాలెంతటి స్థిరములో నెవరూహింపగలరు? తలిదండ్రులకు బంధువులకు యిందు ప్రమేయమేమాత్రమూలేదు; ఈ వివాహ మెంత స్థిరమో| భారతమున శకుంతలా దుష్యన్తులగాధ నెరిగిన తెలియగలదు.

మహాధర్మాత్ముడు, మహాసాంరాజ్య పాలకుడైన దుష్యంతుడే గాంధర్వవిధిని శకుంతలను మహాఋషి యాశ్రమమున పెండ్లియాడీ, కామబాధను తొలగించి పురమునకేగి మిన్నకుండెను. శకుంతలకు పుత్రుడు సహా గలిగెను. దుష్యంతుడు రాకపోగా తానే దుష్యన్తునికడకు హస్తినగరమునకు వెళ్ళి రాజసభలో తమ వివాహమునుగూర్చి ముచ్చటింపగా తనకు సంబంధములేనివానివలె దుష్యంతుడు పలికెనుగదా! ఇంక సామాన్య మానవులు యీ కలికాలమున నీ ప్రేమ వివాహములో నైనచో, కొంతకాలమున కాదంపతులు విడిపడినచో, నాస్త్రీ గతి యేమికావలయును? అందుచే పెద్దలీ వివాహమున కంత ప్రాముఖ్యతమివ్వక, తొలి వివాహమున దగిన, బ్రాహ్మవివాహమునకు ప్రాముఖ్యతమివ్వవలసివచ్చినది.

(7) యుద్ధాదినా బలా ద్వరణం రాక్షసః" రాజులు మొదలైన వారు శత్రువులతో యుద్ధాదులు జేయగా సంధికాలమున, గాని, బలవంతముగా గాని, శత్రుపక్షమునగల కన్యను నిర్బంధముగా వివాహము చేసి కొనడము రాక్షస వివాహమందురు. ఇందు కన్య తలిదండ్రులు వగైరా బంధుజాలమునకు యీ కన్యను యిచ్చుటకు యిష్టము లేకపోయిననూ, విధిలేక, ప్రాణ రక్షణార్థమో! దేశరక్షణార్థమో, కులరక్షణార్థమో, కన్యను, అయిష్టముగ వరునకు యిచ్చి వేయిడమునకు రాక్షస వివాహమందురు.

శ్రీకృష్ణ దేవరాయలు, గజపతులను నోడించు తరినీ. సంధిజేసికొని వారి పుత్రికను, వివాహమాడినట్లు చరిత్ర గలదు. ఈ రీతిని పూర్వపు రాజాదులు బలవంతముగ, కన్యను గ్రహించు చున్నట్లు చరిత్రలున్నవి. ఈ వివాహాలు రాక్షసకృత్యములు గాన రాక్షసవివాహమనిరి.

ఇందు తల్లిదండ్రులు తదితర బంధువులు దుఃఖముననుందురు. ఇష్టబడరు. కాని, శత్రువు బలవంతుడగుటచే విథిలేక కన్యనొసంగుటచే కన్యాదాన ఫలమిందు లేశమాత్రమేని లేని కారణాన బ్రాహ్మలోకాది సిద్ధులు గలుగవు. పిత్రగణము తరించరు గాన, గర్హ్యమని భావించి, బ్రాహ్మ వివాము శ్రేష్ఠమని నిర్ణయించిరి.

(8) చౌర్యేణ న్యాహరణం పైశాచః" అనురీతిని కన్యను దొంగిలించుకొని వచ్చి, దొంగపెండ్లి యను రీతిని కన్యను పెండ్లియాడడము పైశాచము అందురు. ఇందు వరుడు, కన్యను గోరిగాని, కన్య వరుని గోరిగాని, యుండి వేరొక వరునకు, కన్య నివ్వదలంచియుండ నాసంగతి యెరింగి, ఆ నిర్ణయించిన వరునికి కన్య దక్కనివ్వకుండా కన్యను హరించుకొనివచ్చుట యుందుండుటచే, ఆసురకృత్యముగాన నిద్దానికి ఆసురవివాహమనిరి. శ్రీకృష్ణుడు, రుక్మిణిని హరించుకొనివచ్చి పరిణయమాడిన విథానము భాగవత దశమ స్కంధమున గలదు. ఇందు, రుక్మిణీదేవి కృష్ణు పెండ్లియాడదలంచియుండినది. శ్రీకృష్ణుడామెను వివాహమాడవలయునని భావించి యుండెను, రుక్మిణీ దేవి తండ్రిగూడ, రుక్మిణిని కృష్ణునకే యివ్వదలంచి యుండెను. కాని, రుక్మిణియొక్క పెద్దఅన్న, కృష్ణుడనిన సరిపడనివాడు, ద్వేషించువాడు, మూర్ఖుడు, దుర్మార్గుడు వీని భాధకు తలిదండ్రులుగూడ భయపడి కృష్ణునకు కన్య నివ్వలేకుండిరి. రుక్మిణికీసంగతి తెలుసునుగాన, శ్రీకృష్ణుని రమ్మనమని దూతనంపి, కృష్ణునివెంట వచ్చినది గాన. నిందు కొంత ధర్మమున్నది, అయిననూ శ్రీకృష్ణుడు పెండ్లియాడెనుగదాయని యందరూ నారీతిని, నాచరించడమయుక్తముగాన నీ పైశాచిక వివాహమంత యుక్తముగాదు గాన పెద్ద లెవ్వరు దీని నంతగా నంగీకరింపక మొదటిది యనదగు బ్రాహ్మవివాహము శ్రేష్ఠము, ధర్మవంతము, కులము కుటుంబమునకు బంధువులకు మంత్రులకు. లోకమునకు కీర్తికరము. ధర్మవంతము ఇహపరలోక సాధనముగాన, నీ బ్రాహ్మవివాహమే సర్వులకు నాచరణీయమని నిర్ణయించిరి,

ఈ వివాహములను గూర్చి భారతమున అనుశాసనిక పర్వమున ద్వితీయాశ్వాసమున భీష్ముడు ధర్మరాజునకు, గాంధర్వాది వివాహములను గూర్చి నీరీతి నెఱింగించెను.

ధర్మరాజు భీష్మునీరీతిని ప్రశ్నించెను.

"కన్యావరణ పంరకారంబు విచారణీయంబైన కృత్యంబు దాని తెఱంగెఱింగింపవేయనుటయు, నతండతనికిట్లనియే

కం|| "కులమును శీలము విద్యయుగల వానింబిలయి ప్రీతిCగన్నియనీCగా, వలయునుదకప్రదానా కలితంబుగ బ్రాహ్మకర్మ గతి యిది యధిపాః"

యని భీష్ముడు థర్మరాజునకు బోధించిన తెఱంగు పరిశీలించినచో మంచి కులమున జన్మించినవాడై యుండవలయుననియు, మంచినడవడిక గలవాడును విద్యావంతుడగు వాడును, గుర్తించినట్టివానిని రావించి కన్యను నుదకదాన పూర్వకముగ కన్యాదాన మొనర్చుట శ్రేయమనియు, నీ వివాహమునకు బ్రాహ్మవివాహమని పేరనియు నుడివెను.

ఆ|| క్షాత్రమండ్రు బుధులు కన్య పురుషగోర, నతడు కన్యమీద నాససేయ! సచలమగు పరస్పరానురాగముగని ప్రమథమనగCజేయు పరిణయంబు"

తొలుత మనవిజేసిన నాలుగవదగు ప్రాజాత్య వివాహమునే నిందు, క్షాత్రవివాహమనుపేరనుడివినట్లున్నది. కన్య వరునిజూచి వరుడు కన్యను జూచి ప్రేమించి జేసికొను వివాహము.

కం|| కన్ను మనంబును దనిసినCగన్నియ యెవ్వానిCగోరు గాంధర్వంబా| యన్ను నతని కిచ్చుట, వెలవన్నుట యాసురము సూవే పౌరవ ముఖ్యా"

కన్నియ రూపరేఖా లావణ్యాదులుగాంచి వరించి పరస్పరానుబద్ధులై యొండొరులుప్రేమించుకొని జేసికొను పెండ్లికి, గాంధర్వ వివాహమనియు,

వెలయిచ్చి కన్నియను పెండ్లియాడు విధికి యాసుర వివాహమనియు నందు రనెను.

క|| బలిమి వరుCడు గన్నేకుCగల వారింబొడిచి కరము క్రౌర్యంబున, నప్పోలతుక, దుఃఖింపCగ వారలు వొగులCC దెచ్చికొనుట రాక్షసము నృపా"

బలవంతుడై, కన్యయొక్క బంధువర్గమును బాధించి బలవంతముగ కన్యను తెచ్చుకొనుటను రాక్షస వివాహమని నందురు.

ఈ రీతిని గల వివాహములపైకి ధర్మబద్ధమైన వివాహమొక్క బ్రాహ్మవివాహమే గాన నీ యెన్మిదింటిపైకి బ్రాహ్మవివాహమునకే లోకమున నాల్గు వర్ణములవారికి శ్రేయోదాయకమని పెద్దలు నిశ్చయించుటకు కారణమైనది,

మఱియు బ్రాహ్మవిహమున దర్మబద్ధముగ గల్గిన సంతానమే, యుత్తమమైనదనియు భారతమున అనుశాసననికమున నిట్లుగలదు.

తే|| పరమ సంస్కృతయగు నాత్మ భార్యయందు

థర్మ విధిCగలిగించిన తనయుCడనC

దాన ¸°రనుCడను నభిదాన మొప్పC

బరCగు నుత్తముCడాతCడు ప్రధముCడధిప||

అనుటచే నీ నెన్మిది వివాహములపైకి సత్కుల సంజాతయైన సచ్ఛీలవతియగు కన్యను బ్రాహ్మవివాహముగ పెండ్లియాడినచో, నా పెండ్లికి పరమ సంస్కృత విథియందరు. ఇట్టి ధర్మవిధి చొప్పున గల్గిన భార్యయందు పుట్టిన సంతానమునకే, "¸°రస సంతానమనియు నియ్యది యుత్తమ సంతానమనియు తొలుత లెక్కింపదగిన సంతతియనియు యుధిష్ఠిరునకు భీష్ముCడు వచించెను.

ఇందుచే వేదమంత్ర సంస్కారముచే ధర్మబద్ధముగ పెండ్లియాడు విధియొక బ్రాహ్మవివాహమునకే గలదు గాన బ్రాహ్మవివాహమాయెన్మిదింటిపైకి యుత్తమమని శాస్త్రవేత్తలు నిర్ణయించుటకు హేతువైనది.

మిగతా వివాహాలు వారి వారి యిష్టానుసార ముండును గాన బ్రాహ్మవిధివలె, ధర్మబద్థము వేదమంత్ర సంస్కార పూతములు గావని మాత్రము యెఱుంగ దగియున్నది.

అరణ్య పర్వమున యక్షుడు ధర్మజుని నీరీతి ప్రశ్నించెను.

"నరునకు. నాత్మ యెవ్వCడు, ఘనంబుగ దైవికమైన చుట్టమెవ్వరు"

అని యడుగ ధర్మజుడీరీతిని ప్రత్యుత్తర మొసంగెను.

"ఆత్మజుCడు నువ్వే, పురుషున కాత్మయయ్యె, నాతనికీ భార్య దైవికమైన చుట్టము." అనెను.

ధర్మబద్ధమైన వివాహమున గల్గిన భార్యదైవ నిర్ణయమైన చుట్టము మానవుని కనియు, అట్టి థార్మిక వివాహమున గల్గిన పుత్రుడు, ఆత్మతో సమానమైన వాడనియు వేద సాంప్రదాయ సిద్ధమైన భావమును వ్యక్తీకరించెను. వేదముననూ "ఆత్మావైపుత్రనామాసి" యని గలదు. ఆత్మయే పుత్రుడుగా జన్మించుచున్నాడని భావము.

ఇట్లు వేదమును శాస్త్రములు పురాణములు బ్రాహ్మవివాహమే శ్రేష్ఠమనియు, నా సంస్కారముతో గల్గిన వనితయే, దైవనిబద్థమైన చుట్టమనియు, నీరీతిని సంస్కార పూతలైన దంపతులకు గల్గిన సంతానమే, ¸°రసనామమున చెప్పదగిన సంతానమనియు, నీరీతిని గల్గిన పుత్రుడే ఆత్మ సదృశుడనియు నున్నందున పెద్దలెల్లరు, సత్కుల ప్రవృద్ధికై, సత్సంతాన విధికై బ్రాహ్మవివాహమును నాచరించుచు వచ్చిరని సుస్పష్టమగుచున్నది.

ఈ యెన్మిది వివాహములపైకి బ్రాహ్మవివాహమున, కులము, గుణము, రూపము, విద్య, శీలములు ముఖ్యముగ గమనించెదరు. కానీ యీనాడు కులము మతము అనునవి యొక మూఢ విశ్యాసములనియు నివి యంతగా పాటింప నవసరము లేదనియు నొక ప్రవాదమున్నది ఇది కేవలము "కులమన" నేమో తెలియని వారనదగు మాటయేగాని యన్యముగాదు. కులము శీలము విద్యాగుణములు గుర్తింప నేరక వివాహము కేవలము సినీమాలలో చూపు రీతిని ప్రేమవివాహాలు చేసికొనినచో, నా ప్రేమికులు తాత్కాలికావేశమునకు లోనై, ప్రేమించుకొనిరేగాని యనంతరము వారనుభవించు యనుభవమును వర్ణనాతీతము. పాశ్చాత్య దేశీయులవలెను, మనదేశమున కొందరగు ఎరికల యానాది తెగలవారును, చేసికొను ప్రేమవివాహాలవలెనుండి, ఇష్టమున్న రోజులు భార్యాభర్తలు, కష్టమైన రోజులలో విడివడి మరొకరిని చేబట్టు సాంప్రదాయములకు లోను గావలసి వచ్చుచుండును గదా! ఈ సాంప్రదాయమే మంచిదనినచో వారికొక నమస్కారము. ఇంతకన్నా యెక్కువ వ్రాయడమెందులకు? శాస్త్రమునకు సాంప్రదాయమున కట్టుబడు వారి కెన్నైనా చెప్పవచ్చును. లాభముండునుగూడా! భిన్నులకు చెప్పడము వృధా కంఠశోష గాని వేరుగాదు గదా?

ప్రేమవివావాహాల కన్నను, తల్లిదండ్రులు, అనురూపుడైన వరుని నిర్ణయించి ధారాదత్తముగ వివాహమొనర్చు విథియే "ఏకక్రియాద్వ్యర్థకరీబభూవ" యను విధి ప్రకారము ఈ లోకమున కీర్తికరము పరలోకమున ముక్తి ప్రదమని పెద్దలవలన శాస్త్రధర్మముల ననుసరించియు గుర్తించిన వారు గనుక భారతీయులైన సనాతన ధర్మ పరాయణులెల్లరు సత్సాంప్రదాయముగ భావించిన వారై తమ పుత్రులకు పుత్రికలకు, కులానుక్రమముగ నీ ధర్మమును విధిగ ననుసరించుచున్నారు.

"అవిప్లుత బ్రహ్మచర్యః, లక్షణ్యాంస్త్రియముద్వహేత్‌"

అను ధర్మముననుసరించి విద్యాభ్యాసానంతరము మంచి లక్షణవతియైన కాంతను వివాహమాడడము ధర్మము.

"అనన్యపూర్వికాం కాంతాం అసపిండాం యవీయసీం

అరోగిణీం, భ్రాతృమతీం అసమానార్షగోత్రజాం||

అను ధర్మము ప్రకారము ఇతరులచే తొలుత వివాహమాడనట్టిది, కన్యకగా నుండునది రోగము లేనట్టిది సోదరున్నట్టిది తమ గోత్రముగాక ఇతర ఋషుల గోత్రమునకు సంబంధించిన కన్యను వివాహమాడవలయునని ధర్మము.

(1) తొలుత నొకడు వివాహమాడిన యువతిని నేడు ప్రేమ వివాహాలకింద జమకట్టుకొనదగునేమోగాని పూర్వీకులు యీ యువతిని మరలా ధారాదత్తముగ పెండ్లియాడనర్హముగాదని నిర్ణయించిరి.

(2) తన గోత్రమునకు చెందిన కాంత చెల్లెలుతో తుల్యము గాన చెల్లెలును పెండ్లియాడురితి నీ పెండ్లి కాగలదు గాన సగోత్ర వివాహము కూడదని నిర్ణయించిరి.

(3) రోగవంతురాలు దాంపత్య సుఖములకుగాని గార్హస్థ్య జీవనమునకుగాని నంతగా యోగ్యురాలుగ నుండదు గాన రోగముతో గూడిన కాంతను పెండ్లియాడ నర్హముగాదని నిషేధించిరి.

(4) సోదరులుగల కన్యనే వివాహమాడదగినదని నిర్ణయము సోదరులు లేని కాంతవల్ల ఏమేని ఆస్తి వచ్చిన రావచ్చునేమోగాని దాని వల్ల ఏనాటికైనా వంశక్షయముగాని సంపద క్షీణముగాని కాగలదుగాన సోదరివతినే వివాహమాడదగినదని భావము.

మన భారతీయులైన సనాతన ధర్మపరాయణులెల్లరు ఋషుల వంశమునకు జెందినవారమని శాస్త్రకారులు నిర్ణయించి నిరూపించి యున్నారు. ఈ రీతిని ఋషుల గోత్రమునకు జెందిన వారముగాన, "ఆర్ష గోత్రజులమని మనకు పేరు, ఇట్టి ఆర్ష గోత్రజులైనవారు ఒక గోత్రజుడు వేరొక గోత్రమునకు జెందిన కన్యను వివాహమాడవలయునని "అసమానార్ఘగోత్రజయైన కన్యను వివాహమాడవలయునేగాని సగోత్రజయైన కన్యను వివాహమాడరాదని నిర్ణయించిరి.

"కన్యాదానంతు సర్వేషాం, దానానాముత్తమం స్మృతం" అను రీతిని తమకులమునకు సాంప్రదాయమునకు జెందిన వరునకు యథాశక్తిని అలంకరించిన కన్యను దానము అనగా బ్రాహ్మవివాహ రూపమైనధారాదత్తముగ యధా శాస్త్రానుసారము వివాహము చేసినచో సమస్త దానములకన్నా నీ కన్యాదానముత్తమోత్తమమైనదిగా రాణించగలదు

"పైశాచశ్చారశ్చైవ నకర్తవ్యోకదాచన

చతుర్ణామపివర్ణానాం ఏషధర్మః సనాతనః"

అనురీతిని నాల్గు జాతుల వారికిని మునుపుజెప్పిన ఎన్మిది వివాహములలో నీపైశాచిక వివాహము ఆసుర వివాహము యోగ్యములుగావుగాన నీ రెంటిని అధర్మములుగ నెరుంగదగినదని భావము అనగా కన్య నితరులకు నిర్ణయించియుండగ హరించడము రాక్షసమందురు. కన్యా సంబంధములైన పెద్దలను మోసగించి బాదించి కన్యకకు ఇష్టములేకున్నను బలవంతముగా నెత్తుకొని వెళ్ళి పెండ్లియాడడము పైశాచికమందురు, ఈ రెండు వివాహములు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య శూద్రులగు నాల్గు వర్ణముల వారికి నిషేధించిరి, కనుకనే ధర్మబద్ధమైన బ్రహ్మ వివాహమునే నాల్గు వర్ణములవారు నాచరించుటకు కారణమైనది.

"ధర్మార్థ కామ మోక్షదాం దారాః సంప్రాప్తి హేతః

పరీక్ష్యన్తే ప్రయత్నేన పూర్వమేవ కరగ్రహాత్‌"

అను ధర్మాన్ని పురష్కరించుకొని ధర్మము అర్థము కామము మోక్షణము అను నాల్గు పురుషార్థములకు కారణభూతురాలుగ నేర్పడి వంశమునకు కీర్తిప్రతష్ఠతీను వంశాభివృద్థిని చేకూర్చదగు సమర్థురాలుగ మున్ముందు కాదగియున్నది, గాన కన్యను సర్వవిథములా పరిశీలించి, వివాహమునకు తగిన కన్యకయని నిర్ణయించుకొనిన యనంతరమే వివాహము నిశ్చయించుకోవలయును. ఈరీతిని కన్యను పరిశీలించిన యనంతరము "సువర్ణాం భార్యాం ఉదృహేత్‌" అను బుథధర్మశాస్త్ర వచనాను సారము సమానమైన తెగలో అనగా తన కులములో జన్మీంచిన కన్యనే వివాహమాడవలయునని నిర్ణయము.

ఈ రీతిని వరుని గూడపరీక్షించిగాని కన్యనివ్వరాదందురు. కనుకనే "కులంచ శీలంచ వ పుర్వయచ్చ విద్వాంచ విత్తంచ సనాధ ఏతానుణా%్‌ సప్తపరీక్ష్య కన్యదేయా బుధైః శేషమ చిన్త నీయమ్‌||

అనురీతిని కులము, శీలము, శరీరపుష్టి వయస్సు, విద్య, ఆస్తి, అధికారము అను నేడింటిని పరిశీనించి.నీ సప్తగుణములు గల వానికే కన్యనివ్వదగినది.

[1] కు ల ము

కులమనగా నేడు సరియైన నిర్వచనము చేయలేక ఏదోరీతిని, జాతియని, వంశమని, పలురీతులుగా ననుచున్నారు, కాని శాస్త్రవేత్తలు నిర్ణయించి నరీతిని కులమనగా నిట్లుగలదు.

"ఆచారో వినయో విద్యాప్రతిష్టా తీర్థదర్శనం,

నిషావృత్తిః తపోదానం నవథాణులలక్షణమ్‌|

అనురీతిని, ఆచారము, వినయము, విద్య, గౌరవము, తీర్థయాత్రలు చేయడము, దైవకార్యములయందుగల పట్టుదల, మంచి జీవనము, తపస్సు, దానము, అను తొమ్మిది

గుణములు గల్గి యుండు రీతికి, 'కులమని' సంకేతముగ వచించిరి.

"విహితాచార విహీనేషుక్షిప్రంనశ్యతివైకులమ్‌|| అను రీతిని వారివారికి నిర్ణయించిన ఆచారముల ప్రకారము నడవనిచో, కులధర్మము వానిలో నసించుననిరి. కాన మంచి కులథర్మములు గల వరునికి కన్యనివ్వడము శ్రేయస్కరమని భావము.

[2] శీ ల ము

మంచినడవడికకే శీలమందురు. కనుక మంచి వంశ మెంతముఖ్యమో మంచి శీలమంత యవసరము. వంశము మంచిదైనను, వరుడు శీలవంతుడు కానిచో కన్యనివ్వదగదందురు.

ఈ రీతిని వరుని సహితము పరీక్షించి యోగ్యమైన వరుని నిర్ణయించి కన్య నివ్వదగినది.

కన్యనిచ్చుతరిని వథూవరు లుభయులు జాతకములను పరిశీలించి, యీ యిరువురికి దాంపత్యానుకూల్యములుండునది లేనిది పొంతనముల వలనను, ఆయురర్థాది భావములు భావ ఫలములవలనను, జీవిత సుఖసంతోషాదులు దశాఫలముల వలననూ సుదీర్ఘముగ పరిశీలించి కన్యనివ్వడము శ్రేయస్కరము, వీని నెల్ల మంచి జ్యోతిషశాస్త్రవేత్తకడ నెరుంగుట యుత్తమము. కొంతవరకు వధూవరుల జాతక పరిశీలనములను సంక్షేపముగ పొందుపరతును. వివరణములవసరమగునేని పెద్దలకడ నెరుంగుట యుత్తమము.

(1) "ఏకరాశ్యాది యోగేతు నాడీదోషోనవిద్యతే" అనురీతిని వధూవరుల లగ్నములు ఏకరాశి యైనచో నా తరిని నాడీ దోషము లేదందురు.

(2) ఏకరాశేచ దంపత్యోః శుభంశ్యాత్‌ సమసప్తకే

చతుర్థే దశ##మేచైవ తృతీయైకాదశేతధా||

వథూవరుల లగ్నములు ఏకరాశి యైనచో చాలా శ్రేష్ఠము. ఆరీతినే సమసస్తకరాశులైననూ మూడు పదునొకండు, రాశులైననూ శ్రేష్ఠతరమందురు.

(3) "యాదిశ్యాత్‌ రాక్షసీభర్తా కన్యకామానుషీభ##వేత్‌

వివాహే సుఖమాస్నోతివైపరీత్యం వివర్జయేత్‌

అను ధర్మముప్రకారము వరుని జన్మనక్షత్రము రాక్షసగణమైయుండి కన్య జన్మనక్షత్రము మన్యు గణమైనచో సుఖ సంపదలు గల్గును. కన్య నక్షత్రము రాక్షసగణమై వరుని నక్షత్రము మనుష్యగణమైన విరుద్ధ ఫలితములు గల్గును. కనుకనే "స్త్రీ రాక్షసంనకర్తవ్యం" అనియందురు.

"అవ్యంగాంగీం సౌమ్యనామ్నీం హంసవారణగామినీం

తనులోమ కేశదశనాం మృదంగీం ఉద్వహేత్‌ స్త్రియమ్‌,

అనురీతిని వివాహయోగ్యమైన కన్య సమానమైన అవయవములు గలదియై యుండవలయును. మంచిపేరు, హంసనడకగాని, ఏనుగు నడకగాని యుండదగినది మంచి పలువరుసగలది మృదువైన శరీరముగలదియైన వనితను వివాహమాడదగినది.

"హంసస్వనాం, మేఘవర్ణాం, మధుపింగళలోచనాం

తాదృశీం వరయేత్‌ కన్యాం గృహస్థఃసుఖమేధతే.

హంసధ్వనిగలది మేఘవర్ణముగలది, మధువు (తేనె) గాని పింగలవర్ణము గాని గల కండ్లుగల కన్యను వివాహమాడినచో సుఖవృద్ధిగల్గును.

నోద్వహేత్‌ కపిలాంకన్యాం నాధికాంగీం, నరోగిణీం

నాలోమకాం నాతిలోమ్నాం. నవాచాటాం, నపింగళాం.

అనునట్లు కపిలవర్ణముగలది అధికమైన అవయవములుగలది. రోగవంతురాలు వెండ్రుకలులేనిది ఎక్కువ వెండ్రుకలుగలది. అధికముగ మాటలాడునట్టి కన్యను పెండ్లియాడదగదు.

శ్యామాసుకేశీతనులోమరాజీ సుభ్రూః సుశీలానుగతిః సుదన్తా

వేదీవిమద్యాయది పరంకజాక్షీ కులేనహీనాపివివాహనీయా.

శరీర లావణ్యకాంతులుగల కన్యక మంచి శిరోజములుగలది మంచి కనుబొమల వరుసగలది, మంచి శీలముగలది మంచి గుణవతి, మంచి పలువరుసగలది, సన్నని నడుముగలది, పద్మ నేత్రములుగల కన్యను తక్కువ కులముననున్ననూ పెండ్లియాడ దగునందురు.

"తస్మాత్‌ కులనక్షత్రవిజ్ఞానోపన్నాం వరయేత్‌" అని పెద్దలనురీతిని కన్య మంచి కులవతి, మంచి నక్షత్రమున జన్మించినదిగా గుర్తించి వివాహమాడ దగునందురు. ఎందుకనగా, ఆశ్లేష నక్షత్రములన జన్మించిన కన్యక అత్తను హరించును. మూలా నక్షత్రమున పుట్టిన వనిత మామను హరించును. జ్యేష్ఠానక్షత్రమున జనించిన పడచు బావకు దోషము గల్గించును. విశాఖా నక్షత్రమున పుట్టిన కన్య మరుదులకు చెడుపు చేకూర్చును గాన నక్షత్ర విచారము తప్బక చేయదగినదని పెద్దల వచనము. శాస్త్రనిర్ణయముగలదు. ఈ రీతిని వథూవరుల జాతకములను పరిశీలించి నయనంతరము వివాహ నిశ్చయము చేయదగినది.

"మాఘ పాల్గుణ వైశాఖ జ్యేష్ఠ మాసాః శుభప్రదాః

అనునట్లు వివాహమునకు 1 మాఘమాసము, 2 పాల్గుణమాసము, 3 వైశాఖమాసము, 4 జ్యేష్ఠమాసము శుభములిచ్చిను.

"మధ్యమం కార్తికే మార్గశీర్షే వైనిందితాఃపరే"

కార్తీకమార్గ శీర్షమాసములు మథ్యమ ఫలములు. మిగతా, 1, చైత్ర, 2, ఆషాఢ, 3, శ్రావణ 4, భాద్రపద 5. ఆశ్వయుజ, 6. పుష్యమాసములు అథమములు, మరియు ఆషాఢమాసము, పుష్యమాసము భాద్రపదమాసము మరి నింద్యములని పెద్దలంతగా వీనిని నంగీకరించరు.

మూల మైత్ర మృగ రోహిణీకరైః|

పౌష్ణమారుత మఖోత్తరాన్వితైః|

వీర్య వద్భిః ఉడుభిః మృగీదృశాం|

పాణి పీడన విధిః విధీయతే||

1 మూల 2 అనూరాధ 3 మృగశిర 4 రోహిణి 5 హస్త 6 రేవతి 7 స్వాతి 8 మఖ 9 ఉత్తర 10 ఉత్తరాషాఢ 11 ఉత్తరాభాద్ర అను నీ పదునొకండు నక్షత్రములు వివాహమును శుభప్రదము.

వివాహమైనది మొదలు పదునారు దినములలోపుగ సమదినములలో కన్యను గృహప్రవేశమునకు పిలుచుకొని వెళ్ళదగును. ఈ పదునారు దినములలో తిథి వార నక్షత్రములు గుర్తింపపనిలేదని శాస్త్రప్రమాణము.

"వివాహమారభ్యవథూ ప్రవేశోయుగ్నేతిధౌ షోడశవాసరాన్తే

పంచాంగ శుద్ధించ దినంవినాపితిధౌ నసద్గోచర గేపికార్యః.

అను ప్రమాణమున్నదిగాన తిథి వార నక్షత్రముల నెంచకనే పదునారు గినములలోపుగ వథూ గృహ ప్రవేశము చేయదగినది.

శుభేక్షితయుతాశ్శస్తాః ఉద్వాహేఖిలరాశయః

శుభషడ్వర్గ కేలగ్నేమహాదోషవిపర్టితే.

అనురీతిని శుభగ్రములుగల లగ్నము శుభగ్రములు చూచులగ్నము వివాహమునకు యోగ్యముగాన నీవివాహలగ్నము తెలిసిన పెద్దలచే నిర్ణయించి వివాహము చేయ తగినది.

శుక్రఃపంచసహాస్రాగి బుధః పంచశతానిచ

లక్షమేశంతుదోషాణాం గురుః కేంద్రేవ్యపోహతి,

అను ధర్మము ప్రకారము వివాహలగ్నమునగాని, వివాహ లగ్నమునకు నాల్గు పదిరాశులయందుగాని, గురువుగాని శుక్రుడుగాని, బుధుడుగాని, యున్నచో సమస్తదోషములు హరించును. గాన గురు, శుక్ర, బుధులు వివాహలగ్న కేంద్రములలో నుండులాగున వివాహలగ్నము నిర్ణయించవలయును.

బుధ గురు శుక్ర వారములుత్తములు ఆదివారము మధ్యమము. సోమ శని మంగళవారములు నింద్యములు (ఆచార్య కావ్యసౌమ్యానాం, వారాఃశస్తాఃశుభోదయే| అని యిందులకు ప్రమాణముగాన, బుధ గురు శుక్రవారములుత్తమములు.

"సహస్రగుణయుక్తోపిమందవారేకుజేతధా

శుభకర్మనకుర్వీత కుర్యాచ్చేత్‌ మరణం ధ్రువం.

అను థర్మము ప్రకారము వివాహాది శుభకార్యములు. మంగళవారమునాడు గాని శనివారమునాడుగాని చేయదగదు. అట్లు చేసినచో తప్పక మరణము గల్గునని శాస్త్రప్రమాణమున్నది గాన శని మంగళవారములు శుభకార్యములు చేయరాదని పెద్దలు నిషేధించిరి.

ఈ రీతిని వివాహమునకు మాసములు, తిధులు వారములు నక్షత్రములు, లగ్నములు, ఉత్తమ, మధ్యమ అధమములుగ నిర్ణయించి యున్నారు గాన తెలిసిన పెద్దలచే వివాహముహూర్తము నిశ్చయించవలయును. ఎందుకనగా

జన్మోదయే, జన్మరాశౌ జన్మరేక్ష జన్మవాసరే

జన్మమాసేచదంపత్యోః వివాహోత్యన్త దుఃఖదః

అనురీతిని జన్మలగ్నమునగాని, జన్మనక్షత్రమునగాని జన్మించిన వారమున గాని జన్మించిన నెలలోగాని వివాహము గావించినచో నాదంపతులకు సౌఖ్యము తక్కువయగునుగాన వీనిని గుర్తించి ముహూర్త నిర్ణయము చేయుట శ్రేయస్కరము.

మఱియు

వివాహశ్చైక జన్యానాం షణ్మాసాభ్యంతరే యది

అసంశయంత్రిభిర్వర్షైః తత్రైకావిధనాభ##వేత్‌.

అను ధర్మము ప్రకారము. ఒక తల్లి బిడ్డలకు (పురుషులుగాని, స్త్రిలుగాని లేక స్త్రి పురుషులుగాని) వివాహము ఒకరికి మాత్రమే చేయదగును, ఒకరికి చేసిన పిదప యారు మాసములకు వేరొకరికి చేయుట థర్మము. అట్లుగాక ఇరువురికి వివాహము ఒకేదినమునగాని ఒకరికైనపిదప యాఱునెలలో మరొకరికి వివాహము చేసిననూ ఎవరోయొకరు నశింతురని భావము.

కదాచిత్‌ ఏకజన్యానాంనవివాహమృతుత్రయే

యత్రవర్షేణతత్రైకా విధవైవనసంశయః

ఒక తల్లి బిడ్డలకు మూడు ఋతువులు దాటనిదే (ఆరు నెలలు) వివాహము చేసినచో వాయిద్దరిలో నొకరు వైథవ్యమును బొందుదురని పైభావాన్ని యీ ధర్మము బలపరచుచున్నది. కానీ కూతురు వివాహము తొలుత జేసి యనంతరము కుమారుని వివాహము మాత్రము నారు మాసములు కాకపోయిననూ వెనువెంటనే యైననూ చేయవచ్చునని నీ ప్రమాణము బలపరచుచున్నది.

"పుత్రీవివాహాత్‌ పరతః తదైవశుభప్రదం పుత్రవివాహకర్మ"

కూతురు వివాహము చేసినపిదప వెంటనే కుమారుని వివాహ కార్యము చేయడము మంగళప్రదము కాగలదు.

1. సూర్యసంక్రాంతి యున్న దినముల వివాహ నిర్ణయము చేయరాదు.

2. తిధి వార నక్షత్రములు, యోగ కరణములు వివాహ యోగ్యముగ లేని దినము పంచాంగశుద్ధిలేని దినమందురు ఇట్టి పంచాంగశుద్ది లేని దినమున వివాహము చేయరాదు.

3. కర్తరీదోషము, అనగా లగ్నమునకు కర్తరీదోషమున్న వివాహము యోగ్యముగాదు.

4. వివాహ లగ్నములకు చంద్రుడు ఆరు ఎనిమిది రాశులలో నున్నచో వివాహ యోగ్యముగాదు.

5. ఉదయాస్తమయశుద్ధి. అనగా సూర్యోదయ సూర్యాస్తమయ లగ్నశుద్ధులు లేని తరిని వివాహము చేయదగదు.

6. వార జనిత దుర్ముహూర్తములని గలవు. ఇట్టి దుర్ముహూర్తములలో వివాహము చేయతగదు.

7. గండాంత దోషములు అనగా పూర్ణ తిది నంద తిధుల సంధికాలములు, నాల్గుఘడియల పర్యంతము గండాంత దోషమందురు. ఈగండాంత దోషములు మృత్యుప్రదము గాని వివాహ యోగ్యముగాదు.

8. భృగుషట్క దోషము - శుక్రుడు వివాహలగ్నమునకు నాఱవయింటనుండరాదు. "శుభసంయుక్తం తల్లగ్నం సర్వదాత్యజేత్‌" అనధర్మము గాన, ఎంత శుభలగ్నమైననూ, శుక్రుడు ఆరవయింటయున్న విడువదగినది.

9. "కుజాష్టమో మహాదోషః" అను విధి ననుసరించి, వివాహ లగ్నమునకు కుజుడు. ఎనిమిదింట నుండరాదు. ఉన్నచో మహాదోషములనిచ్చును.

10. ఉభయోః అష్టమంలగ్నం. వివాహ శుభకర్మణి దంపత్యోః మరణప్రదః" అని విధి గనుక, వథూ వరులకు, వారి వారి జన్మలగ్నమునకు, ఎనిమిదవ లగ్నము ఎంత శుభప్రదముగ నున్ననూ, కూడదు. ఎందుకనగా వారి వారి జన్మలగ్నానికెనిమిదవ లగ్నము ఆయుః స్థానమందురు. ఈ యష్టమలగ్నమున వివాహనిర్ణయము చేసినచో వథూవరులకు మరణప్రదమగును.

11. విషనాడి-యని లగ్నమునకు, మునుపు రెండుఘడియలు అనంతరము రెండుఘడియలు "విషనాడీ" యందురు. ఈ విషనాడీ ఘడియలలో వివాహము చేయతగదు.

12. గ్రహణ దినమునగాని, వింతలు ఉత్పాతములు గల్గు కాలమున గాని వివాహము చేయతగదు.

13. పాపగ్రముచే వేధింపబడిన నక్షత్రముగల దినమున వివాహ చేయదగదు.

A. క్రూర నక్షత్రము వదలిన నక్షత్రమునకు దగ్ధ నక్షత్రమనియు

B. క్రూర గ్రహముతో గూడిన నక్షత్రమునకు జ్వలిత నక్షత్ర మనియు

C. క్రూర గ్రహాధిష్టత నక్షత్రమునకు ధూమిత నక్షత్రమనియు, పేర్లు గలవు. "సమస్త కార్యెషు వర్జయేత్‌ ధీమాన్‌" అను థర్మము ప్రకారము బుద్ధిమంతులైన వారు వీనిని గుర్తించి, ఈ నక్షత్రములు గల దినమున వాహములు చేయరాదందురు.

ఈ రీతిని గుణ దోషములు గుర్తించి "గుణాధికః స్వల్ప దోషం సకలం మంగళప్రదం" అను ధర్మము ప్రకారము, ఎక్కువ గుణములు గల్గినది, తక్కువ దోషములు గల్గినదిగా గమనించి వివాహ నిర్ణయ కాలము చేయదగినది.

ఈరీతిని వివాహ విషయమున తిధి వార నక్షత్రలగ్న యోగాదులు బుద్ధిమంతులు పరిశీలించి తారాబలము గమనించి వివాహ నిర్ణయము చేయదగును.

తారాబలమనగా

జన్మ నక్షత్ర మారభ్య నిత్యభాంతంచ గణ్యతే

నవ సంఖ్యాహృతం భాగం నవతారాః ప్రకీర్తితాః

అను రీతిని, వధూవరుల జన్మనక్షత్రము మొదలు, ఏ దిన నక్షత్రము కోరుదుమో నా నక్షత్రము వరకు నెంచి తొమ్మిదింటిచే భాగించి శేషించిన సంఖ్యను తారగ గ్రహింపదగినది.

జన్మసంపత్‌ విపత్‌ క్షేమప్రత్యక్‌ సాధన నైధనం

మిత్రం పరమమైత్రంచ నవతారాః ప్రకీర్తితాః.

అనురీతిని శేషము ఒకటి మిగిలిన జన్మతారయందురు. శేషము రెండు మిగిలిన సంపత్తార మూడు శేషములు మిగిలిన విపత్తార నాల్గు శేషమున్న క్షేమతార. అయిదు శేషమున్న ప్రత్యక్తార, ఆరు శేషమున్న సాథన తార, ఏడు శేషమున్న నైధనతార, ఎనిమిది శేషమున్న మిత్రతార, తొమ్మిది శేషమున్న పరమమైత్రతారయని చెప్పుదురు.

ఒకటవతార; జన్మతార దేహమునకు దోషమిచ్చును.

రెండవతార; సంపత్తార - సంపదనిచ్చును.

మూడవతార; విపత్తార - విపత్తులనిచ్చును.

నాలుగవతార; క్షేమతార - సౌఖ్యములనిచ్చును.

అయిదవతార; ప్రత్యక్తార - కార్యహానినిచ్చును.

ఆరవతార; సాధనతార - కార్యసాథనాశక్తిని నిచ్చును.

ఏడవతార; నైధనతార - మరణాది బాధలనిచ్చును.

ఎనిమిదవతార; మిత్రతార - సుఖ సౌఖ్యములిచ్చును.

తొమ్మిదవతార; పరమమైత్రిత్తార - సంతోషాదుల నొసంగును.

కాన తారాబలమును ప్రథానముగ నెరింగి వథూవరులకు యోగ్యమైన తారాబలమున్న దినమున వివాహము చేసినచో నా తారాబలమునకు చెప్పిన ఫలితములు వారికి చేకూరగలవు.

చంద్రబలమును చూడవలయును, అనగా వారి వారి జాతకరీతిని చంద్రుడు లగ్నమున మూడవయింట, ఆరవయింట, యేడవయింటపదునొకండవయింట చంద్రుడున్న దినమున సంపూర్ణ చంద్రబలమున్న దినముగాన, పై రీతిని తారాబలము చంద్రబలము చూచి పై చెప్పిన దోషములులేని లగ్నమును గుర్తించి వివాహము చేయదగినది. ఈ రీతిని వివాహము చేసినచో సర్వసంపదలు చేకూరగలవు.

వివాహము చాలా ప్రశస్తమైన కార్యము, వథూవరుల జీవన సౌఖ్యములకు వంశవృద్ధికి ప్రథానముగాన నిర్విఘ్నతా సిద్ధికొరకై గణపతి పూజతో ప్రారంభింతురు.

"మంగళస్నానంకృత్వా పాణిగ్రహణాఖ్యం కర్మకరిష్యమాణః

తదంగత్వేన తదాదౌ శుధ్యర్థం వృధ్యర్థం, శాంత్యర్ధం

అభ్యుదయార్ధంచ మహాజనైః సహపుణ్యాహవాచనం కరిష్యే

ఆదౌనిర్విఘ్నతాసిధ్యర్ధం, మహాగణపతి పూజాంచ కరిష్యే".

అని వధూవరులకు మంగళ స్నానములు చేయించి వివాహారార్థమై కూర్చొనబెట్టి పరిశుద్దికొరకు అభివృద్ధికొరకు, శాంతికొరకు పుణ్యాహవాచనము తొలుత నాచరింపజేయదలంచి నిర్విఘ్నతా సిద్ధర్ధమై మహా గణపతిపూజ తొలుత నాచరింప జేయదగినది.

అనంతరము "బ్రాహ్మణుల యిండ్లలో నగు నెడల "మదర్థం కన్యాం వృణీథ్వమితి" యని కన్యా వరణార్థమై. అనగా కన్యనుచూచి నిశ్చయించుట కొరకై, కన్యా వరణము జేతురు.

''నప్త్రే - పౌత్రాయ - పుత్రాయ శర్మణవరాయ, కన్యాం ధర్మ ప్రజా సంపద్యర్ధం వృణీమహే" యని, ఫలావారి ముని మనవుడు, ఫలావారి మనమడు, ఫలావారి పుత్రుడు. ఫలానా పేరుగల నీ వరుని కొరకై ధర్మము, సంతాన వృద్ధి నిమిత్తమై, ఈ కన్యను, వరింప జేయుచున్నాము, అని నిర్ణయింతురు.

ఈ రీతినే "వప్త్రీం - పౌత్రీం - పుత్రీం - నామ్యాం - కన్యాం - ధర్మప్రజా సంపత్యర్ధం వృణీమహే"యని. ఫలానావారి, మునిమనుమరాలు ఫలానావారి మనుమరాలు ఫలానావారి, పుత్రిక - ఫలానా పేరు గల నీ కన్యకను, ఈ వరునికి, ధర్మము - వ్రజ (సంతానము) సంపదలు యభివృద్ధి జెందుట కొరకై నీకన్యకను వరింపజేయు చున్నాము.

అని, కన్యావరణము జరుపుదురు, అనంతరము వరునిచేత "థర్మప్రజా సంపత్యర్థం స్త్రియముద్వహే" యని చెప్పింతురు. అనగా, నీ కన్యను, ధర్మము - సంపద, సంతానాభివృద్ధుల కొరకై వివాహము చేసికొన గల్గుచున్నానని వచింప జేతరు.

అనంతరము "కన్యాదాత"వరమలంకృత్య" వరుని యధాశక్తి విభవములతో నలంకరింప జేయవలయునను విధి ననుసరించి, ప్రకృత కాలమున వర కట్నములు వగైరాలు తారాపధము నందుకొను చున్నవి. శాస్త్రమున వర దక్షిణలు, సూటు బూటు రిష్టు వాచీలు యివ్వమనిలేదు. ఒకరిని చూచుకొని వేరొకరి రీతిని, గొఱ్ఱదాటుగ వరకట్నాలాసించడము పరిపాటియయినది. ఇది అశాస్త్రీయమే.

కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే" యని మహా సంకల్ప పఠనము చేయుదురు.

వేద సంబంధమైన ప్రతి కార్యమునకు సంకల్పం చెప్పుట ముఖ్యము, సామాన్యముగ చెప్పు సంకల్పం సామాన్య సంకల్పం, వివాహమునను భూదాన గోదాన, గృహ దానాదులలో మహాసంకల్పం జెప్పుదురు.

ఈ మహాసంకల్పము ప్రతియొక్కరు వినదగినది. ఆచరింపదగినది. ఇందు భారతీయులయొక్క సమైక్య భారతీయుత సువ్యక్తమగును. నా దేశము, నాభాషా నాయూరు నావారు, నాయిల్లు అను సంకుచిత భావము సంకుచిత విధానము సంకుచిత ధోరణులు తొలుగును. విశాల దృక్పధము విశాల భావ పరంపరలు గల్గునిమిత్తమై, కల్పసూత్రకారులైన, ఆపస్తంబ మహర్షి, ఆశ్వలాయన మహర్షి బోథాయన మహర్షి వంటి మహవీయులు భారతీయులు అందులో సనాతన ధర్మపరాయణుల యొక్క విశాల భావసమైక్యతను చేకూర్చు నిమిత్తమై నీ మహా సంకల్పమును నేర్పరచిరి. మహాకార్యములు చేయు తరిని నీ మహాసంకల్పము విధిగ చెప్పుదురు. ఇందలి భావములు సమైక్యత భారతీయతకు ప్రాతిపదికులు, కాన సర్వులు తప్పక వినదగినవి గనుక నా మహసంకల్పమును, సంపూర్ణముగ నర్ధముతో నెరుంగుట ముఖ్యము గాన వ్రాయుచున్నాను, పరీశీలింతురుగాక.

దేవలక మహర్షి నీ మహాసంకల్ప మీకార్యములలో తప్పక చెప్పదగినదని నిట్లు నిర్ణయించిరి.

"మహాదానేషు యజ్ఞాదౌ, ప్రాయశ్చిత్తేషు కర్మసు|

కన్యా దానే నదీస్నానే, మహసంకల్ప మాచరేత్‌"

అని మహాదానములు చేయు సమయమున యజ్ఞయాగాదులు చేయు కాలమున ప్రాయశ్చిత్త కార్యములు చేయుతఱిని కన్యాదాన కాలమున మహానదులలో స్నానము చేయునప్పుడు మహాసంకల్పము చెప్పదగినదని దేవలకుల మతము.

మరీచి మహర్షి "కన్యాదానే, నదీస్నానే, తులాదానాదిషు, ద్విజః ప్రాయశ్చిత్తేషుయజ్ఞాదౌ, వ్రతాదిషు విశేషతః ఏతదాదిషు, సర్యత్రమహాసంకల్పమాదరాత్‌| కృత్వాయత్కురుతేకర్మ తదానంత్యాయకల్పతే||

అను ప్రమాణము ప్రకారము మరీచిమహర్షి మహా సంకల్పము కన్యాదాన సమయమున, మహానదీస్నానకాలమున తులాదానాది మహాదానములిచ్చు కాలమున యజ్ఞ యాగ వ్రతకాలములయందు ప్రాయశ్చిత్తాది కార్యములాచరించు సమయమున నీ మహాసంకల్పము చెప్పినచో నా కార్యము అనంతఫలితము నొసంగగలదని వచించిరి కాన తప్పక కన్యాదాన కాలమున మహాసంకల్పము కల్ప సూత్రకారులు విథిగ చెప్పమని నిర్ణయించిరి:

అర్ధముతో గూడ నీ మహా సంకల్పమును వివరింతును తప్పక పరిశీలింతురుగాక.

(1) "అస్వశ్రీ భగవతో మహాపురుషస్య, అనివార్య వీర్యస్య

అఖిలలోక పరిపాలన పరాయణస్య' ఆదినారాయణస్య,

భగవంతుడు మహాపురుఫుడు సమస్తలోక పాలకుడు అయిన శ్రీమన్నారాయణునియొక్క

(2) "నిత్యనిరుపమ నిరవధిక అప్రమేయమహిమ మహిత,

మాయాశక్త్యాభ్రియమాణ మహాజతౌ ఘమధ్యె పరిభ్రమతాం

నిత్యము నిరుపము నిరవధికము అప్రమేయహిమముతో గూడిన మాయాశక్తితో తిరుగుచున్న మహాసముద్రమువంటి నీటిమధ్యమమున తిరుగాడుచున్నట్టి

(3) "క్రమాద్దశగుణోత్తరైః అప్తెజోవాయ్వాకాశాహంకార మహదవ్యక్తాత్మక సప్తావరణౖః పరివేష్ఠితానాం,

ఒక దానికన్ననూ యొక్కొక్కటి పదిరెట్లధికముతో గూడిన నీరు తేజస్సు వాయువు ఆకాశము అహంకారము మహత్‌ అవ్యక్తముల నేడావరణములతో చుట్టబడియున్నట్టి

(4) "అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమేస్మిన్‌ మహతి బ్రహ్మండమండలే.

అనేకములైన కోటి సంఖ్యాత్మకములైన బ్రహ్మండములపైకి ఒకటియై యున్న ఈ గొప్ప బ్రహ్మండమండలమునందు

(5) ఆదిశక్తి కూర్మ వరహానంతో పరిభాగప్రతిష్ఠితానాం ఆదిశక్తి ఆదికూర్మము, ఆదివరాహము అనంతనామకవాసుకియొక్క పై భాగమున ప్రతిష్ఠింపబడి యున్నట్టియు

(6) అతల - వితల - సుతల - తలాతల - రసాతల - మహాతల - పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్థ్వభాగే

అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహతలము పాతాళము అను సప్తలోకములకు పై భాగమునయున్నట్టి

(7) భువర్లోక - సువర్లోక - మహర్లోక -జనోలోక - తపోలోక - సత్యలోకాఖ్యషడ్లోకానాం, అధోభాగే

భువర్లోక - సువర్లోక - మహాలోక - జనోలోక - తపోలోక సత్యలోకములను, నారులోకములకు క్రింది భాగముననున్నట్టియు

(8) ఐరావత - పుండరీక - వామన - కుముద - అంజన - పుష్పదన్త సార్వభౌమ - సుప్రతీకాఖ్యాష్ట దిగ్వేదండ. శుండాదండోత్తంభితే

ఐరావతము - పుండరీకము - వామనము - కుముదము - అంజనము - పుష్పదంతము - సార్వభౌమము - సుప్రతీకము అను ఎనిమిది మహాగజముల తొండములతో యెత్తిపట్టబడుచుండునట్టిది

(9) అయోధ్యా - మధురా - మాయా - కాశీ - కాంచీ - అవన్తీ ద్వారవతీ - అశోకవతీ - భోగవతీ - సిద్ధవతీ - అమరావతీ - తేజోవతీ - సంయమనీ - రక్షోవతీ - సింధుమతీ - గంధవతీ - అలకావతీ - యశోవతీ - ప్రభృత్యనేక పుణ్యపురి విరాజితే.

అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవన్తీ, ద్వారవతీ, అశోకవతీ, భోగవతి, సిద్ధవతి, అమరావతి, తేజోవతి, సంయమిని రక్షోవతి, సింధుమతి, గంథ వతి, అలకావతి. యశౌవతి మొదలైన మహాపట్టణములతో ప్రకాశించునట్టియు

(10) ఇంద్రాగ్ని, యమ, నిరృతి, వరుణ, వాయు, కుబే, రేశానాఖ్యాష్ట దిక్పాలపాలితే.

ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృఋతి, వరుణుడు, వాయుము కుబేరుడు, ఈశానుడు అను అష్టదిక్పాలురచేత పాలింపబడునట్టియు

(11) అనలానిల ప్రత్యూషప్రభాస సోమాధ్వర ధ్రవాపాఖ్యాష్టవసు విరాజితే.

అనలుడు, అనిలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, సోముడు, అధ్వరుడు, ద్రుపుడు, అపాఖ్యుడు, అను నెన్మిదిమంది వసువులతో ప్రకాశించునట్టిది.

(12) సూర్య చంద్రాంగారక బుధ బృహస్పతి, శుక్ర శ##నైశ్చరరాహుకేత్వాఖ్యనవగ్రహ పరిపాలితే.

సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు శ##నైశ్చరుడు, రాహువు, కేతువు అను నవగ్రహములచేతను పరిపాలింపబడునట్టియు

(13) ఆవవ, నివహ, సంవహానువహవ్రవహోద్వహ పరివహోఖ్య సప్తమ రుత్సంచార సంజీవిత జీవనికురమ్చే,

అవహుడు, నివహుడు, సంవడు, అనువహుడు. ప్రవహుడు, ఉద్వహుడు, పరివహుడు అను పేర్లుగల సప్త వాయువుల వలన, జీవింపబడునట్టి జీవరాసుల సమూహములు గల్గినట్టియు.

(14) వింథ్యారణ్య, దంకారణ్య, చంపకారణ్య, శ్వెతారణ్య, నైమిశారణ్య, ద్వైతారణ్య, గుహారణ్య, దేవదారువన, ఇక్షువన, కదళికా వనాఖ్య దశారణ్య పరిమండితే.

వింధ్యారణ్యము, దండకారణ్యము, చంపకారణ్యము, శ్వేతారణ్యము నైమిశారణ్యము, ద్వైతారణ్యము, గుహారణ్యము, దేవదారువనము, ఇక్షువనము, కదళికావనము, అను పది యరణ్యములతో ప్రకాశించునట్టిదియు.

(15) శివ, శంభు, పినాకి, గిరీశ, హర, స్థాణు, భర్గ, భైరవ, సదాశివ, కపానలీశ్వరా, ఖ్యైకాదశ రుద్రవిద్యోతితే.

శివుడు, శంభుడు, పినాకుడు, గిరీశుడు, హరుడు, స్థాణుడు, భర్గుడు, భైరవుడు, సదాశివుడు, కపాలుడు, ఈశ్వరుడు, అను పదునొకండు రుద్రులతో నొప్పచుండ నట్టిదియు.

(16) మిత్రార్య మత్వష్టధాతృ వివస్వదరుణ భంగాంశు మదింద్రవర్జన్య విష్ణు పూషాఖ్య ద్వాదశాదిత్య ప్రకాశితే.

మిత్రుడు, ఆర్యముడు, తృష్ట, ధాతృడు, వివస్యత్‌, అరుణుడు, భంగుడు, అంశుమంతుడు, పర్జన్యుడు, విష్ణువు, పూషుడు, ఇంద్రుడు అను పండ్రెండు పేర్లతో నొప్పుచుండు, ద్వాదశాదిత్యులతో ప్రకాశించునట్టిదియు.

(17) ఖిండివాల దండ భ్రుశుండి, నళిక ముసల చక్ర లవిత్ర కాళరాత్రి ద్రుషణ బాణస్తూణ శక్తి తోమర పరిఘ పట్టస, మౌష్టికకుంత దశ కంటక ప్రాసపాశ ముదర్గ శతఘ్నీ సీరగదా గోశీర్షమయూఖీ యాపన పినాకాసిథేను కాస్త రేళా హస్తాముక్త వజ్రాఖ్యద్వాత్రిం శత్‌ ఆయుధమండల మండిత, దోర్దండ,

భిండి, వాలము, దండము, భ్రుశుండి, నళికము, ముసలము, చక్రము, లవిత్రము, కాళరాత్రి, ద్రుషుణము, బాణము, స్థూణము, శక్తి, తోమరము, పరిఘము, ఘట్డసము, మౌష్టికము, కుంతము, దశకంటకము, ప్రాసము, పాశము, ముద్గరము, శతఘ్నీ, సీరము, గద, గోశీర్షము, మయూఖము, యాపనము, పినాకము, అసి, ధేనుకము, అస్తరము, ఇళా, హస్తా, ముక్తము, వజ్రము, అను ముప్పదిరెండు, పేర్లుగల యాయుథములతో ప్రకాశించు, భుజబలముతో నొప్పుచుండునట్టి.

"శ్రీరామ, జామదగ్న్య దిలీపాంగ గయాంబరీష శశబిందు శిబిమాంధాతృమరుత్త భరత యయాతి పృధు భగీరధ రంతిదేవ, సుహోత్రాఖ్య షోడశ భూపాల పాలితౌ,

శ్రీరాముడు, జామదగ్న్యుడు, దిలీపుడు, అంగుడు, గయుడు, అంబరీషుడు, శశబిందువు, శిబి. మాంధ్యాతృడు. మరుత్తుడు, భరతుడు, యయాతి. పృధుచక్రవర్తి, భగీరధుడు, రంతిదేవుడు, సుహోతృడు. అను పదునారుగురు మహారాజులచే పాలింపబడి. నట్టియు.

(18) విశాలాక్షి, మీనాక్షీ, కామాక్షీ, సింహికా, శంకరీ, కుబ్జికా, మహాలక్ష్మీ, మహాదేవీ, మహాకాళీ, పార్వతీ, సుప్రభా భ్రమరాంబికా, వింథ్యవాసినీ, యోగినీ, హిమరూపిణీ, మాణిక్యదేవీ, కాద్రవేయీ, పూర్ణకాఖ్యాష్టా దశపీఠదేవీ సమలంకృతౌ.

విశాలాక్షి, మీనాక్షి, కామాక్షి, సింహిక, శంకరి, కుబ్జిక, మహాలక్ష్మిదేవి, మహాకాళి, పార్వతి, సుప్రభ, భ్రమరాంబిక, వింధ్యవాసిని, యోగిని, హిమరూపిణీ, మాణిక్యదేవి, కాద్రవేయి పూర్ణిక" అను పేర్లతో నొప్పుచున్న పదునెన్మిది మహా పీఠములందలి దేవీ సమలంకృతమైనట్టియు,

(19) యమనియమాసన ప్రాణాయామ, ప్రత్యాహార, థ్యానధారణ, సమాథ్యష్టాంగ యోగనిష్ఠాగరిష్ఠ, వశిష్ఠ, వాలఖిల్య విశ్వామిత్ర వాల్మీకి, జమదగ్ని, చ్యవన, దుర్వాస, కపిల, మౌధ్గల్య, కౌండిన్య కస్యప, గార్గ్య గౌతమ, ఆంగీరస, దక్షపరాశర, జైమని, పతంజలి కణ్వ, బోథాయన, ఆశ్వలాయన, కాత్యాయన, గ్రాహ్యాయణ, వైశంపాయన, ఆపస్తంబజాబాలి, మార్కండేయ, మాండవ్య, భరద్వాజ, సనకసనందన, సనత్కుమార, సనత్సుజాత, అగస్త్య శౌనకాది, అనేకమునిరాజి విరాజితే,

యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము ధారణము సమాధి, అను పేర్లుగల ఎనిమిది యోగములతో గొప్పవారైయున్నట్టి, వశిష్ఠుడు, వాలఖీల్యుడు విశ్వామిత్రుడు, వాల్మీకి. జమదగ్ని, చ్యవనుడు, దుర్వాసుడు, కపిలుడు, మౌద్గల్యుడు, కౌండిన్యుడు. కస్యపుడు, గార్గ్యుడు, గౌతముడు, అంగిరసుడు, దక్షుడు, పరాశరుడు, జైమిని, పతంజలి, కణ్వుడు, బోధాయనుడు, ఆశ్వలాయనుడు, కాత్యాయనుడు, ద్రాహ్యాయణుడు, వైశంపాయనుడు, ఆపస్తంబుడు, జాబాలి, మార్కండేయుడు, మాండవ్యుడు, భరద్వాజుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, అగస్త్యుడు, శౌనకుడు, మొదలైన మునుల సమూహముతో ప్రకాశించునట్టియు,

(20) మలయ, మహేంద్ర, సహ్య, శుక్తిమ, దృక్షవద్వింథ్యపారియా త్రాఖ్య సప్తకులాచలవలయితే, ఋష్యమూక మతంర, కిష్కింధ మాల్యవద్ధిరణ్యశృంగాఖ్య పంచమహానగసమధిష్ఠితే,

మలయము మహేంద్రము, సహ్యము, శుక్తి మంతము, ఋక్షము, వింధ్యము, పారియాత్రము, అను పేర్లుగల సప్త కులపర్వతములతో చుట్టబడియున్నట్టియు.

ఋష్యమూకము, మతంగము, కిష్కింధము, మాల్యవంతము, హిరణ్యశృంగము, అను అయిదు మహాపర్వతములున్నట్టియు,

(21) 'లలణక్షుసురాసర్పిదథిక్షీర శుద్ధోదకాఖ్య సప్తసముద్ర సంవృతే' ఉప్పు, చెఱుకుపాలు, కల్లు, నెయ్యి, పాలు, పెరుగు, మంచినీరు, అను నేడు ద్రవ్యములుగల, నేడు సముద్రములతో చుట్టబడియున్నట్టియు,

(22) వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.

1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)

2. వేదాంగములు- వేదములకు సంబంధించిన యారుశాస్త్రములు

(1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు)

3. ఇతిహాసములు - పురాణాదులు

4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.

5. న్యాయము = తర్కశాస్త్రమునకు పేరు

6. కావ్యాలంకారములు - రఘువంశాది సర్గసంబంధమైన కావ్యములు వీనిలోని యర్థాదుల భేదమును బోధించు ఉమమాలంకారాదియ లంకారాదులు (వీనికే సాహిత్య శాస్త్రమందురు)

7. నాటకములు = దశరూపాత్మకమనదగు పదిభేదములతో గూడిన, శాకుంతలము ఉత్తరరామచరిత్రము. ముద్రారాక్షసమువంటి దృశ్యకావ్యాములనదగు నాటకములు

8. గానము = సంగితము = 1. శాస్త్రీయ సంగీతమనదగు, త్యాగరాజాదికీర్తనలు 2. సినిమాసంగీతము 3. జానపద సంగీతము 4. లలిత సంగీతము అను భేదములతో నేడు ప్రచారములో సంగీతములున్నవి. ప్రాచీనకాలమున 1. కర్నాటక సంగీతము 2. ఉత్తర హిందూస్థానీ సంగీతమనురీతిని వ్యవహారముగలదు.

9. కవిత్వము ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము, ప్రకృతము గేయ కవిత్వము వాడుక మెండైనది.

10. కామశాస్త్రము = వాత్స్యయనమహర్షి ఈ శాస్త్రమునకు సూత్రములు రచించినవారు. యశోధరుడను పండితుడు ఈ సూత్రములకు జయమంగళమనుపేర వ్యాఖ్య రచించినవారు. దత్తకసూత్రములు బాభ్రవీయకారికలు, సింహళీయుడైన కొక్కోకగ్రంధము, నరసింహవృత్తి. కందర్పచూడామణి, నాగరసర్వస్వము మొదలైన వెన్నో నీ శాస్త్రమునకు సంబంధించ గ్రంధములుగలవు.

11. ద్యూతము = జూదమాడడము; జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదముననూ కొన్నిగలవు. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,

12. దేశభాషాజ్ఞానం = దేశమున జనులు మాట్లాడుకొను తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ, హింది, ఉర్దు, ఇంగ్లీషు మొదలగు భాషలలో నేర్పు.

13. లిపికర్మ = దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.

14. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు

15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము

16. స్వరశాస్త్రము = ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము,

17. శకునము = ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము

18. సాముద్రికము = హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము

19. రత్నపరీక్ష నవరత్నముల నెరింగి, యందలి జీవశక్తిని గుర్తించి రేఖలు, బిందువుల గమనించి, వానివల్ల గల్గు మంచిచెడుల నెరుంగుజ్ఞానము

20. స్వర్ణపరీక్ష = బంగారమును గుర్తించు జ్ఞానము

21. అశ్వలక్షణము = గుఱ్ఱము యొక్క సుళ్ళు పగైరాల నెరుంగు విధానము

22. గజలక్షణము = ఏనుగు లక్షణములు బోధించు విద్య

23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము

24. పాకకర్మ = రుచికరమైన వంట పదార్ధముల నేర్చు రితి

25. దోహళము = రెట్టింపు ఫలములు వృక్షాదులవల్ల పొందదగు దోహదక్రియలు

26. గంధవాదము - వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు

27. ధాతువాదము - రసాయన వస్తువులు నెరుంగు విద్య

28. ఖనీవాద- గనులు మొదలైనవి నెరుంగు విధము.

29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.

30. అగ్నిస్తంభనము - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.

31. జలస్తంభము - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.

32. వాయుస్తంభము - గాలిలో తేలియాడు విద్య

33. ఖడ్గస్తంభము - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య

34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య

35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య,

36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు.

37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,

38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,

39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము.

40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.

41. వాణిజ్యము - వ్యాపారాదులు.

42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.

43. కృషి - వ్యవసాయ నేర్పు.

44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు తెరంగు

45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.

46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.

47. మృగయా - వేటాడు నేర్పు

48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు.

49. అద్మశ్యకరణీ - పరులకు కానరాని రితిని మెలంగడము.

50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు.

51. చిత్ర - చిత్తరువులు వ్రాయడము.

52. లోహా - పాత్రలు చేయి నేర్పు

53. పాషాణ - రాళ్ళు చెక్కడము.

54. మృత్‌ - మట్టితొ చేయు పనులలో నేర్పు

55. దారు - చెక్కపని

56. వేళు - వెదరుతో చేయు కార్యములు,

57. చర్మ - తోళ్ళపరిశ్రమ.

58. అంబర - వస్త్ర పరిశ్రమ

59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు

60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము

61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము

62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము

63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము

64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్యలలో నేర్పరులుగలిగినట్టియు అనగా ఈ యరువదినాల్గు విద్యలతో ప్రకాశించు విద్యావంతులతో రాణించుచున్నట్టిదియు

23. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, కామరూప, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, బెంగాళ, నేపాళ, మళయాళ, కేరళ, సింహళ, చోళ, పాంచాల, కోసల, కుంతల, జ్వాలా, సాళ్వ, మగథ మాగథ, మాళవ, మత్స్య, వత్స, మద్ర, మైంద, సింధు, సైంధవ, ఆంధ్ర, గాంధార, లాట, వరాట, కర్నాట, ద్రమిడ, ద్రావిడ, పాండ్య, పుళింద, పారశీక, బాహ్లీక, బర్బర, విదర్భ కేకయ, కురు కిరత, దశార్ణ, హూణ, టెంకణ, కొంకణ, యవన, సూర సేన ఘూర్జర, విదేహ, చేది, భోజ, అవన్త్యాఖ్య షల్పుంచాశత్‌, దేశ సమలంకృతే.

1. అంగము, 2. వంగము, 3. కళింగము, 4. కాశ్మీరము, 5. కాంభోజము, 6. కామరూపము, 7. సౌవీరము, 8. సౌరాష్ట్రము, 9. మహారాష్ట్రము, 10. బంగాళము, 11. నేపాళము, 12. మళయాళము, 13. కేరళము, 14. సింహళము, 15. చోళము, 16. పాంచాలము, 17. కోసలము, 18. కుంతలము, 19. జ్వాలము, 20. సాళ్వము, 21. మగథము, 22. మాగధము, 23. మాళవము, 24. మత్స్యము, 25. వత్సము, 26. మద్రము, 27. మైందము, 28. సింధు, 29. సైంధవము, 30. ఆంధ్రము, 31. గాంధారము, 32. లాటము, 33. వరాటము, 34. కర్నాటకము, 35. ద్రమిడము, 36. ద్రావిడము, 37. పాండ్యము, 38. పుళిందము, 39. పారశీకము, 40. బాహ్లీకము, 41. బర్బరము, 42. విదర్భము, 43. కేకయము, 44. కురుదేశము, 45. కిరాతము, 46. దశార్ణము, 47. హూణము 48. టెంకణము, 49, కొంకణము, 50. యవనము, 51. శూరసేనము 52, ఘూర్జరము, 53. విదేహము, 54. చేదితము, 55. భోజదేశము 56. అవన్తి దేశములతో గూడిన ఈ దేశములెల్ల ప్రాచీన కాలమున వ్యవహారము. ప్రకృతము దేశము లివియేయున్ననూ కాలానుసారము పేర్లు మార్పులు, కూర్పులు చేర్పులు పొంది వికృతిరూపాలు జెందియున్న వేగాని వేరుగాదు.

24. "భాగీరధీ, భీమరధీ, సరస్వతి, గౌతమి, నర్మదా. యమునా, కృష్ణవేణీ, వేణుకా, తుంగభద్రా, చంద్రభాగా, వరుణా, మలాపహారి, కావేరీ, కపిలా, కౌండినీ, కృతమాలా, విపాశా, తాపినీ, పూర్ణిమా తామ్రవర్ణీ, వేగతీ, హేమవతీ, వేత్రవతీ, నేత్రవతీ, విశోకా, కౌశికీ, గండకీ, గోముఖీ, పినాకినీ, పుణ్యదాద్యనేక మహానదీ విరాజితే.

గంగానదీ, భీమరధీనదీ, సరస్వతీనది, గోదావరినది. నర్మదానది, యమునానది, కృష్ణానది, వేణుకానది, తుంగభద్రానది, చంద్రభాగానది, వరుణానది, మలావహారీనది, కౌండినీనది, కృతమాలానది, విపాశానది, తాపినీనది, పూర్ణిమానది, తామ్రపర్ణీనది, వేగవతీనది, హేమవతీనది, వేత్రవతీనది, నేత్రవతీనది, విశోకానది, కౌశికీనది, గండకీనది. గోముఖీనది. పినాకినీనది, పినాకినీనది, (పెన్నానది) మొదలైన పుణ్యము నొసంగు మహానదులులతో ప్రకాశించు (నీ భూభాగమున)

25. వారణసీ, చిదంబర, శ్రీశైల, అహోబిల, వేంకటాచల, శ్రీరంగసేతు, జంబుకేశ్వర, కుంభఘోణ, హాలాస్య, గజారణ్య, గోకర్ణ రామనాధపుర, ఆవర్తపుర, అనంతశయన, ఆమరగిరి, యాదవగిరి, కరిగిరి, కకుద్గిరి, స్వేతగిరి, నీలగిరి, గోవర్ధనగిరి, గయా, ప్రగాద్యనేక పుణ్యక్షేత్ర సంయుతే.

కాశీ, చిదంబరము, శ్రీశైలము, అహొబలము, తిరుపతి, శ్రీరంగము, సేతు రామేశ్వరము, జంబుకేశ్వరము, కుంభఘోణము, హాలాస్యము, గజారణ్యము, గోకర్ణము, రామనాధపురము, ఆవర్తపురము, అనంతశయనము (తిరున్కూరు) అమరగిరి. యాదగిరి కరిగిరి, కకుద్గిరి, స్వేతగిరి, నీలగిరి, గోవర్ధనగిరి, గయా, ప్రయాగ, మొదలైన పుణ్యక్షేత్ర సమూహములతో కూడిన (భూభాగము)

26. హరిశ్చంద్ర, నళ, పురుకుత్స, పురూరవః, సగరకార్తవీర్యాఖ్య షట్చక్రవర్తి పరిపాలితే.

హరిశ్చంద్రుడు, నలచక్రవర్తి, పురుకుత్సమహారాజు, పురూరవ చక్రవర్తి, సగర చక్రవర్తి, కార్తవీర్యార్జున మహారాజు, అను నార్గురు పేరుపొందిన మహా చక్రవర్తులచే పరిపాలింపబడినట్టి (భూభాగమున)

27. బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, ఇంద్రాణీ, వారాహీ, చాముండాఖ్య సప్తమాతృకావిరాజితే,

1. బ్రాహ్మీ, 2. మాహేశ్వరీ, 4. కౌమారీ, 4. వైష్ణవీ, 5. ఇంద్రాణీ, 6. వారాహీ, 7. చాముండా అను పేర్లతో గూడిన నేడ్గురు మాతృమూ లతో ప్రకాశించునట్టిదియు (భూమి)

28. సావిత్రీ, సత్యవతీ, దమయంతీ, మదయంతి, లోపాముద్రా సుకన్య కేశినీ, సుశీలా, అనసూయ, అరుంధతీ, ప్రభృతి మహాపతివ్రతా సందోహ సమలంకృతే.

సావిత్రి, సత్యవతి, దమయంతి, మదయంతి, లోపాముద్రా సుకన్య కేశినీ, సుశీలా, అనసూయ, అరుంధతి మొదలైన మహా పతివ్రతల సమూహముతో ప్రకాశించునట్టిదియు

29. జంబూప్లక్ష, కుశక్రౌంచశాకశాల్మలి క్రౌంచనామక సప్తద్విపైరావృతే, జంబూద్వీపము, ప్లక్షద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, శాకద్వీపము, శాల్మలీద్వీపము, క్రౌంచద్వీపము అను నేడు ద్వీపములతోకూడియున్నట్టియు,

30. రమ్య రమణక, ద్వారకా, సింహళ, కైవల్య, మలయ, అశ్వభద్ర, కేతుగోభిలా, వంత్యపుష్కర, ఋషభ, రైవత, నిమోచనీయామ్యపారావార, లంకాసౌర, కృతమాలాఖ్యాష్టాదశోపద్వీపవిరాజితే రమ్యకద్వీపము, రమణకద్వీపము, ద్వారకాద్వీపము, సింహళ ద్వీపము, కైవల్యము, మలయాద్వీపము, అశ్వభద్రము, కేతు, గోభిలము, అవంతి ద్వీపము, పుష్కరద్వీపము, ఋషభద్వీపము, నివ్లూెచనీయము, అపారావారద్వీపము, లంకాద్వీపము, సౌరద్వీపము, కృతమూలము, అను పదునెన్మిది ఉపద్వీపములతో ప్రకాశించునట్టిదియు (ఈభూవికి విశేషణము)

31. ఇంద్రద్వీప, కశేరు, తామ్ర, గభస్తినాగ, సౌమ్య, గంధర్వచారణ భారతాఖ్య నవఖండ మండితౌ,

ఇంద్రద్వీపఖండము, కశేరుఖండము, తామ్రఖండము, గభస్తిఖంఖము, నాగఖండము, సౌమ్యఖండము, గంధర్వఖండము, చారణఖండము, భారతఖండము, అను తొమ్మిది ఖండములతో ప్రకాశించునట్టిదియు.

32. సుందర తర, చందన మందార, కోవిదార, కుటజ, వట, పాటల, కరవీర, కురంటక, కంటకీ, పిప్పల, కర్చూర, కదళీ, ఖర్జూర, నారికేళ, రసాల, తమాల, తాళ, హింతాళ, కృతమాల, సరళ, వకుళ, వంజుల, పున్నాగ, జంబూజంబీర, నింబి, కదంబ, సారంగ, లవంగ, రుద్రాక్ష, ఇక్షు, కపిత్థ, అశ్వత్ధ, బిల్వ, భల్లాతక, సల్లకీ, బదరి, లికుచ, చంపక, కౌతక, కుద్దాల, బంథూక, సింధువార, పిచుమంద, ఉదుంబర, పలాశ, పారిజాతాది, అనేక నోకహనివహ, నిరంతర, మనోహర, నందనవన, వ్రీడావహ, క్రీడా, వనవిహార, ద్దేవదానవ గరుడ గంథర్వ, కిన్నర కింపురుష, సిద్ధసాధ్య, విధ్యాధర, యక్షరాక్షసాది దివ్యజన నివాస, సమలంకృతే.

సౌందర్యవంతమైన, చందన వృక్షములు, మందారములు, కోవిదారములు, కుటజములు, వటవృక్షములు పాటలవృక్షములు, శరవీరములు, కురంటకములు, కంటకీవృక్షములు, పిప్పులవృక్షములు, కర్పూరవృక్షములు, కదళీ (అరటి) ఖర్జూరము, నారికేళము (టెంకాయ) రసాలము (మామిడి) తమాలము, తాళవృక్షము (తాటి) హింతాళము, కృతమాలము సరలము, వకుళము, వంజుళము పున్నాగము, జంబూవృక్షము (నేరేడు) జంబీరము, నింబము, కదంబము, సారంగము, లవంగము, రుద్రాక్షవృక్షము, ఇక్షు (చెరకు) కపిత్థము (వెలగ) అశ్వత్థము (రాగి) బిల్వము (మారేడు) భల్లాతకము, సల్లకీ బదరీ (రేగు) లికుచము, చంపకము, కేతకీ (మొగలి) కుద్దాలము, బంథూకము, సింధువారము, పిచుమందము, ఉదుంబరము, పలాశము, (మోదుగ) పారిజాతము మొదలైన వృక్షములతో నందన వనమువలె, నొప్పుచుండ, విహరించుటకై వచ్చిన దేవతలు, రాక్షసులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్వులు, విద్యాథరులు, యక్షులు, దానవులు, మొదలైన, యుత్తములతో ప్రకాశించు నట్టిదియు,

33. భారతకింపురుష, హరీళావృత భద్రాశ్వ కేతు మాల హిరణ్యక రమణక కురువర్షాఖ్య నవర్షాణాం మథ్యే భారతవర్షే,

భారతము, కింపురుషము, హారివర్షము, ఇళావృత్తము, భద్రాశ్వము కేతుమాలము, హిరణ్యకము, రమణకము, కురువర్షము, అను తొమ్మిది వర్షములలోగల భరతవర్షమునందు,

34. మత్స్య కూర్మ వరాహ నారసింహ, వామన, భార్గవ రామశ్రీరామ బలరామ, బౌద్ధ, కల్యాద్యనేకావతార వైభవస్య.

మత్స్యావతారము, కూర్మావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతార, బలరామావతారము, బుద్థావతారము కల్క్యాతారము, అను, అనేకావతారముల వైభవముతో గూడినట్టిదియు.

35. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్య రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణ బలి హనుమదాఖ్య షోడశమహా భాగవత విమలతర హృదయాన్తరాళ నిరన్తర నిర్గళ దోళావిహార సమాసక్తస్య గర్భస్ధానేకకోటి బ్రంహ్మాండ మండలస్య

పృహ్లదుడు నారదుడు పరాశరుడు. వుండరీకుడు. వ్యాసుడు. అంబరీషుడు, శుకుడు శౌనకుడు. భీష్ముడు దాల్బ్వుడు. రుక్ముడు అంగదుడు, అర్జునుడు, వశిష్ఠుడు, విభీషునుడు బలి. హనుమంతుడు మొదలైన భాగవతోత్తములతో గూడినట్టి నీ యనేకకోటి బ్రహ్మాండమండలమునకు,

36. భగవతో లక్ష్మీపతేర్నారాయణస్య నాభీ సరోజ మధ్య సముద్బూతస్య. చరాచరాత్మక నిఖీల ప్రపంచ నిర్మాణ కపట నాటక సూద్రథారస్య.

ఈ సమస్త, చరము అచరముతో గూడిన ప్రపంచ నిర్మాణ కపట నాటక సూత్రధారుడనదగిన, శ్రీ భగవంతుడైన లక్ష్మీపతి యగు నారాయణమూర్తి యొక్క నాభికమలము మధ్య భాగమున జన్మించినట్టియు.

37. శారద నీరద, పారద సచ్ఛాయ వాగ్దేవతా నిరర్గళ నిరన్తర హరణ విలాస భవనాయ మాన వదనారవిందస్య, సరస తర సారస నికర భాసుర మానస సరోవర, విహరణలాలస మానస రాజహంస వాహనస్య.

శరత్కాల మేఘము పోలికను, పాదరసమువలెను స్వచ్ఛమైన తెలుపు వర్ణముతో నొప్పుచుండు సరస్వతీదేవి యెల్లప్పుడు, నడయాడుచుండు ముఖముగల వాడును, స్వచ్ఛమైన పద్మములసమూహముగల మానస సరోవరమున విహరించి రాజహంసలు వాహనము గాగల వాడును,

38. శ్రీ భగవదాజ్ఞయా ప్రవర్తమానస్యాంద్య బ్రహ్మణః ప్రథమ పరార్ధే, పంచాద్వత్సరేష్వతీతేషు, ద్వితీయ పరార్ధే, ప్రధమవర్షే ప్రధమమాసే, ప్రధమపక్షే ప్రథమదివసే, అహని ద్వితీయయామే తృతీయముహూర్తే ప్రధమ ప్రాణాయామ సమయే.

శ్రీ భగవంతుని యాజ్ఞ మేరకు మెలంగు చుండెడు, ఆద్యబ్రహ్మయొక్క నూరు వత్సరముల యాయువులో, నర్ధభాగమనదగు, ప్రధమ పరార్ధకాలమున, ఏబది వత్సరములు నిండిన యనంతరము ద్వితీయ పరార్ధము ప్రారంభించిన, తొలిసంవత్సరమున, మొదటి నెలలో మొదటిపక్షమున, మొదటిదినమున పగలు రెండవ యామములో మూడవ ముహూర్తమున తొలి ప్రాణాయామ కాలమునందు,

39. పార్థివ, కూర్మ, ప్రళయానతం శ్వేతవరాహ, బ్రాహ్మసావిత్ర్యాఖ్య సప్తకల్పానాం, మథ్యే శ్వేతవరాహకల్పే,

పార్థివకల్పము కూర్మకల్పము ప్రళయకల్పము అనంతకల్పము శ్వేతవరాహకల్పము బ్రాహ్మకల్పము సావిత్రీకల్పము అనబడు ఏడు కల్పములపైకి, శ్వేతవరాహ కల్పమనబడు కాలమున

40. స్వాయంభువ, స్వారోచిషోత్తమ తామసరైవత చాక్షుష వైవసత్వ సూర్యసాపర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణాఖ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే.

స్వాయంభువు, స్వారోచిషమనువు, ఉత్తమమనువు, తామసమనువు రైవతమనువు, చాక్షుషమనువు, వైవస్వతమనువు, సూర్యసావర్ణిమనువు, ధర్మసావర్ణిమనువు, దక్షసావర్ణిమనువు, రుద్రసావర్ణిమనువు, బ్రహ్మసావర్ణిమనువు, ఇంద్రసావర్ణిమనువు, వేదసావర్ణిమనువు, అనబడు పదునాల్గు మనువులపైకి యేడవ మనువైన వైవస్వతమన్వంతరకాలమున,

41. సప్తవింశతి మహాయుగేష్వతీతేష్వష్టావింశతితమే, మహాయుగే, కృతత్రేతాద్వాపర కలియుగాఖ్య చతుర్యుగాణాం మధ్యే అష్టావింశతి సహస్రోత్తర సప్తదశలక్షాబ్దే కృతయుకే షణ్ణవతి సహస్రోత్తర ద్వాదశలక్షాబ్దే, త్రేతాయుగే, చతుష్షష్టి సహస్రోత్తర అష్టలక్షాబ్దే ధ్వాపరయుగేచ సమతీతేద్వాత్రింశత్స హస్రాన్విత చతుర్లక్షాబ్దే కలియుగే ప్రధమపాదే.

ఇరువదియేడు మహాయుగములు గడచి, ఇరువదియెనిమిదవ మహాయుగకాలమున, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అను నాల్గు యుగములలోని ఏడులక్షల ఇరువది యెన్మిది వేల కాలమనదగు కృతయుగము, పండ్రెండు లక్షల తొంబదియారువేల కాలమనదగు త్రేతాయుగము, ఎనిమిది లక్షల అరువదినాల్గువేల కాలమనదగు ద్వాపరయుగకాలము, నాల్గు లక్షలా ముప్పదిరెండు కాలముగల కలియుగము పైకి మొదటి పాదముతో గూడిన కలియుగమున

42. యుధిష్ఠిర, విక్రమ, శాలివాహన, విజయాభినందన నాగార్జున కలిభూపాఖ్య శకపురుష మధ్య పరిగణిత శాలివాహనశ##కే. బౌద్ధావతారే,

యుదిష్ఠిరుడు. విక్రముడు, శాలివాహనుడు, విజయాభినందనుడు, నాగార్జునుడు, కలిభూపాలుడు అనబడు శకపురుషులపైకి లెక్కింపబడునట్టి శాలివాహన శకకాలమున బౌద్ధావతార కాలముననూ

43. బ్రహ్మ, దైవ, పిత్ర్య, ప్రాజాపత్య, బార్హస్పత్య, సౌర, చాంద్రసావన, నాక్షత్రమానాఖ్య నవమాన మథ్య పరిగణితే, ప్రవర్తమానే చాంద్రమానే.

బ్రహ్మమానము, దైవమానము, పిత్ర్యమానము, ప్రాజాపత్యమానము, బార్హస్పత్యమానము. సౌరమానము, చాంద్రమానము సావనమానము, నక్షత్రమానము అని చెప్పబడు తొమ్మిదివిధములైన (కాలమును గుర్తింపజేయు విధానములకు పంచాంగరచనావిథానానికి) మానములపైకి ప్రకృతము లెక్కింపబడునట్టి చాంద్రమానకాలమున

44. ప్రభవాదీనాం, షష్ట్యాస్సంవత్సరాణాం మథ్యే ఆముకసంవత్సరే, ప్రభవ, విభవ మొదలైన యరువది సంవత్సరములపైకి జరుగుచున్న ఈ సంవత్పరమున

45. దక్షిణాయణోత్తరాయణయోర్మధ్యే అముకాయనే దక్షిణాయనము, ఉత్తరాయణము అనబడు ఆయనములపైకి జరుగుచున్న ఈ యయనకాలమున

46. వసంతాది షడృతూనాం, మధ్యే అముకఋతౌ

వసంతము, గ్రీష్మము, వర్షము, శరత్‌, హేమంతము, శశిరము అనబడు నారు ఋతువులపైకి జరుగునట్టి యీ ఋతువున

47. చైత్రాదిద్వాదశ మాసమధ్యె ఆముకమాసే, శుక్లకృష్ణపక్షయోర్మధ్యె, అముకపక్షే, ప్రతిపదాది, తిధిమధ్యె ఆముకతిధౌ, భాను ప్రభృతి వాసరమధ్యే అముకవాసరే

చైత్రాది పండ్రెండు మాసములపైకి ఈ జరుగుచుండు నెలలో శుక్లపక్షము, బహుళపక్షము అనబడు పక్షములపైకి ఈ పక్షమున పాడ్యమి మొదలు నుండు తిధులబైకి ఈ జరుగు తిధిరోజున ఆదివారము మొదలు ఈ జరుగువారముననూ

48. అశ్విన్యాది నక్షత్రమధ్యే అముకనక్షత్రే విష్కంభాదియోగమధ్యె అముకయోగే, బవాదికరణమధ్యె అముకకరణ అన్మిన్‌ శుభముహూర్తే,

అశ్వని మొదలగు నక్షత్రములపైకి యీ నక్షత్రమున విష్కంభము మొదలైన యోగములపైకి యీ యోగమున బవ మొదలైన కరణములపైకి యీ కరణమున మేషాదిరాశులపైకి యీ రాశియొక్క శుభముహూర్త పుష్కరాంశమున

అస్మిన్‌ కల్యాణమంటపే ఇదానీం అన్యాద్య విద్యావానయా సంసార చక్రేస్మిన్‌ మహతినానాయోనిషు, జనిత్వాకేనాపి భాగ్య విశేషణ ఇదానీం మనుష్యజన్మ విశేషం ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతక్షణపర్యన్తం. మనోవాక్కాయ కర్మభిః జానతః అజ్ఞానతః కృతానాం, మహాపాతక ఉపపాతకాదీనాం నవ విధానాం పాపానాం సద్యః అపనోదనద్వారా శ్రీ పరపమేశ్వర ప్రీత్యర్థం.

ఈ కల్యాణ మంటపమునందు, సంసార చక్రమున పరిభ్రమించుచున్నవారమై అనేక జన్మలనెత్తుచు యీనాటికీ మానవజన్మను అదృష్ట విశేషముచే నెత్తియున్న కారణమున నాజన్మ మొదలుకొని నేటివరకు మానసికంగాగాని, వాచికంగాగాని, శారీరకంగా గాని, తెలిసియో తెలియకనో చేసిన మహాపాపములు సామాన్య పాపములుగూడ వెనువెంటనే నశించి శ్రీ పరమేశ్వరానుగ్రహము గల్గుటకొరకున్నూ

49. గంగావాలుకాభిః సప్తర్షిమండల పర్యన్తం, కృతరాశేః దివ్యసహస్ర వర్షావసానే ఏకైక వాలుకాపకర్షణక్రమేణ సర్వరాశ్యపకర్షణసమ్మితకాలే

గంగావాలుకలచే సప్తఋషిమండలమువరకు నొక్కొక్కరాశి యతిక్రమించు కాలము పర్యంతము

50. దశపూర్వేషాం, దశాపరేషాం, మద్వంశానాం పితౄణాం మమచ సకుటుంబస్య నరకాదుత్తీర్యశాశ్వతబ్రహ్మలోక నివాస సిద్యర్ధం, మా వంశములోని నాకన్నా ముందువారగు పదిమందియును, నా యనంతరము పదిమందియు, నేను నా కుటుంబము నరకలోకము నుంచి తరించి శాశ్వత బ్రహ్మలోక నివాససిద్థి పొందుటకొరకును

51. గోథూమై: సూర్యమండల పర్యంన్తం కృతరాశే దివ్య సహస్ర వర్షావసానే ఏకైక గోథూమాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మితకాలే శాశ్వత బ్రహ్మలేక నివాస సిద్యర్థం.

52. మాషైః చంద్రమండల పర్యన్తం, కృతరాశేః దివ్య సహస్ర వర్షావసానే, ఏకైక మాషాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మితకాలే, శాశ్వతబ్రహ్మలోక నివాససిధ్యర్థం.

53. సర్షసైః ధ్రువమండలపర్యన్తం, కృతరాశేః దివ్యసహస్రవర్షావసానే ఏకైక వర్షావకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మిళితకాలే. శాశ్వతబ్రహ్మలోక నివాస సిధ్యర్థం,

54. తిలైః నక్షత్రమండలపర్యన్తం, కృతరాశేః దివ్య సహస్రవర్షాన సానే ఏకైకతిలాపకర్షణక్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మితకాలే శాశ్వత బ్రహ్మలోక నివాస సిధ్యర్ధం.

త్ర్యణుకైః బ్రహ్మండోర్ధ్వకటాహపర్యన్తం, కృతరాశేః దివ్య, సహస్ర వర్షావసానే, ఏకైకత్ర్యణుకాపకణక్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మితకాలే శాశ్వత బ్రహ్మలోకనివాస సిధ్యర్ధం,

సూర్యమండల పర్యంతము, చంద్రమండల పర్యంతము ధ్రువమండల పర్యంతము మెలంగుచు శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధీకొరకై,

55. త్రిగుణీకృతాగ్నిష్టోమాతిరాత్రాప్తొర్యాను, సాంతపన, వాజపేయ, పౌండరీక, రాజసూయాశ్వమేధ, బృహస్పతిసవన, సర్వతోముఖాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్ధం.

మూడురెట్లు ఫలితములతో గూడినదై అగ్నిష్టోమము, అతిరాత్రము అప్తొర్యామము, సాంతపనము, వాజపేయము, పౌండరీకము రాజసూయము, అశ్వమేధము, బృహస్పతిసవనము. సర్వతోముఖము మొదలైన నూరు యజ్ఞములఫలము గల్గుటకొరకును,

56. ఇహజన్మని జన్మాంతరేషుచ, బాల్య కౌమార, ¸°వనవార్ధకేషు జాగ్రత్స్వప్నషుప్త్యవస్థాసు, జ్ఞానతశ్చ, కామతః, అకామతః, స్వతః పరప్రేరణయావా సంభావితానాం సర్వేషాం పాపానాం అవనోదనార్ధం.

ఈ జన్మయందుగాని, మరోజన్మయందుగాని చేసినట్టియు బాల్యమున గాని, కౌమార దశయందుగాని, యవ్వనకాలమున గాని, ముసలితనమునగాని, మేలుకొనియున్న సమయమున గాని, నిదురించు కాలమునగాని, స్వప్నకాలమునగాని, తెలిసిగాని తెలియకగాని, కోరిగాని కోరకనేగాని నేను సొంతముగ తలంచిగాని, ఇతరుల ప్రోత్సాహముచేతగాని, వచ్చిన సమస్తపాపములు, తొలగుట కొరకై,

57. ధర్మార్థ కామమోక్షాది చతుర్విధ పురుషార్థ సిధ్యర్థం, క్షెమ స్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యా దీనాం, ఉత్తరోత్తరాభి వృధ్యర్థం,

ధర్మము, అర్థము కామము మోక్షమనెడు, మానవుడు కోరదగిన పురుషార్థ సిద్ధికొరకై, క్షేమము, స్థిరత్వము విజయము ఆయుస్సు ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైనవి, మున్ముందు, అభివృద్ధి జెందుటకొరకును.

58. ఇష్టదేవాతాప్రీత్యర్థం, స్వగృహ్యోక్తప్రకారేణ

సాలంక్రత సహిరణ్యోదక కన్యా మహాదానం కరిష్యే

తమ యిష్టదేవత ప్రీతికొరకు, తమకు సంబంధించిన గృహ్యసూత్రములలో

చెప్పిన రీతిని, అలంకారముతో కూడి యున్నట్టియు, బంగారముతో కూడిన, నీటిధారతో చేరియున్న (థారాదత్తమైన) మహాదానమనదగిన, కన్యాదానమును యిచ్చుచున్నాను. అని, మహాసంకల్పమును విధిగ చెప్పుదురు.

ఈ యేబది యెన్మిది వాక్యముల సారాంశ##మేమనగా భగవంతునిచే నిర్మింపబడిన యీ ప్రపంచమున నేనున్న దేశమున నేను, నా పితరులు తరించుటకును శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధికొరకై నాచే యధాశక్తిని యలరింకరింపబడియున్న కన్యను దానమొసంగు చున్నానని భావము. ఈ రితీని కన్యాదానమొసంగు కాలమున మహా సంకల్పము చెప్పవలయును. ఇందలి పదముల కూర్పు భావముల సొంపు త్యాగోద్దేశ్యమును త్రికరణశుద్ధిని ప్రశాంతతను నిష్కల్మషత్వమును యైహికాముష్మికత్వమును పాప పరిహారత్వమును సూచించును.

అనంతర మీ యర్ధములనే సూచించు చూర్ణికలను మంగళాష్టకములను కొందరు పఠింతురు అనంతరము కన్యాదానమున కుపక్రమింతురు. తనకు పూర్వముగల తాతతండ్రులు పదితరములవారును, తన యనంతరము వుత్ర, పౌత్రాది పదితరములవారును తాను చేరి యిరువది యొక్క తరములవారు ఈ యొక్క కన్యాదాన ఫలముచే తరించగలరని శాస్త్రప్రమాణములు యింతవరకు సూచించియున్నాను. ఆరీతినే లోకమున నేటివరకు బ్రహ్మ, క్షత్రియ, వైశ్యశూద్రులు నాల్గు జాతులవారు అనుసరించుచు వచ్చుచున్నారు. ఈ విధముగ కన్యాదాన ఫలమునాశించి వివాహము మంత్రపూతముగ చేయునది. భారతదేశమున నందులో సనాతన సాంప్రదాయ తెగకు చెందిన బ్రహ్మ, క్షత్రియ, వైశ్య శూద్రులనదగు నాల్గు తెగలవారు మాత్రమే ప్రపంచమున నింకెక్కడను ఏ తెగవారును యీరీతిని వేదశాస్త్ర మంత్రముల రీతిని కన్యాదానము చేయు విధానములేదు. వారికీ రీతిని, ఇహపరసాథనమనబడు నీకన్యాదానవిధియు తెలియదనియే చెప్పవచ్చును. కానీ కాలానుసారముగ, పాశ్చాత్యవ్యామోహ ధురీణులై, మనవారు గూడా నీ కన్యాదాన ఫలాదుల నంతగ నెరుంగ నేరకను, నమ్మకము లేకను, విధానము తెలియకను, తోచిన రీతిని యిష్టానుసారము కేవలము, పరస్పరానురాగాదులేగదా వివాహానికి ముఖ్యమని భావించి, ప్రేమవివాహాలకు లోనగుచుండుట మిక్కిలి చింత్యము, వీనికితోడు, శాఖాంతర వర్ణాంతర, జాత్యంతర వివాహములు చేసికొనుటయు నేర్పడుచున్నది. ఈ వివాహములు తొలుత మనవిజేసిన రీతిని ప్రేమవివాహాల (గాంధర్వాదులు) లోనికి చేరునుగాని ఇరువది యొక్క తరము వారిని తరింపజేయు, బ్రాహ్మవివాహానికి మాత్రము దూరమగును. అందుచే కన్యాదాన ఫలము లేకయు పోవుచున్నది. ఈ చెప్పిన బ్రాహ్మ వివాహమున, 1. కన్యాదానము 2. మాంగల్యథారణము (మంగళసూత్రము కట్టుట) 3. అక్షతారోపణము (తలంబ్రాలు) 4. సప్తపది. (సన్నికల్లు త్రొక్కించుట) 5. నాకబలి (నాగవల్లి) అను నైదంశములు ముఖ్యములుగ జరుగును. వీనికి తోడుగ, కొన్ని హోమాదులు, సదస్యములాంటివి చేర్చబడును.

ఇంతవరకు కన్యాదాన విధిని గూర్చి వివరించితిని. ప్రకృతము మాంగల్య ధారణమును గూర్చి తెలిసికొందము. రెండు మంగళసూత్రములు వివాహ సధువు థరించును. ఇందులో నొకటి, గౌరీపూజ కాలమున, (వివాహానికి ముందుగ, కన్యచేత గౌరీపూజ చేయింతురు.) తల్లిచే నొక, మాంగల్యము కట్టింతురు. దీనికే "తల్లిబొట్టు" యని వ్యవహారము.

మరియొక బొట్టు వివాహకాలమున కన్యాదానానంతరము, వరునిచేత నందరి సమక్షమున నందరి యాశీస్సులనందుచు కట్టింతురు. దీనికి అత్తవారింటి బొట్టు అని వ్యవహారము.

ఈ వివాహకన్య ఉభయకుల ప్రవర్ధినిగా రాణించుటకై తల్లిగారింటి బొట్టు, అత్తవారింటిబొట్టు రెండుబొట్టులు నామెహృదయదేశమున మెరయుచు నిటు పుట్టినింటి వృద్ధిని అటు మెట్టినింటి వృద్ధిని సర్వకాల సర్వావస్థలయందు హృద్దేశమున మరవక మెలంగుచుండునట్లు నామె హృదయమున నీ మాంగల్యములు రెండు మెరయుచుండును. భర్తయొక్క సుఖదుఃఖములు రెండు తనవే పుట్టినిల్లు. అత్తవారిల్లు అను రెండు యిండ్ల అభివృద్ధులు తనవే. గార్హస్థ్యజీవనముచేత ఈలోక సుఖము, పరలోకసుఖములు రెండు తనవల్ల తన భర్తకు చేకూరుటకు తానే కారణము, సంతానము, సంపద అను రెంటికి తానే మూలము అను ద్వంద్వములను సర్వదా స్మృతిపథమున మెరయుచుండవలమునని నీ రెండు మాంగల్యములను నా వథువునకు కట్టుటలో వరుని భావమిమిడియుండును, అందుకు తగినట్లుగనే నీ వివాహకాలమున చెప్పబడు మంత్రములభావములు యొప్పుచున్నవి. తొలుత వథూవరులచేత కంకణథారణము చేయింతురు. ఇందుకై "మమ ఆయుష్యాభివృధ్యర్ధం పాణిగ్రహణాంగత్వేన కర్మాదౌ రక్షాబంధనము (కంకణములు కట్టుట) చేయింతురు.

అనంతరము "కన్యాం కనుక సంపన్నాం, కనకాభరణౖర్యుతాం,

దాస్యామి విష్ణవేతభ్యం బ్రహ్మలోక జగీషయా"

అను మంత్రమును చెప్పుచు కన్యాదానము జేతు .

"ఇమాం కన్యాం ప్రదాస్యామి, పితౄణాంతారణాయవై|

కన్యాం సాలంకృతాం, సాధ్వీం, సుశీలాయ సుధీమతే|

ప్రయతోహం ప్రయచ్ఛామి, ధర్మకామ్యార్థ సిద్ధయే"

అని, అలంకరించిన, కన్యను, విష్ణు స్వరూపుడవైన నీకు నేను, బ్రహ్మలోక ప్రాప్తినొందుటకై యిచ్చుచున్నాను, మఱియు, యీ కన్యాదానముచే నా పితరులెల్లరు తరించుట కొరకై, యీ యలంకరింపబడిన కన్యను ధర్మ అర్ధకామ, మోక్షప్రాప్తి కొరకై గూడా, నీకు ఇచ్చుచున్నానని, నీటిధార బోయుదురు. దీనికే, కన్యాధార యనియు, కన్యాదాన మనియు నందురు.

"ఇతిసహిరణ్యం కన్యాహస్త ముదకపూర్వం వరహస్తేదద్యాత్‌ అని యిందుకు శాస్త్రము అనగా, బంగారుతోగూడ, కన్య చేతిని వరుని చేతిలో నుంచి, ఉదక ధారపోయవలయునని విధి. కాన ఆరీతిని నేటివరకు కన్యాదానము జరుగుచున్నది. కన్యాదానముతో గూడ శక్తి యున్నవారు. "తతః కన్యాదాన సాద్గుణ్యార్థం గోదాన భూదాన, సాలగ్రామదానాది షోడశ మహాదానానిచకుర్యాత్‌" యథాశక్తి దానానిచకుర్యాత్‌" అను విధిననుసరించి గోదానము, భూదానము సాలగ్రామదానము, హిరణ్యదానము, గృహదానమువంటి పదునారు దానములు చేయదగును. శక్తిహీనులు యధాశక్తిగ దానము చేయవచ్చును. అను ధర్మముననుసరించి నేడు వరకట్నము సర్వత్రవ్యాపించి కన్యాదాతయొక్క సర్వస్వమును హరించుచున్నారు. ఇది మిక్కిలి హేయము. ఈ రీతిని వరదక్షిణలు పీడించి తీసికొనుటచే కన్యాదాత బాథపడడమువల్ల పాతిధ్యమేర్పడునేగాని సుఖమిసుమంతేని గలుగ నేరదు. యోగ్యులైనవారు, విద్యావంతులైనవారు, ధర్మముపై విశ్వాసమున్నవారు యిప్పటికైనా యీ వరకట్నపు ఆశలను వదలుకొటయు. వీనికి ప్రోత్సాహమివ్వకయు నరికట్టుట శ్రేయస్కరము, ధర్మము యోగ్యులైనవారు గమనింతురుగాక.

కన్యాదానకాలమున వరకట్నముగ వచ్చు సంపదకాశించి తమ పుత్రుని యమ్ముకొనినవారు కాగలరు. అట్లు అమ్ముడుపోయిన పుత్రుడు తనకు ఉత్తరక్రియాది కార్యములొనర్చుట కనర్హుడు కాగలడు. ఈసంపద వల్ల జీవించవలయునని యాశించువారు మిక్కిలి నీచాతి నీచపు జీవనము చేతురుగాని సుఖింపలేరు. దేవీభాగవతమున స్త్రీవిత్తముతో జీవించువారు మిక్కిలి అధమాధములై జీవించగలరనిగలదు. కాన కన్యాదానార్థమై యధాశక్తిని నిచ్చు విత్తమును గ్రహించుట యోగ్యము గాని పీడించి వరదక్షిణలు యాచించుట విజ్ఞానవంతులెల్లరు గర్హించుట నిషేధించుట యుక్తమని మనవిజేతును.

అనంతరము కన్యాదానకాలమున వరునిచేత నీరీతిని ప్రమాణము జేయింతురు.

''థర్మెచ-అర్ధెచ-కామేచ-నాతిచరితవ్యేతిదాతావదేత్‌" అనురీతిని ప్రమాణము జేయించును. థర్మకార్యములు చేయునప్పుడుగాని, ఆర్థిక సంబథమైన కార్యములు చేయునప్పుడుగాని కామ్యకర్మలు అనగా ప్రాపంచికమునకోరదగిన కోరికలు అనుభవించుకాలమునగాని ఈ కన్యతో గూడ నీవు ధర్మార్థకామములను అనుభవించవలసినదేగాని, ఈమెను వదలి ధర్మార్థకామములననుభవించరాదు అని కన్యాదాతకోరగ "నాతి చరామి తివరఃప్రత్యుక్త్వా" అను విధిననుసరించి వరుడు నీవు కోరినరీతిని థర్మార్థకామములను యీమెనువీడి వేరుగ మెలుంగ నేరనని ప్రమాణము జేయును. అనగా థర్మము అర్థము కామము అను మూటిని యీమెతో గూడ ననుభవింతునేగాని యీమెనువీడి యనుభవించనని కన్యాదాతకు వరుడు ప్రమాణముజేసి చెప్పును. కనుకదే ఎన్నడేని భర్తయైనవాడు ఏదేని ధర్మకార్యము చేసినచో ఉదకధారను భార్యజేత వేయింతురు, ఆమె ఉదక థారపోయనిది చేయు దర్మమశాస్త్రీయము కాగలదు.

ఆర్థిక విషయములలోగూడ నామె తోడ్పాటు అవసరమేయగును. స్వగృహమునకు కావలసిన వస్తు వాహనాదులు ఆమె కోరిన రీతిని తేవడము యుక్తము. సంసారము పొదుపు పరిమితము ఆమెవల్లనే కాగలదు కాన ఆర్థిక విషయమున నామె తోడ్పాటు యుక్తమే.

కామ్యవిషయమున నామె తోడ్పాటు మరింత ముఖ్యము. గార్హస్థ్య జీవనమునకు కావలసిన కోరికలెన్నెన్ని గలవు. వాని నన్నిటిని పొందవలయుననిన నామె తోడ్పాటున్ననే సాధ్యము.

కనుక ధర్మార్థ కామములు మూటి విషయములలో నిరువురు సమభాగులై మెలంగవలయుననెడి తలంపుతో కన్యాదాత ప్రమాణము చేయమని కోరును. వరుడారీతిని ప్రమాణము చేయును.

మోక్షవిషయంలో మాత్రము ప్రమాణము చేయరాదు. ఎవరెవరి బుద్ధి ననుసరించి వారివారి మనసిక పరిపక్వస్థితిననుసరించి వారు వారు చేయు సుకృత దుష్కృతముల ననుసరించి వారువారు చేయు గురు కృపాకటాక్షమున చేయు సాథన ననుసరించి, వారి వారి జన్మ సాఫల్యత ననుసరించి మోక్షము భగవంతుడిచ్చునది లేనిది యుండును గాన దానిలో నిరువురు సమముగ వ్యవహరింప సాధ్యముగాదు, గాన మోక్షమును గూర్చి ప్రమాణము చేయరాదుగూడ.

సుముహూర్తే వథూవరయోః శిరసిగుడ జీరకంనిక్షిపేత్‌" అను రీతిని సరియైన ముహూర్త కాలమున వరుని శిరమున వధువు, వధువు శిరమున వరుడు జిలకర బెల్లము నుంచవలయును. దీనీకే ముహూర్త కాలమందురు. కనుకనే "అయం ముహూర్తః సుముహూర్తో అస్తు" అని ఈ ముహూర్తము సుఖకరమైన ముహూర్తము అగుగాకయని అక్షతలు పెద్దలు ఆశీర్వదించి వధూవరులపై చల్లుదురు.

"తతః సుముహూర్తే కన్యానాందృష్ట్వా"

చక్షుషీఉపసంహృత్య అభ్రాతృఘ్నీమితిజపిత్వా" అనురీతిని కన్యను వరుడు వరుని కన్యనాసమయమును బాగుగ చూడమందురు. అట్టితరిని ఈ కన్యక మంచి చూపుతో చూచుగాక, యీమె చూపులు క్రోథ ఈర్ష్యాసూయాదులు లేనివై సోదరులు, పుత్రులు నశింపజేయునది కాకుండుగాక. దరిద్రమును నిచ్చునదిగాకుండుగాకయని వేదమంత్రములతో చెప్పుదురు. అనంతరము 'తస్యాఃభ్రువోః అంతరం దర్భెణసంమృజ్య ప్రతీచంనిరస్సెత్‌' అను విధి ననుసరించి కన్యయొక్క కనుబొమల మథ్యనుంచి పాపటమీదుగ దర్భలతో తుడిచి వెనుకకు పారవేయుదురు దీనివల్ల ఆమె దృష్ఠిదోషము హరించి సౌమంగల్యత్వము పెంపొందును. అనంతరము కాడిమానును కన్యశిరమున నుండులాగున పట్టుకొని యాకాడి మాను రంధ్రమున బంగారమునుంచి నందుపై నీరుపోసి కన్యశిరమును ప్రోక్షింతురు. యీకార్యమునకు 'యుగచ్ఛిద్రాభిషేక'మని వ్యవహారము. యుగనునగా కాడిమాను ఛిద్రము, రంధ్రము అందునుంచి చేయు అభిషేకముగాన యుగచ్ఛిదాభిషేకమని వ్యవహారము, యీయభిషేకము చేయుటచే కన్యయొక్క శరీరసంబంథమైన ఏ రోగములున్నను నశించుననియు నశించవలయుననియు భావము.

ఇందొక కధగలదు. సంక్షేపముగ చెప్పుదును. పూర్వము 'అపాల' యను పేరున నొక కన్యకయుండెడిది. ఈమెకు కుష్టువ్యాధి సోకినది. ఈ వ్యాధి నశించి, దేవేంద్రుని వివాహమాడవలయునని యీమె ఘోరముగ తపస్సు చేయుచుండెను. యీమె తపము చేయుచుండ సమీపాన గల నది వెల్లువతో నుప్పొంగి యీమెతొగూడా కొట్టికొని పోవుచుండెను. కానీ యీమెమాత్రము భయపడక స్థిరచిత్తముతొ తపస్సులోనే యుండెను. దీనినంతయు గగనమార్గమున నెళ్ళుచుండిన ఇంద్రుడు గుర్తించినవాడై చేరువునగల నొక తీగను పుచ్చుకొని నమిలి నారసమును తన రథమునకుగల కాడిమాను రంథ్రముగుండా నీమేపై బడులాగున నుమ్మవేసెను. ఆరీతిని యుమ్మివేసిన రసము యీమెపైబడి యీ శారీరరోగములెల్ల నశించి, మంచి రూపురేఖాలావణ్యములుగల నందవతిగ నా కన్యమారినది. ఆరీతిని మారిన మార్పువలె ప్రకృతము వివాహము జేయబడు యీ కన్యకగూడ శారీరక రోగములెల్లయు నశించి మంచిరూపవతియై 'అపాలా' కన్యవలె ప్రకాశించుగాక' యను భావముతొ నీగాథకు సంబంధించిన మంత్రములతొ కన్యక శిరమున కాడిమానునుంచి నారంధ్రమున బంగారమునుంచి ధర్భలందుంచి ఈ బంగారము, దర్భల నీళ్ళతొ నీ వివాహ కన్యకశిరమును ప్రోక్షింతురు. ఇందుకై కాడిమాను నలంకరించి తెత్తురు. 'సకృత్స్నాపయతి'యని యైదుమంత్రములచే నీయుగచ్ఛిద్రాభిషేకముజేయించి యనంతరము మాంగల్యధారణము జేతురు.

'ఆయుర్వర్చోయశోబలాభివృద్యర్థం సంపూర్ణ వర్ష శతపర్యంతం సుఖేన జీవనసిద్యర్థం యోక్త్రమాంగల్యపూజాంకరిష్యే' అని ఆయుస్సు వర్చస్సు బలము వృద్ధిపొందుటకొరకు నూరు సంవత్సరములకాలము ఉభయులు సుఖజీవనము చేయుటకొరకు మాంగల్యపూజ నాచరింతురు.

"మాంగల్యం తంతునానేన, మమజీవన హేతునా

కంఠె బధ్నామి సుభ##గే, త్వంజీవ శరదాంశతం||

మోక్త్రమాంగల్యముహూర్తః సుముహూర్తోస్తు

అని మాంగల్యమును, కన్యమెడలో వరుడు కట్టునప్పుడు పఠించు మంత్రమియ్యది.

ఓ సౌభాగ్యవతీ, కన్యకా, నాజీవన హేతువైన, ఈ మాంగల్యమును నీకంఠమున కట్టుచున్నాను. నీవు నూరువత్సరములు సుఖజీవనము జేతువుగాక, అని, మాంగల్యమును కట్టును. ఈ మాంగల్యము కట్టు సమయము మంచి సుముహూర్తమగుగాక యని పెద్దలు అక్షతలు చల్లుచు నాశీర్వదింతురు.

అనంతరము అక్షతారోపణము (తలంబ్రాలు) "తతః అర్ద్రాక్షతారోపణం కుర్యాత్‌" అని విధి తడిపి, ఆర వేసిన బియ్యముతో తలంబ్రాలు పోసికొనదగినదని భావము.

"వధూశ్చ పూర్వం, ప్రథమే తృతీయే, వరశ్చపూర్వం, ద్విచతుర్థయోస్తు" అనురీతిచి, కన్యకచేత, తొలుత తలంబ్రాలు పోయించవలయును, అనంతరము వరుడు కన్యకశిరమున తలంబ్రాలు పోయవలయును. మరలా కన్యక, అనంతరము వరుడు తలంబ్రాలు పోయదగినది. ఈ రీతిని, మొదట, మూడవమారు కన్యక, రెండతూరి నాలుగవమారు, వరుడు తలంబ్రాలు పోయవలయునని భావము.

"ఇతి వధూవరయోః శిరసి అక్షతారోపణం కృత్వా"

యీ రీతిని, వేదమంత్రములు పఠించుచుండగ, వధూవరుల శిరస్సులపై అక్షతారోపణ కార్యము చేసి, యనంతరము, నాలుగవమారు, ''చతుర్ధ పర్యాయే అన్యోన్యం యుగపత్‌'' అనురీతిని నాలుగవమారు, ఇరువురు ఒకేతూరి శిరమున తలంబ్రాలు పోసికొనవలయును, యీరీతిని కన్యాదానము తలంబ్రాలు అనబడు అక్షతారోపణము జరుగగాని, వివాహము చేసికొనిన వధూవరుల నాశీర్వదింతురు. ఈ యాశీర్వదించు రూపమున వారి వారికి తోచిన రీతిని చదివింపులు, ముట్టజెప్పుట యాచారమైనది.

అనంతరము హోమకార్యము లాచరింతురు. యీ హోమకార్యమునకు ప్రధాన హోమమందు . "అనయానవోఢయా వధ్వా, సహమయా ఆయుష్యాభి వృథ్యర్థం వివాహ ప్రధానహోమం కరిష్యే" అని, యీ వివాహమాడిన కన్యకతో గూడా నేను. ఆయుర్వృద్ధిని జెందుటకై, నీ వివాహసంబంధమైన, ప్రధానహోమము నాచరించుచున్నావని వరుడు సంకల్పము చేయవలయును.

అనంతరము పాణిగ్రహణము అను విధిని జరిపింతురు, "దక్షిణన వామ పాణింగృహీత్వా" యని తన కుడిచేతితో కన్యక యడమచేతిని పట్టుకొనవలయును ఆరీతిని పాణిగ్రహము చేయునప్పుడు గూడ ప్రత్యేక విధియు గలదు, దానికి తగినట్లు ఫలితములు గలవని నీరీతిని ఆపస్తంబమహర్షి సూత్రీకరించి యున్నారు.

"అథాసై#్య దక్షిణన, నీ చాహస్తేన, దక్షిణ ముత్తానగ్‌ంవాహస్తం గృహ్ణీయీత్‌. తనచేయి పైభాగముననుండులాగున కన్యక చేయి క్రింది భాగమున నుండులాగున, గ్రహీంచవలయును.

"యదికామయేత స్త్రిరేవ, జనయేయ మిత్యంగుళ##రేవ గృహ్ణీయాత్‌" ఈ కన్యక చేతిని గ్రహించు వరుడు. అందరూ స్త్రిలే జనించవలయునని తలంచిన (అనగా ఆడబిడ్డలే పుట్టవలయుననిన) ఆమే చేతి వ్రేళ్ళనన్నిటిని, చేర్చి పట్టవలయును.

"యదికామయేత్‌, పుగ్‌ంసఏవ జనయేయ

మిత్యం గుష్ఠమేమసోభివాంగుష్ఠం"

పుత్రులు మాత్రమే గల్గు కోరికనున్నచో, నా కన్యయొక్క బొటనవ్రేలి మాత్రమే పట్టవలయును. ఆడ, మగ, యిరువురు కలుగవలయుననినచో బొటనవ్రేలితో గూడా నన్నివ్రేళ్ళు కలిపి పట్టవలయును గాన, నే కోరిక యున్న నారీతిని, పాణిగ్రహణము చేయదగినది.

అనంతరము "సప్తది" యనువిధిని చేయింతురు. ఈ కార్యముచే వథూవరుల మనస్సు స్థిరబడి పరస్పరమనురాగము వృద్దియై దాంపంపత్య జీవితమును సుఖకరముగ జేసికొనదగుననెడి తలంపున, వేదమంత్రములు చెప్పుచు కన్యకను, నేడడుగులు, నడిపించి, కన్నెకాల్లు త్రోక్కించు విధికే సప్తపదియని పేరు.

అధఉత్తరేణాగ్నెం. దక్షిణన పదాప్రాచీ ముదీచీం వాదిశమభిప్రక్రమయ, త్యేకమిషేతి ప్రతిమంత్రగ్‌ం సప్తపదానిగత్యా" అనువిధి ననుసరించి, హోమము చేసిన అగ్నికి ఉత్తరపు దిక్కున కన్యకను నిలిపి, తూర్పునకుగాని, ఉత్తరమునకుగాని, కుడికాలుతో నేడడుగులు నడపించుతు వేదమంత్రములు చెప్పుదురు.

"సఖేపత్యాది సూనృత ఇత్యన్తగ్‌ం, సప్తమే పదేజపతి సఖే సత్యాది మంత్రమును పఠించుచు, కన్యకను నేడవయడుగు వేయించదగినది.

ఈ యేడడుగులు నడపించి, వరుడు కన్యకతో నీ యర్ధములు వచ్చు వేదమంత్రములు పఠించును. నేను, ఆకాశమువంటి వానిని నీవు భూమి వంటి దానివి. రేతస్వరూపము నేను రేతస్సు ధరించు శకిల్త గలదానవు నీవు నేను మనస్సు వంటివానిని. వాక్కులవంటి దానివినీవు అనగా మనస్సనగల భావము నేను ఆ భావాన్ని వాక్కులతో చెప్పబడునుగాన వాగ్రూపము నీవు ఈరీతిని అవినాభావ సంబంధముగల వారమై దాంపత్యజీవితమున మెలంగదగుదుమని వరుడు కన్యతొవచించును. ఈ మాటలెర్లము వేదమంత్రములుగ పఠింతురు.

అనంతరము, "మేవతిః జీవాతుశరదశ్శతం" అనుకోరికతో కనతిన భ నూరుకాలములు జీవించులాగున చేయవలసినదాని సూర్యని ప్రార్థించును. పేలాలతో హోమము చేయమని తన సోదరుడు అందివ్వగా తాను గ్రహించి భర్తచేతికిచ్ఛి హోమము చేయమని కోరును. దీని కేలాజహోమమందురు.

అనంతరము వివాహప్రవేశహోమమాచరింతురు. "అధ వధూగృహాత్‌ స్వగృహాత్‌ ప్రత్యానయన్‌" కన్యక పుట్టినింటినుండి తన యింటికి వచ్చి ఈ గృహప్రవేశహోమమాచరింపదగియున్నది, కానీ వివాహకాలమున నందే నీ ప్రవేశహోమము చేయింతురు,

మూడు వేదమంత్రములను పఠించుచు అగ్నియెదుట కన్యతో నిట్లనును.

"సంరాజ్ఞీశ్వశురేభవ సంరాజ్ఞీస్వసృవాంభవ అను మంత్రములు పఠించును. అనగా నీవు మాకందరికి రాణివంటిదానివిగ నగుగాక. మా యింటికి నీవధిపతిరాలువు నా సంపదకంతా నీవేయధికారిణివి. అని తన యింటినంతయు "సంకాశయామీతి గృహాందర్శయతి" చూపించును.

అనంతరము శేషహోమమనబడు వివాహాంగథర్మప్రతిష్ఠానార్ధ కార్యము నాచరింతురు. "వివాహాంగ ధర్మప్రతిష్ఠాపనంకరిష్యే" యని సంకల్పింతురు, అనంతరము "ధ్రువమరుంధతీంచదర్శయతి" యని ధ్రువ నక్షత్రమును, అరుంధతీ నక్షత్రమును దర్శింతురు. దీనిచే థ్రువనక్షత్రమువలె స్థిరత్వము, అరుంధతీనక్షత్రముచే సౌభాగ్యవృద్ధియు వధూవరులకు చేకూరగలవుగాన, నా రెండు నక్షత్రములను దర్శింతురు.

పెద్దలచే నాశిర్వాదకార్యము నాచరింపజేతురు, దీనికే 'సదస్య' మందురు, వేదవేత్తలను రావించి వేరమంత్రపఠనము వార్లతో జేయించి వథూవరుల నభివృద్ధికొరకు నాశీర్వదింపవలయును. 'దంపత్యోః ఆయుర్వర్చో యశోబలాభివృథ్యర్థం శిష్టాచారప్రకారేణ మహదాశీర్వచనం కుర్యాత్‌' అనురీతిని మంచి ఆచారపరులైన వేదవేత్తలచే ఈ నూతన దంపతులకు ఆయుర్వృద్ధికొరకు సంపద సంతానాద్యభివృద్ధులకొరకై వేదమంత్రములతో నాశీర్వాదము జేయించవలయును, కాలానుసారము నేటి వారు వినోదార్ధమై సంగీతకచ్చేరీలు, కవిసమ్మేళనాలు చేయుచున్నారు. ఇది వినోదకార్యముక్రిందవచ్చునేకాని వేదవేత్తలుచేయు నాశీర్వాదమున లవలేశ##మైన సరిరాదు. కాన తప్పక వేదవేత్తల యాశీర్వాదములకై యత్నించవలయును.

'అష్టవర్షాత్‌ భ##వేత్‌ కన్యాపుత్రవత్‌ పాలితామయా ఇదానీం తవ దాస్యామ దత్తాం స్నేహేనపాలయం' అని చెప్పి కన్యాదాత కన్యకను వరునకప్పగించును. పూర్వకాలమున ఎనిమిదవ వత్సరముననే వివాహము జేతురు గాన ఎనిమిది వత్సరములపాటు నేను రు కన్యకను కొడుకులతొ సమానంగా సాకినాను. యీనాడు నీకు అర్పించినాను గాన నీవు స్నేహముతో నీమెను పరిపాలించవలసినదని కోరుచు కన్యకను అప్పగింతురు. ఈ కార్యమునకే 'అప్పగింత'లని వ్యవహరింతురు.

అనంతరము నాకబలి [నాగవల్లివ్యవహారం] కార్యమును జేతురు.

చతుర్థీక్షు నాకబలి మృణ్మయ పాత్రాణి నిధాయ అని నాల్గువైపుల పాత్రలుపెట్టి (మట్టివి) 'తంతునావేష్ట్య' యనురీతిని వానికి దారములు దారములుచుట్టి 'సువాసిన్యే దీపసహిత కాంస్యపాత్రద్వయం గృహీత్వా' ముత్తైదువలు దీప పాత్రముల జంటను గ్రహించియుండగ ''త్రయత్రింశత్‌ అన్నికబళాన్‌ సర్వతోనిధాయ'' ''ముప్పదిమూడున్నపుముద్దలు చుట్టూ అంతటాయుంచి 'చతుర్థిక్షు నాకదేవతాభ్యోబలిం ఉదకపురస్సరం విసృజేత్‌' అను రీతిని స్వర్గలోక దేవతలనుద్దేశించి నలువైపుల నీటి ధారతొ త్యాగమొనర్పదగినది.

అనంతరము ''గౌరీ నీలలో హిత పూజాంకరిష్యమాణః అని సంకల్పించి, నల్లలను, కన్యకకు కట్టుదురు. వసంత మాధవ పూజనాచరించి,

''దేవీంద్రాణీ నమస్తుభ్యం, దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారేగ్యం, పుత్రపౌత్రాంశ్చ దేహిమేయని. ఇంద్రుని భార్యయైనశచీదేవిని ప్రార్థించుచు యీ వివాహమైన వధూవరులకు, భాగ్యము ఆరోగ్యము పుత్రులు పౌత్రులు యివ్వవలసినదని ప్రార్థింపవలయును. నీరీతిని వారివారి యోగ్యతానుసారము కులాచారము రీతిని దేశాచారము రీతినికొన్ని మార్పులతో వివాహ కార్యము వధూవరుల క్షమార్ధము సుఖార్థము ఆయుర్యవిధ్యర్ధము. సత్సంతా నార్ధము, సుఖజీవనార్ధము సౌభాగ్యవృధ్యర్థము, వేదమంత్రములతో నీ పవిత్రమైన వివాహ కార్యము, తమ యిరువది యొక్క తరములవారు తరించుకొరకై సాలం కృత కన్యాదాన పూర్వకము, సనాతన సాంప్రదాయ ధురీణులు వివాహ కార్యమును, తమ శక్త్యానుసారము వైభవోపేతముగా జరిపింతురు. యీ రీతిని బ్రహ్మ వివాహము చెసికొని వివాహమాడిన కన్యతో గృహప్రవేశము, యధాశాస్త్రియముగ చేయిదగును. పెండ్లియైన పదునారు దినముల లోపుగ, సరిదినములలో గృహప్రవేశము చేయదగునందురు:

''షష్ఠేష్టమేవా, దశ##మేదినేవా, వివాహమారభ్య వధూప్రవేశః|

పంచాంగ శుద్ధంచదినం వినాపి, తిథౌనసద్గోచర కేపికార్యః|''

అను రీతిని, వివాహమయినది మొదలు, ఆరవరోజుగాని, ఎనిమిదవ రోజుగాని, పదియవ దినమునగాని, తిథివార, నక్షత్ర యోగములనబడు పంచాంగ శుద్దిలేకున్ననూ గృహప్రవేశమునకు ముఖ్యము.

''వివాహ మారభ్య వధూప్రవేశః యుగ్మేదినేషోడశవాసరాంతే|

వివాహమైనది మొదలు పదునారు దినములలోపుగ సరిరోజులలో నేదినము నేని గృహప్రవేశము చేయవచ్చును.

''వధూప్రవేశః నదివాప్రశస్తః''|

అనురీతిని నూతన వధూగృహ ప్రవేశము పగలంత యోగ్యము గాదుగాన, సూర్యాస్తమయా నంతరమే, నూతన వథూగృహప్రవేశము చేయుట యుక్తము. కనుక వివాహమయినది మొదలు పదునారు దినముల లోపుగ, సరిరోజులలో సూర్యాస్తయామనంతరము వివాహమైన నూతన వధూగృహ ప్రవేశమునకు యోగ్యమని యున్నదీ గాన, నీ రీతిని గృహప్రవేశము చేసిన నూతన దంపతులు, గృహస్ధులను పెరబరగు చుందురు: నూతన దంపతులు నూతన గృహస్ధులు, అని వ్యవహారము ఇట్లు వివాహమాడి వచ్చిన నూతన వధువును, తన యింటగల ప్రతివారు మిక్కిలి గారాబముగ గౌరవమర్యాదలతో చూచుకొనుట ధర్మము, ఏదో దేహవృత్తికి బానిసతనానికి వచ్చినరీతిని చూచుట కొందరిలోగలదు, అది చాలాతప్పు, ఆ స్త్రీ తనయింటికి గృహలక్ష్మివంటిదని గుర్తించవలయును. ఆమె యేమాత్రము నొప్పిబడననూ తన సిరిసంపద లెల్లయు తొలగగలవు. అపకీర్తి వాటిల్లగలదు, ఆమెనెంత గౌరవముగ చూచిన నంత ఘనత చేకూరగలదు.

మఱియు మన హిందూసమాజములో స్త్రీలను చాలా చులకనగా చూతురని పాశ్చాత్యుల ప్రచారము మెండుగలదు, అందుకుతోడు స్త్రీలకు విద్యాబుద్ధులు చెప్పించరనియు గృహకృత్యములకు వినియోగింతురేగాని వారికేపాటి నాగరికత లుండవనియు పాశ్చాత్యవ్రాతలు లేకపోలేదు ఇది యంతయు హిందువులపైని గల వారి ద్వేషభావమేగాని వేరుగాదు. స్త్రీలకు విద్య చెప్పించరనునదియు చాలా పొరబడి చెప్పినపలుకులేగాని వేరుగాదు.

ప్రాచీనకాలమున స్త్రీలు చదివినవారేగాన చదవనివారులేరు. రామాయణమున సీత విద్యావతిగ వర్ణింపబడినది, భారతమున ద్రౌపది విద్యావతి, రాచ కార్యములలో చతురతగలది భాగవతమున రుక్మిణీ సత్యభామలు విద్యావతులే. ఈ రీతిని పురాణ సాహిత్యమున స్త్రిలెందరో విద్యవతులుగ వర్ణింపబడిన భాగాలు కోకొల్లలుగగలవు.

ఇంక కావ్యనాటకాలలోని నాయికలు గొప్ప విద్యా వీనయ రూప రేఖావతులుగా నాయాకవులు వర్ణించియున్నారు.

పార్వతీదేవి బాల్యమున విద్య నేర్చుచుండగ నామెకు విన్నమాత్రముననే విద్య వచ్చునట్లు కాళిదాసు ''ప్రపేదిరేప్రాక్తన జన్మవిద్యా''యని స్పష్టముగ వచించియున్నాడు. ఈ రీతిని కవులెల్లరు వారివారి కావ్యాలలోని నాయికలు గొప్ప విద్యావతులుగ వచించియున్నారు.

హంపీ విద్యానగరరాజులైన హరిహర బుక్క రాయుల కాలమున స్త్రీలు విద్యావతులైన కావ్యములను వ్రాయుచుండినట్లు చరిత్రలు ఋజువు చేయుచున్నవి.

హంపీ విద్యానగరపు రెండవరాజైన వీరబుక్కరాయల పుత్రుడు కంపరాయలనిగలడు,

ఇతని భార్య గంగాదేవి 'మధురావిజయ'మను పేర సంస్కృత కావ్యము వ్రాసియున్నది. ఆనాటి రోజులలో నెందరో విద్యావతులున్నట్లుగలదు.

ఇట్లుండగ మన ప్రాచీన రాజులు నశించి మొగలాయులను తురుష్క ప్రభువులు పాలించుకాలమున దేశాక్రమణాదులు మతాంతీకరణములు బలవంతముగ స్త్రిహరణములు దేశమున జరుగు దుఃస్థితి దాపురించినది. అట్టి కాలమున పురుషుడు బయటకి వెళ్ళి మరలా ఇంటికివచ్చు వరకూ సందేహముగనుండిన కాలమయ్యది. అట్టికాలమున స్త్రీలను వెలుపలకు పంపడమెంతో బాథాకరము, కాన నాటి దుఃస్థితి ననుసరించి పురుషులకే సరిగ విద్య నేర్వదగిన కాలముగ నుండని రోజులవ్వి. అట్టి కాలమున స్త్రీలకు విద్య నేర్ప వీలుండెడిదికాదు. అనంతరము వీరిని తరిమి పాశ్చాత్యులు పాలకులైరి. వీరు వచ్చి మనదేశపు పూర్వపు స్థితి తెలియనివారగుటచే స్త్రీలకు విద్య నేర్పరేమోయని భ్రాంతిబడిరి.

వారి పరిపాలనకాలమున నందందు స్కూళ్ళున్ననూ సాహసించి ధైర్యముగ స్త్రీలను బయటికి పంపించుటకు బయపడుచుండిరి. ప్రకృతము రానురాను కొంత స్ధిమితము జెందినవారము గాన పూర్వమువలె నేడు గూడ స్త్రిలకు విద్యనేర్పుటకెవ్వరు వెనుకాడడములేదు. గాన నేడు సమాజమున స్త్రిలు విద్యాబుద్ధులు నేర్చి పురుషులకు చేదోడువాదోడుగ మెలంగదగు నవకాశములున్నవిగాన స్త్రిలు తప్పక విద్యాబుద్ధులు గలి మొలంగుట యుక్తము.

మన సమాజమున పూర్వముగూడ స్త్రిలనెంతో ఘనముగ గౌరవించుచుండిరి. అందుకు నిదర్శనముగ

యత్రనార్యస్తుపూజ్యంతే రమంతే తత్రదౌవతాః

యత్రైతాస్తునపూజ్యంతే సర్వాస్తత్రా ఫలాఃక్రియాః

ఎందు స్త్రిలు గౌరవింపబడుదురో నందు దేవతలానందింతురు. ఎందుస్త్రిలు గౌరవింపబడరో నందు ఫలితముండనేరదు.

తస్మాదేతాః సదాభ్యర్చా భూషణాచ్ఛాదనాశ##నైః

భూతాకామైః నరైర్నిత్యం సత్కారే షూత్కవేషుచ.

అనురీతిని స్త్రిల నెల్లప్పుడు వస్త్రభూషణాదులతో గౌరవింపదగినది. గౌరవాదులచేతను, ఉత్సవాదులచేతను సంపదనాశించు మానవుడు యెల్లప్పుడు స్త్రిలను గౌరవింపవలయును, ఈరీతిని పురాణాదులలో నందందు స్త్రిలను గౌరవింపవలసినదని చెప్పిన భాగాలు మెండుగగలవు. ఇట్లు గృహస్తుడైనవాడు స్త్రిలను గౌరవించుచు గృహస్థధర్మమును పాటింపవలయును.

గృహస్థుడైనవాడు అనగా వివాహమాడినవాడు

'దయాలజ్జాక్షమాశ్రద్ధాప్రజ్ఞాత్యాగః కృతజ్ఞతా

ఏతేయస్యగుణాస్సన్తి గృహస్థోముఖ్య ఉచ్యతే'

అను రీతిని దయాగుణమలవరచు కొనవలయును, సర్వప్రాణులయందు దయజూపుటయే దయాగుణము.

(2) లజ్జ - సిగ్గుబడుట, తన కేమి తెలియదనియు తానేమిజేసిన గొప్పగ నెవరికి మేలుగల్గురీతిని చేయలేకపోవుచున్నానేయనియు సిగ్గుబడదగియున్నది.

(3) క్షమా - ఓర్పు - ఏ కార్యమునేని త్వరబడి చేయకయు నెవరేమనిన త్వరబడకయు ఓర్పుజెందుట ముఖ్యము.

(4) శ్రద్ధ - కార్యములయందు విశ్వాసమున్న నా కార్యమంత గొప్పగ నెరవేరదు.

(5) ప్రజ్ఞా - బుద్థి విశేషము - నవనవోన్మేషఃప్రజ్ఞా అనురీతిని అప్పటికప్పుడు బుద్ధిలోగల్గు నూహలకే ప్రజ్ఞయందురు. 'ప్రజ్ఞ దైవదత్తమందురు. దైవానుగ్రమున్ననే బుద్ధిలో నూహలు గల్గునందురు.

(6) త్యాగః - ఉన్నసంపదను త్యజించుట అనగా, తనకున్నంతలో దానధర్మాలకై సంపద వినియోగము త్యాగము. త్యాగగుణము లేకున్నచో లోభియందురు. లోభివానికి కీర్తి ప్రతిష్ఠలు సన్నగిల్లును. త్యాగికి రోకమున గౌరవ మర్యాదలినుమడించును.

(7) కృతజ్ఞత - చేసిన మేలును మరవక గుర్తించుకొని ప్రవర్తించుటకు కృతజ్ఞతయందరు. ఈయేడుగుణములు ఖ్యాతి ముఖ్యములు గాన గృహస్థుడు తప్పక నీ సప్తగుణములు అలవరచుకొనవలయును.

యథానదీనదాః సర్వేసాగరేయాంతి సంస్థితిం

తదైవాశ్రమిణః సర్వేగృహస్థేయాన్తి సంస్థితిం.

అనురీతిని నదులుగాని, నదములుగాని సముద్రమును చేరునట్లు అందరూ గృహస్థు నాశ్రయించి జీవింతురు గాన గృహస్ధు శ్రేష్ఠుడు.

'ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మంత్రమౌషధ సంగమం

దానమానావమానాని నవగోప్యాని కారయేత్‌'

అనురీతిని ఆయుస్సు సంపద తన యింటిబాధలు తానొనర్చు రహస్యాలోచనలు తాను గైకొను మందులు భార్యా భర్తల సంగమము తానిచ్చు దానములు తన గౌరవము తన యవమానము అను తొమ్మిదింటిని గృహస్థుడైనవాడు వెల్లడి జేయరాదు.

'దయా సర్వ భూతేషు క్షాన్తి రనసూయా శౌచమనా

యాసో మంగళమకార్పణ్యమస్పృహేత్యాదికుర్యాత్‌'

ప్రాణులయందు దయదలచడము (కనికరము చూపడము) ఓర్పు వహించడము అసూయ జెందకుండుట పరిశుభ్రతను పాటించుట శారీరకముగను మానసికముగను శ్రమజెందకుండుట శుభ##మైన కార్యములను చేయుచుండుట యథాశక్తిని కొంచమేనియు దానమొసంగుటయు పరుల సంపద నాశించకుండుట యనబడు మానవ సామాన్య ధర్మములను గహస్థుడు తప్పక యలవరచుకోవలయును.

'న్యాయాగత థనేన కర్మాణికుర్యాత్‌'

న్యాయముగ ధన సంపాదన చేయవలయును. ఆరీతిని న్యాయార్జిత ధనము చెతనే దైవకార్యాదులు చేయవలయును.

'ఆపత్కాలే అసాదుభ్యః ప్రతిగృహ్ణీయాత్‌'

అను ధర్మమున్నది గాన ఆపదలు గల్గిన సమయమున (కష్టకాలమున) దుర్మార్గులనుండియు ధనము గ్రహింపవచ్చును.

''విహితాకరణ ప్రతిషిద్ధసేవనే నరకపాతః''

అని యున్నది గాన తనకు నిర్ణయించిన కార్యములాచరించ కుండడము నిర్ణయించనట్టి పనులు చేయడం చేతను నరకప్రాప్తి కల్గుచున్నదది ధర్మవచనములున్నవి గాన గృహస్ధుడైనవాడు తప్పక తనధర్మములను ఆచరించు చుండవలయును.

'ఏవంకుర్వన్‌ దృష్ట మదృష్టంచ ఫలంలభేత్‌'

అనియున్న ధర్మాన్ని పురస్కరించుకొని మానవు లీ రీతిని ధర్మవంతులుగా మెలంగుదురేని ప్రత్యక్షముగ కీర్త్యాదుల ఫలితము పరోక్షముగ స్వర్గ లోకాది సుఖములు పొందగలరు కాన తప్పక ధర్మవంతముగ మెలంగుటకై ప్రయత్నించవలయును. కనుక, తొలుత ఆత్మగుణమువలన దగిన, ఎనిమిదింటిని ప్రతిస్త్రీయు ప్రతిపురుషుడు, గుర్తించి, మెలంగుదురేని వారికి సమస్త ఫలితములు గలుగ గలవు గాన,

(1) దయాగుణమును తొలుత యలవరపరచుకోవలయును.

(2) క్షాంతియనబడు, గుడము, అనగా ఓర్పు చెంది మెలంగడము ఏ కార్యమునందైననూ త్వరబడక ప్రశాంతముగ నుండడమలవరచుకోవలయును.

(3) అనసూయా = ఇతరులలోని సద్గుణములకు అసూయబడక వారి సద్గుణముల కానందించుటయే. అనసూయ యనబడును. అనగా నితరులనుచూచి అసూయబడకుండడము.

(4) శౌచము = శారీరకశౌచము, మానసిక శౌచము అని శౌచము రెండు విధములు, శరీరము పరిశుద్ధముగ నుంచుకొనడము శారీరక శౌచము. మనస్సులో నేలాంటి క్రోధద్వేషా శూయాదులు లేక పరిశుద్ధమైన మనస్సుతో మెలంగుట మానశిక శౌచము. శౌచం సంకరవర్జనం అనురీతిని దుష్టులతో చేరడము, తినరానిపదార్థములను తినికుండడము గూడ శౌచనాధిలో చేరును.

(5) అనసూయాసః = శారీరకముగను మానసికముగను అలసట జెందడము. కష్టపెట్టడమువంటి పనులు చేయకుండడమే అనాయాసమనబడును.

(6) మాంగల్యం = నిందింపబడు కార్యములను చేయకుండడము, శుభకరమైన పనులు చేయడము మాంగల్యమనబడును.

(7) అకార్పణ్యము = లోభితనముచూపక, తగినవారికి యోగ్యులైనవారికి, శక్తికొలది భక్తితోనిచ్చు దానాదులు అకార్పణ్యములగును.

(8) అస్పృహ - ఇతరుల సంపదనాసించక మెలంగుట కస్పృహయనబడును.

ఈ రీతిని మానవులు, (స్త్రిలు - పురుషులు) దయా, క్షాంతి, అనసూయ, శౌచ, అనాయాస, మాంగల్య, అకార్పణ్య అస్పృహలను, విధిగ నలవరచుకొని మెలంగినచో నుత్తమజీవితము. నుత్తమ మానవత్వము నలవడగలదు.

ఈ యెన్మిది యాత్మగుణములు యలవరచుకొని మెలంగువారికి ''బ్రహ్మణః సాయుజ్యం సౌలోక్యంచగచ్ఛతి'' అను విధిప్రకారము బ్రహ్మసాయుజ్య పదవిని సులభముగ నందుకోగలరు గాన, మానవులీ చెప్పిన, ఎన్మిది మానసిక గుణములు తప్పక నలవాటులోనికి తెచ్చుకొదగియున్నది.

ఈ చెప్పిన మానసిక సంబంధమైన యెన్మిది గుణములున్నవారే యుత్తములు. వీనిలో నేదికొరవడిననూ, నీచత్వమునకు దారితియ్యగలదు గాన, బాల్యమునుంచే నీ గుణాష్టకము తమ జీవితమున నలవాటు లోనికి నుండులాగున నలవరచుకొన వలయును.

''అనుకూల్యం కళత్రస్య స్వర్గోభవతి నిశ్చితం|

ప్రాతికూల్యం కళత్రస్య నరకోనాత్ర సంశయః||

అనురీతిని, యీ మానసికాష్టగుణములు నేర్చినవారై - భార్యా భర్తలన్యోన్యాను రాగముతో మెలంగుచుందురేని, వారిజీవితము స్వర్గతుల్యముగ నుండగలదు, భార్య యనుకూలవతిగ లేకపోయినచో వారి గృహస్ధజీవనము నరకలోకముగ నుండగలదు గాన, ఈ యనుకూల ప్రతికూలములు మనస్సునకు సంబంధించి యుండును గాన, మనస్సు పశిశుద్ధ పరచుకొని యీ చెప్పిన యెన్మిదిగుణములు నలవరచుకొనినచో స్త్రిపురుషులు సుఖజీవనము కారణభూతులు కాగలరు.

''అనుకూలా సదాహ్రష్టా, దక్షా సాధ్వీ, ప్రజాపతీ|

ఏఖరేవ గుణౖర్యుక్తా శ్రరేన, స్త్రి నసంశయః||

అనురీతిని యీ చెప్పిన దయాది యెన్మిది గుణములు నేర్చినదై, భర్త కనుకూలవతిగ మెలంగుచు, యెల్లప్పుడు సంతోషముతో గూడినదై నేర్పరురాలై, మంచినడత గల్గినదై, సంతానవతియైయున్న స్త్రి నిజముగ శ్రయనగగును. అనగా లక్ష్మీదేవియే యనబడగలదు. ఆనాడే యా స్త్రి గృహలక్ష్మి యని పిలువబడుటకు తగిన యర్హతగల్గి యుండును.

''ధర్మోమిత్రం ప్రమీతస్య, విద్యామిత్రం ప్రవాసినః|

భార్యామిత్రం గృహస్థ్య, దానంమిత్రం మరిష్యతః||

అనునట్లు గృహస్ధుడైనవానికి పెండ్లియాడిన భార్యయే, మిత్రునివలె, యుక్తా యుక్తములు నేర్పసమర్ధురాలై యుండును గాన, సర్వదా భర్తను, స్నేహితుడు కాపాడుచుండులాగున కాపాడుచుండదగినది. యీ రీతిని వివాహమైనపిదప, నూతన దంపతులు గార్హస్థ్య జీవనమునకు తగిన, మానసికాష్ట లక్షణమునను నెరింగి, సాంసారికి జీవనమునకు గడంగి, విద్యా, కుల, రూప, విభవ, విత్తమర్యాదలకు తగినరీతిని జీవయాత్ర గడపదగి యున్నది. స్వేచ్ఛాప్రియులై మెలంగదగదు, ధార్మిక జీవనమలవరచుకోవలయును. నీతి నిజాయితీగల్గి మెలంగవలయును. ఉన్నతాదర్శములు, ఉన్నతాశయములుగలిసి, ఉన్నతత్వము చూఱగొన మెలంగవలయును. అందుకై ధార్మిక జీవనమత్యవసరమై యున్నది. అనగా తమ జీవితమును ధర్మబద్ధముగ జేసికొని మెలంగవలయును. అందుకాచరింపదగిన విధులు దినచర్యక్రింద నీరీతిని వివరించి యున్నారు. కాన దినచర్య సక్రమముగ నలవరచుకొనినచో ధర్మబద్ధమైన జీవనము అలవడనేయలవడగలదు. అందులకై, గృహస్ధలైన వారీ రీతిని దినచర్య నలవరచుకోదగినది. ఈ రీతిని యలవరజేసికొను విథులకే సదాచారమనియు నందురు. ''సదాచార వతాంనహానిః'' యనియు పెద్దలవచనము. అనగా సదాచారపరులకు యెన్నటికిని హానియుండదు. ''విహితాచార విహీనేషు, క్షిప్రంనశ్యతి వైకులమ్‌'' అనియు పెద్దల తలంపు అనగా నిర్ణయించియున్న ఆచారవిధులు సక్రమముగ పాటించనివారు వారి వంశము గూడ, త్వరరోనే నశించగలదనియు నున్నది గాన, గృహస్ధులైన వారెల్లరు వారి వారికి తగిన సదాచారవీథులు తప్పక యలవరచుకొని మెలంగుట శ్రేయస్కరము. ఎందుకనగా యీ కాలమున (యీ కలియుగమున) ప్రతివారు ఆచారహీనులై నశింతురనే శాస్త్రప్రమాణాలు గలవు.

''అత్యన్తః దుఃఖినః కేచిత్‌, కేచిత్‌ అతిధనాస్తదా|

ప్రతిగ్రహే బ్రాహ్మణాశ్చ కదాచిత్‌ కుర్వతౌ స్పృహమ్‌||

కొందరు మిక్కిలి ధనవంతులై విఱ్ఱవీగు చుందురు. బ్రహ్మణులు దానధర్మము లెవ్వరిత్తురాయని యాసించుకొని యుందురు, కనుక యీ కాలమున

''సర్వె పాపరతాః సర్వె పాపపరాయణాః

నిజాచార విహీనాశ్చ భవిష్యన్తి కలౌయుగౌ||

అందరు పాపపుపనులే జేతురు. పాపకార్యములకు తలపోయుదురు తమ కులధర్మమునకు తగిన ఆచారాదులు వదలివేసినవారై మెలంగు చుందురు. మరియు

''విప్రాః వేదవిహీనాశ్చ ప్రతిగ్రహ పరాయణాః

అత్యన్త కామనః క్రూరాః భవిష్యన్తి కలౌయుగే||

యీ కాలమున బ్రాహ్మణులు వేదము చదువుటను మానివేయుదురు. ఇతరులు యిచ్చుదానాలకు ఆశింతురు, మిక్కిలి క్రూరులై కాముకులై మెలంగగలరు. ఇంకయు

''పరాన్నలోలుపాః నిత్యం తపోవ్రత వరాజ్ముఖాః

పాషండ సంగలుబ్ధాశ్చ భవిష్యన్తి కలౌయుగే||

ఇతరుల యింటి భోజనానాకి యాశించుకొని యుందురు. తపస్సు, వ్రత పూజాదులు మానివేయుదురు. నీచులతో గూడి మెలంగు చుండగలరు.

మఱియు 'ఉత్తమా అపినీచతాం' గొప్పవారెల్లరు నీచులు కాగలరు. 'నీచాశ్చధన సంపన్నాః' నీచులు ధనవంతులు కాగలరు, ఇంకయు గూడ ''యాస్త్యన్త్యుచ్చ పదంప్రతి'' యను విధిచొప్పున ఉన్నతపదవులనుగూడ పొందగలరు.

అయిననూ ''అధర్మబుద్థి దాతారః, ధర్మబుద్ధి విరోపినః'' అను రీతిని, అధర్మమున మెలంగుచుండువారై, ధర్మబుద్ధిలేనివారై, పోగలరు, ఇంకయు గూడా -

'పరోక్ష నిందకాః క్రూరా; సంముఖః ప్రియవాదినః|

పరవిత్తాభిలాషిణః|| అను విథిప్రకాము, చాటున దూషింతురు ఎదుట పొగడుచుందురు. ఇతరుల సంపద హరించుటకై యాశించు చుందురు. అందుచే మనస్సు పరిశుద్ధములేక, పోవుదురు. 'మనఃశుద్ధి వివర్జితాః| మానసిక శుద్ధిలేనివారై క్రూరులు కాగలరు, అందుచే, ధర్మబుద్ధిలేక 'స్త్రి పరాశ్చజనాః' అనురీతిని, స్త్రివ్యామోహముగలవారై, తమ తమ విథులు సక్రమముగ నెరవేర్చలేనివారు కాగలరు. చివరకు చనిపోయిన తలిదండ్రులకు ఉత్తరక్రియలు చేయలేక, కరిష్యన్తి కలౌ ప్రాప్తెనచ పిండోదనక క్రియాం' అనునట్లు యీ కాలమున చనిపోయినవార్లకు పిండోదక క్రియలనదగు తద్దినములు తర్పణములుగూడ విడువనొల్లక, కేవలము, నీచబుద్ధితో ధర్మదూరులై మెలంగు చుందురని శాస్త్రప్రమాణములు మెండుగగలవు గాన, ప్రతివారు తమథర్మమును తమవిథిని, తమ వంశముయెక్క గొప్పదనమును, తామున్నత సాంప్రదాయాలు గల్గి మెలంగు విధిని గుర్తింప నెంతేని యవసరమున్నదని హెచ్చరింతును. కాన ప్రతియొక్కరుతమధర్మమును విధినిగుర్తింతురుగాక, అందుకై నిత్యము బ్రాహ్మీముహూర్తమున తొలుత నిద్దురనుంచి మేలుకొనడము నేర్వదగియున్నది. ఈ కాలమున ప్రతియొక్కరు సుఖమెక్కువ యాశించినవారగుటచే తెల్లవారుఝామున నిద్దుర లేవడమునకు సోమరితనము జూపుచుందురు. చాలామంది సూర్యోదయమైనపిదపగాని నిద్దుర లేవరు. ఇది చాలా దురాచారము, మిక్కిని అనారోగ్యకరము, అని ప్రతియొక్కరు గుర్తించి బ్రాహ్మి ముహూర్తమున (తెల్లవారుఝామున) అనగా సూర్యోదయానికి రెండుగంటలు మునుపు (తెల్లవారుఝామున 4 గంటు లేక 4-30 నిమిషములకు) విధిగ నిద్దుర లేవవలయునని శాస్త్రప్రమాణము పూర్వకాలమునగల పెద్దల యలవాటుగూడాను.

బ్రాహ్మీ ముహూర్తె ఉత్థాయ చింతయే దాత్మనోహితం| గురుం విష్ణుం నమస్కృత్య మాతరంపితరంతథా' అని శాస్త్రప్రమాణము ప్రకారము బ్రాహ్మి ముహూర్తమనదగిన తెల్లవారుఝామున 4 గంటల కాలమున నిద్దురలేచి మనస్సును ప్రశాంతముగనుంచుకొని గురువును, విష్ణువును స్మరించుకొని తలిదండ్రులకు నమస్కరించి లేవదగినదియని శాస్త్రప్రమాణము, అందుచేతనే పూర్వమున్న పెద్దలు గజేంద్రమోక్షము సుప్రభాతములు ఇతరములైన పద్యములు కంఠస్తమొనర్చుకొని తెల్లవారుఝామున బిగ్గరగ పఠించుచు, పాడుకొనును ప్రశాంతమైన మనస్సు గలవారై మెలంగుచుండిరి.

యీ బ్రాహ్మీముహూర్త కాలమనదగు తెల్లవారుఝామున నాలుగంటల సమయమతి ప్రశస్తమైనకాలము ఎందుకనగా-

'బ్రాహ్మీముహూర్తె దేవానాం, పితృణాంచ సమాగమ|

జాగరస్తత్ర కర్తవ్య: పితృసంమాన సంహితత్‌||

యీ బ్రాహ్మీముహూర్త కాలమున దేవతలు, పితృదేవతలు, కలసి యుందురు. కాన, మనము తప్పక మేలుకొని దేవతాప్రార్ధనలు చేయుచుండినచో మిక్కిలి యానందించి యనుగ్రహింతురు. అట్లు నిదుర లేక గృహస్తులైన దంపతులు (భార్యాభర్తలు) కలసి నిదురించు తుంటినచో నాయుల్లు త్వరలో నశించి ''శ్మశానమువలె'' పాడుబడును.

'బ్రాహ్మీముహూర్తే సేవేతాం: శమనంయప్ర దంపతీ|

శ్మశానతుంల్య తద్వేశ్మ పితృఖః పరివర్జ్యతే||

అను ధర్మము ప్రకారము బ్రాహ్మీముహూర్త కాలమున భార్యాభర్తలుకలసి నిదురించునెడల నాయిల్లు శ్మశానము కాగలదు, 'అనర్హః సర్వకర్మను' అనులాగున, ఆదినమంతయు, ఏ యొక్క మంచికార్యములకు వారు అనర్హులై నశింతురు. మరియు 'బ్రాహ్మీముహూర్తే యానిద్రా సాపుణ్యక్షయకారిణీ' యని ధర్మమున్నది గాన, బ్రాహ్మీముహూర్తకాలమున మేలుకొనక నిదురించునెడల వారు వారు చేసికొనిన పుణ్యము సర్వము నశించగలదు. అందుకే బ్రాహ్మీ ముహూర్తకాలమున నిదురించడము మహాదోషము కావడమేగాక, ఆ సమయమున లేనియుంటి దైవ ప్రార్థనాదులు చేయక, ఈ చెప్పబము పనులు చేయుదురని తప్పక వారి వారి కాయాదోషములు సంప్రాప్తించగలదు.

అందుచేత 'చత్వారీమాని కర్మాణి, సంధ్యాయాం పరివర్జయేత్‌|

ఆహారం, మైథునం నిద్రాం, స్వాధ్యాయంచ తధైవచ, ఈ నాల్గు పనులు అనగా, ఆ బ్రాహ్మిముహూర్త కాలమనదగు తెల్లవారుఝామున నాల్గుగంటల కాలమున, ఆహారము భుజించరాదు. భార్యా భర్తలు, సంగమింపరాదు, నిదురించు చుండరాదు. వేదశాస్త్రాదులు చదువుచుండదగదు.

'ఆహారాజ్జాయతే వ్యాధిః| ఆహారము భుజించినచో రోగము తప్పక రాగలదు.

'గర్భవేధశ్చ మైథునాత్‌'' భార్తా భర్తలు సంగమించినచో, గర్భ బాధలు మెండుగలుగ గలదు.

'నిద్రతో జాయతే లక్ష్మీః' నిదురింతురే నీ దరిద్రము తాండవించగలదు.

'స్వాథ్యాయా దాయషఃక్షయః' వేదశాస్త్రములు చదువుచున్నచో నాయుస్సు క్షీణించును. కాన, బ్రాహ్మిముహూర్త కాలమున. స్త్రిపురుషులెల్లరు తప్పక నిద్రమేలుకొని, దైవప్రార్థన చేసికొను చుండుట మిక్కిలి శ్రేయస్కరము, అట్లు నిదుర మేలుకొనక సూర్యోదయ పర్యంతముగాని, సూర్యోదయమైన పిదపగాని, నిదుర మేల్కొను వారులు మహాపాపవంతులై సర్వకార్యములకు అనర్హులై నశింతురు గాన, గృహస్థులు, అభివృద్ధి జెందతలంతురు గాన - బ్రాహ్మిముహూర్తకాలమున తప్పక నీదురమేల్కొని దైవధ్యాన పరాయణులు అగుదురు గాక, ఈ రీతిని బ్రాహ్మిముహూర్తమున నిదురలేచి యీ చెప్పబడు ప్రార్ధన శ్లోకములు నిత్యము పఠింతురుగాక. ధర్మశాస్త్రకారులీ సుప్రభాత శ్లోకములు పఠింపవలసినదనియు నిర్ణయించి యున్నారు.

శ్లో|| బ్రహ్మమురారి స్త్రిపురాంత కోగ్నిః|

భానుశ్శశీ భూమిసుతో బుధశ్చ|

గురుశ్చ శుక్రఃశని రాహు కేతవః|

కుర్వన్తు సర్వేమమ సుప్రభాతం|

తా|| బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అగ్ని సూర్యుడు, కుజుడు, గురువు శుక్ర శని రాహు కేతువులు ఈ ప్రభాతకాలమును, నాకు సుప్రభాతమగులాగున చేయుదురు గాక.

శ్లో|| భృగుర్వశిష్ఠః క్రతురంగి రాశ్చ|

మమః పులస్త్యః పులహస్త గౌతమః|

రై భ్యోమరీచిః చ్యవనోధ దక్షః|

కుర్వస్తు సర్వేమమ సుప్రభాతమ్‌

తా|| భృగువు వశిష్ఠిడు, క్రతువు అంగిరసుడు మనువు పులస్త్యుడు పలహస్తుడు గౌతముడు రైభ్యుడు మరీచి చ్యవనుడు దక్షుడు మొదలగు మహనీయులు నాకు మంచి ప్రభాతమగులాగున యనుగ్రహింతురు గాక.

శ్లో|| సనత్కు మారశ్చ సనందనశ్చ|

సనాతనో ప్యాసురి సింహలౌచ|

సప్త స్వరాఃసప్త రసాతలాని|

కుర్వన్తు సర్వేమమ సుప్రభాతమ్‌||

తా|| సనన్కుమారుడు సనందనుడు సనాతనుడు, ప్యాసురి, సింహలుడు సప్తస్వరములు సప్తరసాతలములు యీ ప్రభాతమును సుభప్రదమగులాగున నన్ను ఆశీర్వదింతురు గాక

శ్లో|| సప్తార్ణవాః సప్త కులాచలాశ్చ|

సప్తర్షయో ద్వీపవనాని సప్త||

భూరాధిలోకాః భువనానిసప్త|

కుర్వన్తు సర్వేమమ సుప్రభాతమ్‌||

తా|| సప్తసముద్రములు, సప్తకుల పర్వతములు, సప్తఋషులు సప్తద్వీపములు, భూరాదిసప్తలోకములు నాకు సప్రభాతము అగులాగున యనుగ్రహించు గాక

శో|| పృథ్వీసగంధా సరసాస్తదావః|

స్పర్శచవాయుః జ్వలితంచతేజః|

సభస్సశబ్దం మహతాసహైవ|

కుర్వన్తు సర్వెమమ సుప్రభాతమ్‌|

శో|| ఇత్థం ప్రభాతే పరమం పవిత్రం|

పఠేత్స్మరేద్వా శృణుయేశ్చ షక్త్యా|

దు స్వప్ననాశస్త్విహ సుప్రభాతం

భ##వేచ్చ నిత్యం భగవత్ప్రసాదత్‌|

తా|| యీరీతిని ప్రభాతకాలమున యీ శ్లోకములు పఠించిననూ, స్మరించిననూ వినిననూ వారికిగల్గిన, చెడుకలలు నశించును. భగవంతుని కరుణతో వారికి సుప్రభాతము కాగలదు.

శ్లో|| మహాభారత మాఖ్యానం

క్షితిం గాంచి సరస్వతీం

బ్రాహ్మణాన్‌ కేశవంచైవ

ప్రాతరుత్ధాయ కీర్తయేత్‌||

తా|| ఉదయకాలమున నిద్దుర లేచిన వెంటనే, మహాబారతమును భూదేవిని, గోవులను, సరస్వతీదేవిని, మంచి బ్రాహ్మణోత్తములను, విష్ణువును కీర్తించవలయును.

శ్లో|| బ్రహ్మాణం శంకరం విష్ణుం

యమం రామందనుం బలిమ్‌

సపైతాన్‌ సంస్మరేన్నిత్యం

దుఃస్వప్నం తస్యనశ్యతి|

తా|| బ్రహ్మను శంకరుని విష్ణువును యముని శ్రీరాముని దనువు బలిని యీ యేడ్వురిని స్మరించినచో వానికి దుఃస్వప్నదోషము నశించును.

శో|| పుణ్యశ్లోకో నలోరాజు

పుణ్యశ్లోకో యథిష్ఠిరః

పుణ్యశ్లోకో హరిశ్చంద్రః

పుణ్యశ్లోకః పురూరవాః

పుణ్యశ్లోకాచ వైదేహి

పుణ్యశ్లోకో జనారనః

తా|| నలచక్రవర్తి పుణ్యవంతుడు, ధర్మరాజు పుణ్యవంతుడు, హరిశ్చంద్రుడు పుణ్యవంతుడు, పురూరవుడు పుణ్యవంతుడు సతీదేవి పుణ్యవంతురాలు, జనార్ధనుడు పుణ్యవంతుడు.

శ్లో|| కార్కోటక స్యనాగస్య

దమయంత్యా నవస్యచ

ఋతువర్ణస్య రాజర్షేః

కీర్తనం కలినాశనం|

కార్కోటకుడు, దమయంతి, నలమహారాజు, ఋతుపర్ణ చక్రవర్తి యను యీ నల్వురిని ప్రాతః కాలమున కీర్తించినచో సమస్తకలిదోషములు హంచును.

శ్లో ఉచ్చస్వరేణయః ప్రాతఃస్తోతు మిచ్ఛేదనన్యధీః

వాసుదేవాది దేవానాం, నామ్నః సంకీర్తనం చరేత్‌

ప్రాతః కాలమున బిగ్గరగ, ఏకాగ్రమనస్సుతో, వాసుదేవాది దేవతలనుగూర్చి కీర్తింపదగినది. యీ రీతిని బ్రాహ్మీముహూర్తమున దగిన సూర్యోదయాత్‌ పూర్వం 4 గంటలకుపైన 5 గంటలలోపున నిద్దురలేచినవారై యీ సుప్రభాతాన్ని పఠించినచో వారికి దైవానుగ్రహము గల్గుగలదు. అని శాస్త్రప్రమాణులు గలవు గాన ప్రతియొక్కరు (స్త్రిలు పురుషులు) ఉదయమున నిద్దుర 5 గంటలకేలేచి, యీ సుప్రబాతము పఠింతురు గాక.

అనంతరము కాలకృత్యములు తీర్చుకొని ప్రాతఃస్నానము చేయవలయునని శాస్త్రనిర్ణయము.

'స్నానం సంధ్యా జపో హోమో దేవతానాంచ పూజనం|

ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మాణి దినేదినే||

అని ప్రతివారు, 1 స్నానము 2 సంధ్యావందనము 3 అవము 4 హోమము, 5 దేవతార్చనము (దేవపూజ) 6 అతిథిపూజ 7 వైశ్వదేవము అను కార్యములు ప్రతిదినము చేయదగినది. అని పరాశరస్మృతి వచనము బ్రహ్మయజ్ఞముతో నీ చెప్పబడిన కార్యములు ఎనిమిది కాగలవు. ఈ యెన్మిది కార్యములు గృహస్థుడు ప్రతినిత్యము నెరవేర్చ దగినవి.

అనగా బ్రాహ్మణుడైనవాడు ప్రతినిత్యము సూర్యోదయమునకు మునుపు నాల్గు ఘడియలుండగ నిదురమేలుకొన వలయును. భగవంతుని ప్రాతఃస్మరణము చేయవలయును, కాలకృత్యములు నిర్వర్తించుకొని, ప్రాతఃస్నానము చేయవలయును.

ఈ రీతినే యితరులు అనుసరింపదగియున్నది. ఎందుకనగా 'అస్నాత్వా నా చ రేత్కర్మ' అని స్నానము చేయనిదే ఏ కార్యము చేయరాదని గలదు. యీ శరీరము అత్యంతమలినమైనది.

'అత్యన్త మలినః కాయః నవచ్ఛిద్ర సమన్నితః

స్రవత్యెవది వాదాత్రం ప్రాతఃస్నానం విశోధయేత్‌||

అను ధర్మము ప్రకారము ఈ శరీరము నవరంధ్రములతో గూడినదై, రాత్రింబవళ్లు మాలిన్యము, వెళ్ళబోయుచుండును కాన, ప్రాతఃకాలమున స్నానమొనర్చి శరీరమును పరిశుభ్రము చేసికొనుటచే పరిశుద్ధి యేర్పడును.

'ప్రాతఃస్నానం ప్రశంసంతి దృష్టాదృష్ట ఫలంహితత్‌

సర్వమర్హతి శుద్ధాత్మా ప్రాతఃస్నాయీ జపాదికమ్‌||

అని స్మతిరత్న మహోదధిలో చెప్పినరీతిని ప్రాతఃకాలముననే స్నానము చేసినచో, ప్రత్యక్ష ఫలితమువలన దగిన పరిశుద్ధము మానసిక ప్రశాంతతలు గల్గును. అదృష్ట ఫలితము లనదగిన పారమార్థిక శక్తులు చేకూరగలవు.

ప్రాతః మద్యాహ్నయోః స్నానం వానప్రస్థ గృహస్థయోః

అను రీతిని గృహస్థులు, వానప్రస్థులు, ప్రాతఃకాలముననూ, మధ్యాహ్న కాలముననూ, దినమునకు రెండు మారులు స్నానము చేయవలయును.

'యతెఃత్రిషవణం స్నానం' సకృచ్చ బ్రహ్మచారిణః'

అను రీతిని సన్యాసి మూడు వేళల స్నానము చేయవలయును బ్రహ్మచారి మాత్రము ప్రాతః కాలమున స్నానము చేయదగినది.

బ్రహ్మక్షత్ర విశాంచైవ మంత్రవత్స్నాన మిష్యతే

తూష్ణీమేవహి శూద్రస్య స్త్రిణాంచ కురునందన||

అను రీతిని బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు స్నానకాలమంత్రములు పఠించుచు స్నానమొనర్ప వలయును.

స్త్రిలు శూద్రులు మాత్రము మంత్రములు లేకనే స్నానము చేయవలసినది.

'ఉత్తమంతు నదీస్నానం తటాకేమధ్య మంస్మృతం

కూపన్నానంతు సామాన్యం భాండస్నానం పృథాభవవేత్‌||

ప్రాతఃకాలమున నదులలో స్నానము చేయడము 'ఉత్తమము చెరువులు కోనేరులు తటాకములలో స్నానము చేయడము మధ్యరకము, బావి (నువ్వి) వద్ద స్నానము చేయడము అథమము; కడవలో కుండలోదల నీళ్ళతో స్నానమొనర్చుట వృధాకాగలదు. అనగా ఫలితము శూన్యము.

నదిలో స్నానము చేయువారుగాని తటాకాదులలో స్నానము చేయువారుగాని, స్నానము చేయదగు విధమునుగూర్చి శాస్త్రకారు లీరీతిని నిర్ణయించి యున్నారు.

'తతో నదీం సమాగత్య గంగాధాన పురస్సరం|

నాభిమాత్ర జలేస్థిత్వాత్రివాదం స్నానమాచరేత్‌|

నాభిమాత్రే జలేస్థిత్వా కృత్వాకేశాన్‌ ద్విధాద్విజః

నిరుద్ధకర్ణనాసః త్రివారం మజ్జనం చరేత్‌||

నదీ సమీపమునకుచేరి, గంగాప్రార్థన చేయుచు, నదిలోనికి దిగి, నాభివరకుగల నీటిలోదిగి, మూడు మారులునీటిలో మునగవలయును. తలవెంట్రుకలు రెండు పాయలుగ చేసి, ముక్కు చెవులు, కండ్లు మూసుకొని ముమ్మారు స్నానము చేయవలయును. అనంతరము,

'సంకల్పసూక్త పఠనం, మార్జనం చాఘమర్షణమ్‌|

దేవాది తర్పణంచైవ, స్నానం పంచాంగ ముత్తమమ్‌|

అనురీతిని, మూడు మారులు నిదీలో మునిగిలేచిన పిదప, సంకల్పము చెప్పుకొనవలయును, అఘమర్షణ సూక్తములు చెప్పవలయును, మార్జనమంత్రములుచెప్పి ప్రోక్షించు కొనవలయును. సూక్తపఠనము చేయవలయును, దేవఋషి పితృలేర్పణములు చేయవలయాను. ఇట్లు 1. సంకల్పము, 2 సూక్తపఠనము, 3 మార్జనము, 4 అఘమర్షణ మంత్రపఠనము, 5 దేవాది తర్పణములుచేసి స్నానము (ప్రాతః కాల స్నానము అయిదు అంగములతో గూడి యుండును.

అనారోగ్యవంతులు ఉష్ణోదక స్నానము చేయదగినది. 'తీర్దాభావే తుకర్తవ్య ముష్ణోదకం'' అనురీతిని. నదులు తటాకాదులు లేనివారు, ఉష్ణోదక స్నానము చేయదగినది, ప్రతినిత్యము శిరఃస్నానమే చేయవలయును'

'నేత్రరోగే శిరోరోగే కషాదివ్యాధి పీడితః|

కంఠస్నానం ప్రకుర్వీత శిరస్నాన సమంహితత్‌

నిత్యంనైమిత్తి కంచైవక్రియాంగం మలకర్షణమ్‌||

నేత్రరోగులు, శిరోరోగులు, కఫ్రాదిరోగులు, కంఠస్నానమే చేయదగినది, నిత్యకార్యములు నైమిత్తక కార్యములు స్నానమొనర్చిననే చేయదగినది, జ్వరాది రోగపీడితులు మాత్రము స్నానము చేయక, మంత్రస్నానము, భస్మస్నానము, వంటివి చేయదగినది.

ప్రాతఃస్నాతు మశక్తస్య, రోగాద్యైర్వా భయాచ్చవా|

పూర్వవస్త్రం సముత్సృజ్య గౌణస్నానేన శుధ్యతి

అనారోగ్యవంతుడు కట్టిన వస్త్రమునువదలి వేరొకవస్త్రమును ధరించి, గౌణస్నాదములనదగిన, భస్మధారణము (భస్మస్నానం మంత్ర స్నానము (మంత్రములతో నీళ్లు చల్లుకొనుట) చేయదగినది, యీ స్నానమొనర్చినవారు మాత్రం 'సచకర్మ స్వనర్హస్యాత్‌'' అనురీతిని దేవపూజాది కార్యములను చేయుటకు అర్హులుగారు.

మఱియు ఎందైనా తీర్థయాత్రలకు (కాశీ మొదలైన) వెళ్ళినవారు మహానదులలో స్నానము చేయునెడ, తమ తండ్రి తాత ముత్తాతలుగూడ తరించవలయునని సంకల్పించి స్నానముచేసినచో వారికి ద్వాదశాంశఫలితము రాగలదని శాస్త్ర ప్రమాణమున్నది.

పితరం మాతరం వాపిభ్రాతరం సుహృదంగురుం|

మజ్జయేద్యం సముద్దిశ్యద్వాద శాంశంలభేతసః||

తండ్రి - తల్లి - సోదరులు, స్నేహితులు గురువులను స్మరించుకొని మహానదులలో మహాతీర్థములలో స్నానముచేసినచో వారికి పండ్రెండవభాగము ఫలితము లభించును.

తత్ప్రార్థితే ష్వష్టమాంశం లభేత్‌ స్నాన ఫలంనరః

ఎవరైన తమకుబదులుగా మహానదులో స్నానముచేసి రమ్మని కోరిపంపినచో, నట్టివారికి, ఎనిమిదవ యంశము ఫలితము గల్గును.

ఇంకయు నెవరేని తమకు ప్రతినిధిగా స్నానముచెసి రమ్మనమని కోరిపంపినచో, నట్టివారికి, ఎనిమిదవ యంశము ఫలితము గల్గును.

ఇంకయు నెవరేని తమకు ప్రలినిధిగా స్నానము చేసిరమ్మనమని కోరినచో, దర్భలతో వారిపేరు చెప్పుచు ముడివేసికొని, నాదర్భలను, తీసికొనివెళ్ళి, వానితో గూడ స్నానము చెయవలయును, అట్టివారికిని అష్టమాంశఫలము గల్గును. అట్టి సమయమున ఈ శోకము పఠించుచు స్నానముచెయవలయును,

శ్లో|| కుశోసిత్వం పవిత్రోసి, బ్రహ్మణా నిర్మితాః పురా|

త్వయీస్నాతే సతుస్నాతో యస్యెదంగ్రంధి బంధనం,

అని ఈ మంత్రమును పఠింపుచు స్నానము చేసినచో నెవరినుద్దేశించి స్నానమొనర్చినవారికి అష్టమాంశ ఫలితము చెకూరగలదని శాస్త్రవచనములు గలవు. పెద్దల ఆచారములుగలవు. స్నానమొనర్చిన పిదప శరీగము తుడుచుకొని వస్త్రధారణము చేయవలెను.

శరీరమును తుడుచుకొనుటలో నీ నియమములను పాటింపవలయును,

శ్లో|| స్నాతో నాంగాని నిమృజేత్‌, స్నానశాట్యాన పాణినా|

అన్యేనై కేన వస్త్రేణ నితిష్ఠతి న్పరిమార్జయేత్‌|

స్నానముచేసిన పిదప వేరొక వస్త్రముతో శరీరము తుడుచుకోవలయునుగాని, చేతులతో వళ్ళు అనగా వట్టిచేతులతో తుడుచుకొనరాదు, స్నానము చేయునప్పుడు కట్టుకొనియున్న వస్త్రముతోనే తుడుచుకొనరాదు.

'దగ్ధం జీర్ణం, చమలినం మూషకోప హతంతధా|

ఖాదితం గోమహిష్యాద్యైః తత్యాజ్యం సర్వధాద్విజైః

కాలినవస్త్రము, చినిగిన వస్త్రము, మలినముగనున్న వస్త్రము, పశువులు నమిలిన వస్త్రము, ఎలకలు కొరికిన వస్త్రము, ధరించరాదు.

'కర్తవ్య ముత్తరంవాసం: అనురీతిని, పై పంచధరించనిది కట్టిన వస్త్రముతో, సేశుభకార్యాదులు చేయరాదు. అనగా, పంచకట్టుకొని, పైన వస్త్రము లేకుండా సంధ్యావందనాదులుగూడ చెయరాదు,

వికచ్చః, అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ|

నగ్నోమలిన వస్త్రస్యాత్‌, నగ్న శ్చార్ద్ర పటస్మృతః

గోచిపోసి ధరించినది వస్త్రముకట్టినచో, అపరిశుద్ధము నింద్యము ఆ రీతిని, పై వస్త్రములేనిదీ, మలినవస్త్రములు ధరించిననూ, తడివస్త్రములు ధరించిననూ, సంథ్యావందనాది యే కార్యములు చేసినను వ్యర్థమేగాని ఫలితము శూన్యము.

''సాగరం పర్వణిస్పృశేత్‌'' అనురీతిని సముద్రస్నానము, పౌర్ణమి అమావాశ్యలు అనదగు పర్వకాలములలో మాత్రము చేయదగినదేగాని, నిత్యము సముద్రస్నానము (దగ్గరగలవారు) చేయరాదు.

'ఉదయాస్తమయాది సమయే ఆదిత్యం నేక్షేతసర్వదా'

అను ధర్మము ననుసరించి సూర్యోదయ సమయమున సూర్యాస్తమయ సమయమున సూర్యబింబమును చూడరాదు. అట్లు చూచినవారికి ఆయుస్సు క్షీణించునందురు. నదులు, నదములు, కూపములు, తటాకములును గుర్తించు క్రమమును శాస్త్రకారులు వచించి యున్నారు,

'యాసా మహానదీజ్ఞేయం సర్వపాపప్రణాశినీ

ఉద్భూతాపూర్వ దిగ్భాగేశైలే సలిలసంతతిః||

అను రీతిని పర్వతములలోని జలధారలతో కూడినదై ప్రవహించు మహానది సర్వపాపములను పోగొట్టును గాన యిందు ప్రాతఃకాలమున స్నానదాన జపాదులు చేయువారి కనంత పుణ్యములు గల్గును.

'యాప్రత్యక్‌ సాగరంయాతి సానదస్త్వితి గద్యతే

పశ్చిమ సముద్రమున కలియు నీటిప్రవాహములకు నదములు అని పేరు ఇందు స్నానదానాదులు చేయువారికి మిక్కిలి పుణ్యప్రదము.

పర్వతస్యతటే వాగ్రేవృత్తాకారం జలాస్పదం

అశోష్యం యత్సరస్యాత్‌ ప్రవిశాలం సుపంకజం||

పర్వము నానుకొని విశాలముగ గుండ్రముగ నేర్వడిన మడుగునకు సరస్సు అందురు. ఇందు స్నానాదులు చెయుటయు శ్రేష్ఠమే.

భువ్యద్రేవా తలస్పరమశోష్యం యజ్ఞలాసయం,

విశాలమవిళాలంవా దేవఖా తమితిస్మృతః

భూతలమునగాని, పర్వత సానువులందుగాని, మిక్కిలి లోతైనవైయుండు మడుగును, నీరింకిపోనట్టివి, దేవఖాతములు అందురు అనగా దేవతలచే నిర్మితములుగాన, వీనియందును స్నానాదులు చేయదగును.

గ్రామార్థం వాసస్యార్థం వానృభిః సృష్టాంబుపద్ధతిః

యానద్యాద్యంబు ధామభ్యః తానాభ్యాం ప్రచక్షతౌ||

గ్రామ ప్రజలవాడుకకుగాని, పైర్లకుపయోగించుటకుగాని, నదీనీటిని, నిలువ జేయువానికి చెరువులందురు, ఇందు స్నానాదులు మధ్యమము

అర్ధచంద్రాకృతిర్యస్య సంస్థానస్యతు వారిణాం|

గ్రామేవనే పివాసైలే తత్తటాఇతిస్మృత;

గ్రామమువద్దగాని, అర్యణ్యాదులలోగాని, అర్ధచంద్రాకృతిగ నీటి నిలుపగలవానిని తటాకములందురు, ఇందు స్నానాదులు చేయదగును,

'చతురశ్రం శిలాబద్ధం, ససోపాన మధోజలం|

విశాలమవిశాలంవా యత్తత్కుండ మితిన్మృతం|

చదరముగ, రాళ్ళతో కట్టబడియుండి, దిగుటకు తాపలుగల, విశాలమైనదిగాని, లేనిదిగాని యున్న భావివంటి నీటిపట్టులకు, కుండ మందురు.

'గిరిరంధ్రాద్వి నిర్గత్య, యాపతత్యంబు సంతతిః

అనాభార మధొభూమే, సాధా రేత్యభిదీయతే||

కొండబిలములలోనుంచి, యెడతెగని ధారగా భూమిమీద పడునీటిప్రవాహమునకు, 'ధారా' యందరు, (మహానందిరో వచ్చునీటి ధారవలె)

పంచహస్త విశాలంయత్‌ ఖాతంవృత్తమ ధోజలం|

దార్విష్టకాది ఘటితం, యత్తత్కూప ఇతిస్మృతమ్‌||

అయిదుహస్తముల ప్రమాణ గల్గియుంటి, గుంత కొట్టబండియుంటి రాళ్ళు, ఇటుక, చక్కలతో, వేనితోనేని కట్టబడియున్న నీటిపట్టునకు, కూపము (భావి-నుయ్యి') యనబడును. ఇట్టి నీటి పట్టులకడకుచేరి తొలుత దంతధావనము చేసికొని స్నానమాచరింప దగినది.

దంతధావనము, పల్లు పుల్లలతో చేయుట యుత్తము. ఈ కాలమున బ్రష్షులు, టూత్‌పేష్టులు, బలముగ నున్నవికాని, పల్లపుల్లలతో పండ్లుతోముటనే శాస్త్రములలో వర్ణించి యున్నారు.

అట్లు పల్లు పుల్లను చెట్టునుంచి విరచుకొనునప్పుడు, ఈ శోకరూప మంత్రమును పఠింపవలయును.

'ఆయుర్బలం యశోవర్చః ప్రజాఃపశువసూనిచ|

బ్రహ్మప్రజ్ఞాంచ, మేధాంచ, త్వన్నో దేహి వనస్పతే'

అని యీ మంత్రమును చెప్పిన, గుణములు నాకివ్వవలసినదని వృక్షమును ప్రార్థించి పుల్లనువిరచి తోముదురు.

'ప్రతీచీం దక్షిణాశాంచ వర్జయేద్దంత ధావనం|

పశ్చిమ ముఖముతగ కూర్చొనిగాని దక్షిణ ముఖముగ కూర్చొని గాని దంతదావనము చేయరాదు,

'పూర్వాముఖో ధృంతింవిద్యాత్‌, శరీరారోగ్యమేవచ'

అనురీతిని తూర్పు ముఖముగ కూర్చొని దంతధావనము చేసికొనినచో, శరీరారోగ్యము, బుద్ధికుశలత ధైర్యసాహసములు చేకూరగలవు.

''దక్షిణన తథాక్రౌర్యం' దక్షిణ దిశాముఖమున కూర్చొని, దంతథావనము చేసినచో, క్రోథగుణములు గల్గును.

'పశ్చిమేవ పరాజయం'' పడమర ముఖముగ దంతథావనము చేసిన పరాజయము తప్పదు.

'ఉత్తరేణ గవాంనాశం, స్త్రిణాం పరిజనస్యచ'

ఈత్తరాభి ముఖముగ కూర్చొని దంతధావనము చేసినచో, ఆవులున్న, ఆవులు నసించును. భార్యాది స్త్రి జననము నశింతురు, పరివారము తొలంగును. కనుక తూర్పు ముఖముగ కూర్చొని దంతథావనము చేయవలియునేగాని నితరమైన దిక్కులకు ముఖము చేసికొని దంతథావనము చేసినదోషము వచ్చును. అనంతరము 'ఆచరే దుషసిస్నానం'' అను విధి చెప్పున ఉషఃకాలమునవే స్నానము చేయవలయును.

ఉషఃకాల స్నానమువలన

''మనఃప్రసాదజనకం రూప సౌభాగ్యవర్ధనం

శోక దుఃస్వప్నహం స్నానం మోక్షదం హ్లాదనం తథా.

మనస్సుకు ప్రశాంతతనిచ్చును. రూపము సౌభాగ్యము వృద్ధిజేయును వ్యసనము చెడుకలల ఫలము నశింపజేయును. ముక్తి సంతోషములు గలిగించును. 'స్నానమూలాః క్రియాః సర్వాః' అను విధిచొప్పున ప్రాతఃకాలమున స్నానము చేసియే యే సంధ్యావందనాది కార్యములేని చేయదగియున్నది. ''శ్రీపష్ట్యారోగ్యవర్ధనం'' ప్రాతఃస్నానమున ఫలితము, మరియు 'యామ్యంహియాతనాదుఃఖం నిత్య స్నాయీనవశ్యతి' యను ప్రమాణము చొప్పున నిత్యము ఉషఃకాలమున విధిగ నియమముప్రకారము స్నానము చేయువారు యముని బాధలను పొందక స్వర్గలోక సుఖమును చూరగొందురు. ఇట్లు నిత్యము ప్రాతఃకాలమున చేయు స్నానమునకు నిత్యస్నానమందురు, ఏదేని కారణమున చేయు స్నానమునకు నైమిత్తిక స్నానమందురు. ఏదేని కోరికలు సిద్ధించుటకై చేయు వ్రతాదులలో చేయు స్నానమునకు కామ్య స్నానమందురు, కనుక స్నానములు ''నిత్యం నైమిత్తికం కామ్యం త్రివిధం స్నానముచ్యతే'' యని స్నానములు మూడు విధములుగ విభజించిరి,

'నదీనద తటాకేషు, దేవఖాత, జలేషుచ|

నిత్యక్రియార్థం స్నాయీత, గిరిప్రవ్రపణషుచ|

కూపేషూధృత తో యేనస్నానం కుర్వీత వాభువి'

అనురితిని తొలుత వివరించిన, నదులలోను, నదములలోను, తటాకములలోను, దేవఖాతములలోను, కొండలలోగల, గుండములలోగాని, లేక, తోడిపోసుటకు వీలైన భావులవద్దగాని, స్నానము చేయవచ్చును.

శూర్పవాయః, నఖాగ్రాంబు, స్నానవస్త్రం,

ఘటోదకం, మార్జనీరేణుః కేశాంబు, హంతి పుణ్యంపు రాతనం''

అనురీతిని, ఎప్పటికి చేటవిసరుటచే వచ్చుగాలి, గోటికొనలనుంచి, చల్లబడు నీటిబిందువులు, కడవలోగల నీరు (కుండలలోని నీరున్నూ) కసవుత్రోయు సమయమున, రేగుదుమ్ము, వెంట్రుకల కొసలనుంచి, పడునీటిబిందువులు, మునుపుజేసిన పుణ్యమునంత హరించును, గాన వీనిని పోకనివ్వక జాగరూకులై స్నానమొనర్చ వలయును.

'నాల్పోదకే నిమజ్జెత్‌, నసముద్రోదక మవగా హేత్‌'

అను నిషేధ విధిననుసరించి, కొద్దిపాటి నీళ్ళలో స్నానముచేయరాదు. నిత్యము సముద్రములో స్నానముచేయరాదు, 'నరజక తీర్థేషు చాకలివారు బట్టలు పిండుచోట స్నానము చేయరాదు.

'గ్రహణ సంక్రమణవాసి, నస్నాయాద్యది మానవః

సప్తజన్మని కుష్ఠిస్యాత్‌, దుఃఖభాగేచ జాయతే||

గ్రహణకాలమునగాని, సంక్రమణ కాలాదులలోగాని, స్నానము చేయనివారు, ఏడుజన్మల పర్యంతము కుష్ఠురోగాది బాధలతో, దుఃఖితులైయుందురు,

'రవిగ్రహే సూర్యవారే, సోమేసోమగ్రహేతధా

చూడామణి రితిఖ్యాతః తత్రానంత ఫలంలభేత్‌||

ఆదివారమున సూర్యగ్రహణము సోమవారమున చంద్రగ్రహణము వచ్చినచో, నీ గ్రహణములకు, చూడామణి గ్రహణమందురు, ఇట్టి చూడామణి గ్రహణకాలమున స్నానదాన జపాదులు చేసినచో అనంతమైన పుణ్యము చేకూరును,

'రాత్రో స్నానం నకుర్వీత'' అను నిషేధం ప్రకారం ప్రతిదినము రాత్రికాలమున స్నానము చేయరాదు.

నైమిత్తికంతు కుర్వీత స్నానం దానంచ, రాత్రిషు

అను ధర్మము ప్రకారము ఏదేని గ్రహణాదికారణములు నిమిత్తముగ చెసికొని, రాత్రికాలమున, స్నానాదులు చెయవచ్చును,

క్యామ్యస్నానములు:-

పుష్యెచ జన్మనక్షత్రే వ్యతీపాతేచ వైధృతౌ

అమాయాంచ, నదీస్నానం, పునాత్యాశప్త మంకులం.

పుష్యమి నక్షత్రమునాడుగాని, తనజన్మ నక్షత్రమునాడుగాని, వ్యతీపాతము, వైధృతి యను యోగములుగల దినమునగాని, అమావాస్యనాడుగాని, మహానదులలో స్నానము చేసినచో తనతోగూడ నేడుతరములవారు తరింతురు,

సూర్యగ్రహణ తుల్యాతు శుక్లా మాఘస్య సప్తమీ

అరుణోదయ వేళాయాం తస్యాం స్నానం మహాఫలం||

మాఘ శుక్ల సప్తమికి రధ సప్తమి యందుము. ఈ నాడు సూర్యోదయానికి పూర్వమే, స్నానదానాదులు మహానదులలో చేసినచో గొప్ప పుణ్యఫలములు గల్గును.

'బాలాశ్చ తరుణావృద్ధాః నరనారీవ పుంసకాః|

స్నాత్వామాఘే శుభతీర్థే ప్రాప్నువంతీప్సి తంఫలం|

మాఘమాసమున ప్రతిదినము పుణ్యజలములలో స్నానముచేయు, బాలురు, తరుణులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, నపుంసకులు, తాము తలంచిన కోరికలు నెరవేరునట్టి సిద్ధత్వము బొందుదురు.

''ఇందోర్బుధస్య పౌఠేశ్చవారే భ్యంగం, ప్రశస్యతే''

అనురీతిని సోమవారము బుధవారము శనివారము వురులు అభ్యంగ స్నానము చేసినచో కాంతి సుఖసంతోష ఆరోగ్యాదులు గలుగలవు.

సంతాపః కాంతి రల్పాయుఃధనం నిర్థనతాతధా|

అనారోగ్యం సర్వకామః అభ్యంగాత్‌ భాస్కరాదిషు||

అను రీతిని ఆదివారము సంతాపము, సోమవారము కాంతి, మంగళవారము అల్పాయవు బుధవారము ధనము గురువారము దరిద్రము శుక్రవారము అనారోగ్యము శనివారము ఆరోగ్యము పురుషులకు అభ్యంగస్నానముచే ఫలములు గల్గును.

'శిరోభ్యక్తెన తైలేననాంగం కించిదుపస్పృశేత్‌|

తిలసిష్టంచ నాస్నీయాత్‌ తస్యచాయుర్వినశ్యతి|

నెత్తికిరాచిన నూనె శరీరములోని మే యవయవములకు తాకిననూ, నూగులపిండి తినినను, ఆయుస్సు క్షీణించును,

జాయతే మానుషేరోకే క్షీణపావచయాస్తతః|

ఈశ్వరారాధన బలాత్‌ గమిష్యన్తి సతాంగతిః|

అను ప్రమాణము ప్రకారము మానవులు తాము జేసికొనిన పుణ్యము క్షీణించుటచేత, యీ భకూలోకమున జన్మించు చున్నారు. కాన, మరలా దైవానుగ్రహమును పొందుటకై, ఈశ్వరపూజాదులు చేసిన శక్తి వలన, మంచిరీతులను చూరగొందురు. కాన స్నాన దాన జప యీశ్వరారాధనలు మానవులు ముఖ్యముగ చేయవలయును. స్నానకాలమున నీశ్లోకములను పఠించుచు స్నానమొనర్చిన గంగాస్నాన ఫలితమలవడును కాన ప్రతియొకరు తప్పక నిత్యము స్నానసమయమున పఠింతురు గాక.

'గంగాథ్యాన పుదస్సరం గంగాంప్రవిశ్య'

గంగను ధ్యాన మొనర్చుచు నీటిలో ప్రవేశించి,

'గంగా గంగేతి యోభ్రూయా ద్యోజనానాం శ##తైరపి

ముచ్చతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి| 1

అంబ! త్వద్దర్శనాన్ముక్తిః నజానేస్నాన జంఫలమ్‌|

స్వర్గారోహణ సోసానే! మహాపుణ్య తరంగణి| 2

విశ్వేశం కేశవం ధుండిం దండపాణించ భైరవం|

వందేకాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్‌|| 3

అతితీక్షణ మహాకాయ కల్పాన్తదవానోషమ|

భైరవాయ నమస్తుభ్యమనుజ్ఞాం దాతుమర్హసి|| 4

త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవజగతఃపితా|

యాచితో దేహి మేతీర్థం సర్వపాపానుత్తయే|| 5

యో7సౌసర్వగతో విష్ణుత్స్వరూదీ నిరంజనః|

సఏవద్రవరూపేణ గంగాంభోనాత్ర సంశయః 6

నందినీ నళినీ సీతా మాలినీచ మహాపగా|

విష్ణుపాదాబ్జ సంభూతా గంగాత్రి పథగామినీ %

భాగీరథీ భోగవతీ జాహ్నవీత్రి దశేశ్వరీ|

ద్వాదశైతాని నామానియత్ర యత్రజలాశ##యే|| 8

స్నానకాలే పఠేనిత్యం మహాపాతక నాశనమ్‌|

ఈ శ్లోకములు పఠించుచు 'నాభిమాత్ర జలేస్థిత్వా, శిఖాంద్విధా విధాయ, నిరుద్ధకర్ణనాసః, త్రిరాపుత్య, ఆచమ్యశిఖాం బధ్వాదేహం ప్రక్షాళ్య పునరాచమ్య ప్రాణానాయమ్య, హిరణ్యశృంగమితి సూక్తంజపేత్‌||

నాభిలోతు నీటిలోదిగి శిఖనురెండుగ విడథీసి, చెవులు ముక్కు నోరు మూసుకొని ముమ్మారుముణిగి, ఆ చమనముచేసి శిఖనుముడివేసి, శరీరము బాగుగరుద్దుకొనిస్నానముచేసి, హిరణ్యశృంగమను సూక్తమును పఠించవలయును. ఆ పోహిష్ఠా మంత్రములతో మార్జనము చేసికొని, పవమానసూక్త పఠనము చేయుచు స్నానమొనర్చి,

'యదపాం క్రూరమతి, సాంగుష్ఠయజ్ఞ సూత్రేణ

ఆలోడి తాఖః అద్భిఃత్రిరావ్లుత్య'

యదపాం క్రూరమను మంత్రము చెప్పుచు బొటనవ్రేలితో యజ్ఞోపవీతము పట్టుకొని నీటినిముమ్మారు వలయాకారముగ త్రిప్పుచు, నందు ముమ్మారు స్నానము చేయవలయును.

ఇమంమ్మెగంగే 'ఇత్యపో7భిమంత్ర్య'

ఇమంమ్మెగంగే యను మంత్రము చెప్పును. గంగను అభిమంత్రించి 'ఋతంచేత్య ఘమర్షణసూక్తే వాప్పవగా హేత 'ఋతంచేతి'' యను అఘమర్షణసూక్తము చెప్పుచు, మరలా నీటిలోమునిగి స్నానము చేయవలయును, 'అర్ద్రం జ్వలతీత్యాచమ్య'' ఆర్ద్రం జ్వలతి'' అను మంత్రముతో వచనము చేయవలయును. అనంతరము దేవఋషి పితృతర్పణములు యవలయును.

మాఘమాసమున సూర్యోదయానికి పూర్వమే స్నానముచేసిన మహాఫలితములు గల్గునని చెప్పియుంటిని ఆ రీతిని మాఘస్నానవిధిని తెలిసికొనడము అవసరము. 'స్వాతమాఘే శుభతీర్థే ప్రాప్నువంతీ ప్సిపంధలమ్‌'' అను ధర్మముప్రకారము మాఘమాసమున నద్యాదులలో స్నానముచేసినచో ఫలమధికము.

''మాఘమాస మిమంపూర్ణం స్నాస్యేహం దేవమాధవ|

తీర్థస్యాన్య జలేన్నిత్యం ఇతిసంకల్య చేతసీతి||

అని మాఘమాసము నెలదినములు స్నానమాచరింతునని సంకల్పపము చేసికొనవలయును.

'దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ|

ప్రాతఃస్నాం కరోమ్యద్య మాఘేపాప వినాశనం||

అని ఈ శ్లోకమును పఠించుచు స్నానము చేయదగినది,

''మకరస్థే రవౌమా ఘే గోవిందాచ్యుత మాధవ|

స్నానే నానేన మేదేవ! యదోక్త ఫలదోభవ||

ఇమంమంత్రం సముచ్చార్య సాయన్మేన సమన్వితః అని ఈ శ్లోకములు స్నానకాలమున పఠింపవలయును. స్నానముచేసిన పిదప, దోసిలినిండా నీరుపుచ్చుకొని, ఈ శ్లోకము పఠించుచు సూర్యనకర్ఘ్య మివ్వవలయును.

'సవితే, ప్రసవిత్రేచ, పరంధామ! జలేమమ|

త్వత్తేజసా పరిభ్రష్టం, పాపంయాతు సహస్రధా|

అని చెప్పి అర్ఘ్యము వదలవలయును.

ఈ రీతిని మాఘమాసమున స్నానము చేసినవారు తరించగలరని ఫలశ్రుతి.

'యోమాఘ మాన్యుషసి సూర్యకరాభితప్తజలే

స్నానం సమాచరతి, చారునదీప్రవాహే

ఉద్ధృత్య సప్తపురుషా& పితృమాతృ వంశా&

స్వరంప్రయాత్య మరదేహోన రోత్యసౌ|

అని భవిష్యోత్తర పురాణ వచనానుసారము మాఘ మాసములో సూర్యోదయానికి పూర్వమే, నదిలో స్నానము చేసినవారు తాము తమ తలిదండ్రులు, మేనమామగారి వంశజులు చేరి యేడు తరములవారు తరింతురు. దివ్యత్వము బడయగలరు.

యీ మాఘ మాసములో రధసప్తమి దినమున స్నానాదాన జపములు చేసినచో సూర్యగ్రహణ దినమున స్నానాదులుచేసిన దానికన్నా రెట్టింపు ఫలితములు గల్లుగలవు. 'మాఘ శుక్ల సప్తమీ రథసప్తమీ' మాఘమాసమున, శుక్లపక్షమునవచ్చు సప్తమిరధ సప్తమీయని పేరు.

'సాఅరుణోదయ వ్యాపినీగ్రాహ్యా'

యీ రధసప్తమి, సూర్యోదయానికి మునుపుగల అరుణోదయ కాలముననున్న సప్తమిఘడియలను ప్రథానముగ గ్రహింపదగినది.

'అరుణోదయ వేళాయాం తస్యాంస్నానం మహాఫలమ్‌| అరుణోదయకాలమునగల సప్తమీఘడియలలో స్నానముచేసిన మహాఫలము గల్గును.

'అరుణోదయ వేళాయాం శుక్లా మాఘసప్తమీ'

ప్రయాగే యదిలభ్యేతకోటి సూర్యగ్రహైస్సమా|

అను ప్రమాణము ప్రకారము అరుణోదయ కాలమున సప్తమీ ఘడియలలో ప్రయాగవద్ద గంగాస్నానము చేసినచో కోటిసూర్యగ్రహణ స్నానఫలము చేకూరును.

'మాఘేమాసి సితేపక్షేసప్తమీ కోటిభాస్కర!

కుర్యాయ్స్ననార్ఘ్యం దానాభ్యాం ఆయురారోగ్య సంపదః

మాఘ శుక్ల సప్తమీయనబడు రథసప్తమీ దినమున సూర్యోదయానికి పూర్వమే స్నానము దానాదులు చేసినచో, ఆయురారోగ్య సంపదలు వృద్ధికాగలవు. కాన స్నానము చేయుతరిని, యీ మంత్రము పఠించుచు స్నానము చేయవలయును.

1. 'యద్యజ్జన్మ కృతంపాపం. మయాసప్త సుజన్మను|

తన్మెరోగంచ శోకం, మాకరీ హన్తుసప్తమీ|

2. 'ఏతజన్మ కృతంపాప యచ్చజన్మాంతరార్జితరి|

మనోవాక్కాయజం, యచ్చజ్ఞాతా జ్ఞాతేనయేపునః|

3. ఇతిసప్త విధంపాపం స్నానాన్మేసప్త సత్తి కే

సప్తవ్యాది సమాయుక్తం హరమాకరి! సప్తమీ|

ఏ తన్రంత్రత్రయ జప్త్యాస్నాత్వా పదోదకేసరః

కేశవాదిత్య మాలోక్య క్షణాన్నిష్కలు షోభ##వేత్‌||

ఈ మూడు మంత్రములు పఠించుచు స్నానము చేసినచో వెంటనే పాపపరిహారమగును.

చెఱకుగడతో నీటిలోత్రిప్పి, జిల్లెడు ఆకులు రేగుఆకులు పండ్లు శిరస్సుననుంచుకొని స్నానము చేయవలయును.

'ఇక్షుదంతెన, జలంచాలయిత్వా, సప్తాద్కపత్రాణి|

బదరీపత్రాణిచ శిరసినిధాయ పూర్వోక్త్రైః

మంత్రైః స్వాత్వా సూర్యం సంపూజ్య

పై రీతిని, జిల్లెడు ఆకులు శిరముననుంచి స్నానముచేసి సూర్యుని పూజించవలయును.

సూర్యునికామంత్రము చెప్పి అర్ఘ్యమివ్వవలయును.

'సప్తసప్తిసహాప్రీత, సప్తలోక ప్రదీపన|

సప్తమీ సహితో దేవ, సృహాణార్ఘ్యం దివాకర''

అని సూర్యునకర్ఘము దోసిలోనీరు గ్రహించి విడువవలయును. అనంతర మీ మంత్రము పఠించుచు సూర్యుని నమస్కరించ వలమును.

''జననీ సర్వలోకానాం, సప్తమీసప్త సప్తిచే,

సప్త వ్యా హృతికేదేవి, నమస్తే సూర్యమండల!

అని నమస్కరించి శుషవస్త్రములు ధరించి దాన ధర్మ జపాదులు చెసికొనవలయును.

... మా న సి క స్నా న వి ధి. ...

స్నానానంతరము మాననక పరీ ద్ధర్షమీ శ్లోజములు పఠింపదగిన దవి హేమాద్రి ధర్మశాస్త్రమున నీ మానసిక స్నానవిధి చెప్పబడి యున్నది, అవశరమున్న వారీ మానసికస్నానవిధిని పఠించుట యుక్తమే,

శో|| ఖస్ధితం పుండరీకాక్షం, చింతయేత్పురుషోత్తమం|

అనంతాదిత్య సంకాశం, వాసుదేవం చతుర్భుజమ్‌||

శో|| శంఖచక్రగదా పద్మథారిణం, వనమాలిపమ్‌|

ధ్వజవజ్రాం కుశైర్లక్ష్య, పాదపద్మం, సునిర్మలమ్‌||

శో|| తత్పాదోదకజాం గంగాం, నీవతంతీం స్వమూర్ఖని|

చింతయేద్బ్రహ్మ రంధ్రేణ, ప్రవిశంతీం స్వకాంతనుమ్‌|| 3

శో|| తయాసంక్షాళ, యేత్సర్వమంతర్దేహ గతంమలమ్‌|

తత్‌క్షణాద్విర జమర్త్యోజాయతే స్ఫటికోపమః||

శో|| ఇదంమానసికం స్నానం, ప్రోక్తంహరి హరాదిఖః|

సార్థత్రికోటితీర్ధేషు, స్నానాత్కోటి గుణాధికమ్‌||

శో|| యోనిత్య మాచరేదేవం, సవైనారాయణస్మృతః

కాలమృత్యు మతిక్రమ్య, జీవత్యేవన సంశయః||

శో|| ఇహా భాగీరధీగంగా, పిగళా యమునాస్మృతా|

తయోర్మధ్యగతానాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతి

శో|| జ్ఞానహ్రదే ధ్యానజలే, దాగద్వేష మలాపహే|

యస్నాతి మానసేతీర్థే, సయాతి పరమాంగతిమ్‌|| %

శో|| అచ్చుతోహ మనంసంతోహం, గోవిందోవా మహంహరిః

ఆనందోహ, మశేషోహం, అజోహమమృతో స్మ్యహమ్‌

శో|| నిత్యోహం నిర్వికల్పోహం, నిరాకారోహ మవ్యయః|

సచ్చిదానంద రూపోహం, పరిపూర్ణోస్మి సర్వదా| ೧೦

శో|| బ్రహ్మైవాహం నసంసారి, ముక్తోహమితి భావయేత్‌,

అశక్నువ& భావయితుం, వాక్యమేతత్స మభ్యసేత్‌ ೧೧

శో|| ఏవంయః ప్రత్యహంస్మృత్వా, మానసంస్నాన మాచరేత్‌

సదేహాన్తె పరబ్రహ్మపదం, యాతినసంశయః| ೧೨

ఇతి హేమాద్రూమాన సస్నానవిధిః

ఈ మానసిక స్నానవిధివలన పరబ్రహ్మ పదవిని పొందగలరని ఫలశ్రతివలన బోధపడగలదు.

ఈ రితిని స్నానాదులు నిర్వర్తించినవారై శుభ్రమైన వస్త్రములను ధరించి సంధ్యావందనాదులు విధిగ నెరవేర్చవలయును.

'ఏవంప్రభావా సాసంధ్యా సర్వపాపప్రణాశినీ' అని సర్వపాపములు సంధ్యావందనమువలన నశింపగలవు.

'దీర్ఘాయుషో భవిష్యన్తి' యనియు సంధ్యావందనము త్రికాలముల యందు నాచరించువారు, పూర్ణాయుస్సునుగల్గి చాలాకాలము జీవించగలరు.

''ఉత్తమీ తారకోపేతా'' యని, నక్షత్రములుండగనే ప్రాతఃకాల సంధ్యావందనము ప్రారంభింపవలయును.

'మధ్యమాలప్త తారకా' యని, నక్షత్రములు తొలగిన పిదప సూర్యోదయములోపుగ చేయు సంథ్య నుధ్యమఫలితము నొసంగును.

'వీచాస్యా దుదయా దూర్థం' అని, సూర్యోదయానంతరము సంధ్యావందనము చేయుట, నీచఫలితము లిచ్చును.

''కాలే నాచరితా యాస్యాత్సా సంధ్యా ఫలదాయినీ'' సకాలములో చేయు సంధ్యావందనము మంచి ఫలములిచ్చును.

'అకాలాచరితా సంధ్యా వంధ్యా నారీవనిష్పలా' అకాలములో (సూర్యోదయానంతరము) చేయు సంధ్యా వందనము, గొడ్రాలు జీవితము వలె, ఫలహీనము.

'తస్మా త్పూర్యోదయా త్పుర్వం, ప్రాతఃసంద్యాం సమాచరేత్‌ కనుక సూర్యోదయానికి మునుపే స్నానమొనర్చి ప్రాతఃసంధ్య చేయవలయును,

'అతఏవ ద్విజాతీనాం, సంధ్యా కర్మైవబలవత్తరమ్‌| బ్రాహ్మణులకు సంద్యావందనమే, ముఖ్యమైన బలకరము, అనగా శక్తిదాయకము ఉపనయన ప్రకరణమున సవివరముగ సంద్యాజపాదులనుగూర్చి చర్చించి నాను పరిశీలించునది.

దే వ పూ జా వి థా నా ది క ము.

ryõƒ«sxqsLiµ³yù ª«sLiµR…ƒyµR…ùLi»R½LRiª«sVV ®µ…[ª«sxmspÇÁ ¿Á[¸R…VVÈÁ µ³R…LRiøª«sVV, bPuíy¿yLRi „sµ³j…¸R…VVƒ«sVƒ«sõµj…. C xmspÇØ„sµ³R…VÌÁV @ƒ«sV„sµ³R…ª«sVVÌÁV, 1 ®ªs[µR…ª«sVLiú»R½ª«sVVÌÁ»][ ¿Á[¸R…VVxmspÇØ„sµ³j…. 2 xmsoLSßá ª«sVLiú»R½ª«sVVÌÁ»][ ¿Á[¸R…VV xmspÇØ xmsµôðR…¼½. 3 »yLiú¼½NRPª«sVVgRi ÛÇÁ[¸R…VVxmspÇØ xmsµôðR…»R½VÌÁV.

''ధ్యానం పూజా జపశ్చైవ సర్వతంత్రే షృయంవిధిః'' అను తంత్రసారవచనానుసారము తమ యిష్టదైవమునుగూర్చి, ద్యానించడము, ఇష్టదైవమునుగూర్చి పూజించడము, ఇష్టదైవముయొక్క మంత్రమును జపము చేయడము, అను విధులుండుటచేత పూజావిధానము శాస్త్రకారులు పలువిధములుగ యోగ్యతానుసారము నిర్ణయించి యున్నారు.

''కర్తవ్యా వైదికీశ్రేష్ఠా'' యను విదిననుసరించి, వేదమంత్రములతో చేయుపూజ శ్రేష్ఠమైనది.

'స్మార్తీ స్యాన్మధ్య మోత్తమా'' శాస్త్రీయ సూక్తులతో చేయు పూజావిధులు మధ్యమములో నుత్తమము.

'పౌరాణీ మధ్యమఖ్యాతా' పురాణ మంత్రములతో చేయుపూజా మధ్యమము.

'తాంత్రికీ త్వవరాస్మృతా' తాంత్రికముగచేయు పూజావిధులు అధమము.

'దైశీచ కాలీ, జాతీయాకనిష్ఠా స్యాదుపాసనా' అనురీతిని, దేశభాషలలోని మంత్రములతో చేయుపూజలు, కాలాని తగినట్లు చేయు బూజా విథులు, జాతీయాది విధులు, తక్కువ ఫలదాయకములుగ గ్రహింతురు.

కాన, వేదమంత్రములు పూజ, స్మార్తమంత్రములపూజ, పురాణమంత్రములపూజ, తాంత్రికపూజ, దేశీయాది మంత్రములతో చేయుపూజలు, అని స్థూలముగ, నయిదు భేదములగుచున్నది. మరియు కాలానుసారముగ నేపటములంటే నా పటములను గాని నే విగ్రములనంటె నా విగ్రహములనుగాని చూచి నమస్కరించడముగాని పూజించడముగాని, వాడుకయగుచున్నది. ఏపద్ధతినైతే నా పద్ధతిలో పూజించడముగూడ జరుగుచున్నది. కానీ తమ పెద్దలు పూజించిన రీతిని పూజా విధులు జరుపుట మంచిదని తొలుతనే మనవి జేసియున్నాను. లేని పోని క్రొత్తవిధులెప్పటికిని నంతమంచి నివ్వలేకపోవడమేగాక లేనిపోని బాధలకుగూడ దారి తీయవచ్చును. గాన పూజా విధులు బాగా పెరిగి నాచరించడము, మంచిది.

...మంత్రంతు జీవత్ప్రోక్తః

ప్రతిమాద్యం శరీరవీత్‌''

అను రీతిని పూజావిథులలో చెప్పిన మంత్రములు బాగుగ నేర్చి నా మంత్రములతో పూజించిన, నా పూజ శక్తివంతమగును. మంత్రము ప్రాణము, విగ్రహము శరీరమువంటిది గాన ప్రాణస్థానమైన మంత్రము పూజకు ముఖ్యము. మంత్రము చక్కగ చెప్పనిపూజ నిరర్ధీకము.

ఏదో పూజముఖ్యమని యిష్టానుసారము గవ్రిహోదులను బెట్టి పూజించరాదు. ఎందుకనగా ''భూ మౌ చైవ కృతా పూజా, పుత్రా యుర్ధన నాశినీ'' యను విధిచొప్పున. పీటలు వగైరా క్రిందనేమియు లేకనే విగ్రహోదులు భూమిమీదనుంచి పూజించినచో, నా పూజయెంత మంత్రము చెప్పినెంత బాగుగ చేసిన ఫలించదు. పుత్రులు దనము, ఆయుస్సును హరించగలదు. కాన, భూమిమీద విగ్రహాదులను పూజించరాదు. గనుక ''దశాంగుళ ప్రమాణాని, తిద్యంగుల మయపునః అనులాగున, పదియంగుళ యెత్తుగాని, పదునైదు అంగుళముల యెత్తుగల పీటమీదనే విగ్రహాదులనుంచి పూజించవలయును. భగ్నాంచ ప్రతిమాల నార్చయేత్‌'' యనురీతిని విరిగిపోయిన, విగ్రహములు, పగిలినపటములు, మొదలైనవియుంచి పూజలు చేయరాదు. కనుకనే, పూజావిథులు యిష్టమొచ్చినరీతిని జించరాదని పెద్దలు చెప్పుదురు. వారి వారి యోగ్యతానుసారము, కాలానుసారము, శక్త్యానుసారము, పెద్దలూహించి వారి వారికి తాగిన పూజావిధులు చెప్పుచుందురు.

ఇంగితాకార చెష్టాచ

విదూరః కృతదుర్జనః

అంతర్ముఖః బహిర్దృష్టిః

సర్వజ్ఞోదేశ కాలవిత్‌||

అను థర్మానుసారము మహనీయులు కొందరుందురు. ఇంగితాకారచేష్టల నెరుంగువారు అనగా ఏయే వ్యక్తి ఎట్టివాడో, వాని, వాలకమును బట్టి నెరుంగుట కింగితాకార చేష్ట యందురు. అట్లు గుర్తించు వారు పెద్దలు, దుర్జనులను చేరనివ్వక దూరముగనుందురు, మానసికముగ సర్వకాల సర్వావస్థలయందును, దైవచింత, ధర్మచింత, పారమార్థికచింత తోనుండుట కంతర్ముఖత్వము మూలము.

బహిర్దృష్టి-అనగా, పైకి నలువురిలో తిరుగుతు నలువురికి తోచిన సలహాలిచ్చుకొనుచు, ధర్మమార్గానికి, వ్యతారేకముకాని రీతిని ప్రపంచమున పలువురితో కలిసిమెలసి తిరుగుటకు, బహిర్దృష్టియందురు. మహనీయులైన వేద శాస్త్రవేత్తలు, అంతర్ముఖులుగను, బహిర్దృష్టి గలిగినవారు గనునుండి దేశమును కాలమును, అధికారిని, అనధికారిని గుర్తించి, మెలంగుచుందురు. ఇట్టి మహనీయులనే సర్వజ్ఞులని పెద్దలు గుర్తించ గల్గుదురు. ఈ పెద్దల సహాయమున తమకు తగిన పూజాది విధుల నెరింగి ప్రవర్తించుట యుక్తము.

విప్రునకు యంత్రములు, విగ్రహములు వగైరాల పూజల కన్నా నిత్యము శాలగ్రమపూజచేసికొనుట యుక్తము. విప్రులు కానివారలకు విగ్రహములు, యంత్రములు పటములు వగైరా పూజలు ఫలించగలవు. బ్రాహ్మణులకు మాత్రము శాలగ్రామ పూజకు మించి యితర యంత్రపటాది పూజలంతగా ఫలించవు. బ్రాహ్మణులుకాని యితరులు వైశ్య, క్షత్రియ, శూద్రాదులకు గాని బ్రాహ్మణులలో స్త్రిలకుగాని ఇతరులైన స్త్రిలకుగాని శాలగ్రామ పూజ దోషమిచ్చును. గుణమివ్వదు గాన యంత్రములు, చిత్రములు విగ్రహములు పెట్టి పూజించవలయును.

''నకదాచిత్‌ స్త్రియాంకార్యం శాలిగ్రామన్యపూజనం

భర్తృదీనాధసుభగా సర్వలోకహితైషయా.

అను థర్మము ప్రకారము భర్త సుఖముగ నుండవలయుననినచో సౌభాగ్యవతిగ మెలంగవలెననిచో స్త్రిలు శాలగ్రామపూజ చేయరాదు.

''మేహాత్‌ స్పృశేతమహిళా, జన్మశీలాగుణాన్వితా

హిత్వాపుణ్య సమూహన్తు నత్వరం నరకంవ్రజేత్‌.

అను ధర్మము ప్రకారము స్త్రిలు మోహబుద్ధితో శాగ్రామములను తాకిననే వారి పూర్వ పుణ్యములెల్ల నశించి నరకప్రాప్తికి చేరుదురు గాన స్త్రీలు శాలగ్రామములను తాకనుగూడ తాకరాదు. ఇందు స్త్రిలు అనగా బ్రాహ్మణులు మొదలు అన్ని కులాలస్త్రిలు అనియర్థము.

ఆయుస్సు, ధనము, సుఖము, కుటుంబవృద్ధి కోరు ప్రతి మానవులు భగవంతుని పూజించవలయును.

దాన, శీల క్షమావీర్యధ్యాన ప్రజ్ఞాబలానిచ

ఉపాయః ప్రనిథిః జ్ఞానం దశబుద్ధి బలానిచ||

అని మానవుడు, భగవదను గ్రహముచే, యీ చెప్పబడు పది విధములైన బుద్ధి బలములు సంపాదించు శక్తి బడవలయును.

(1) దానము = తనకున్నంతలో యాచకులకు, సమర్పించు వితరణకు దానమని పేరు యధాశక్తిని దానము చేయు బుద్ధినలవరచు కొనవలయును.

(2) శీలము = మంచినడవడక, లోకమున నితరులకు బాధలేని రీతిని, దైవికముగ, శక్తిని బడయు రీతిని అనగా ఇహపరసుఖ సాధన మునకనువైన, నడవీటిక నలవలవడిపరచుకొను బుద్ధిని పొందవలయును.

(3) క్షమా = ఓర్పు = ఏ కార్యమునకును తొందబడక, ఆవేశబడక, ఓర్పుతో పనులు సాధించు బుద్ధిని బడయవలయును.

(4) వీర్యము = పరాక్రమము ధైర్యముతోనే కార్యమునేని సాధించుశక్తిని సంపాదించుకొన దగను.

(5) ధ్యానము = భగవంతుని, నిశ్చలమైన బుద్ధితో, ప్రశాంతమైన బుద్ధితో, నిష్కల్మషముగ ధ్యానించు బుద్ధిని సాధించవలయును.

(6) ప్రజ్ఞా = అప్పటి కప్పుడు, బుద్ధిలోగల్గు ఊహలను ప్రజ్ఞాయనిపేరు; ''నవనవోన్మేషః ప్రజ్ఞా'' యని శాస్త్రము. అనగా ఏవిషమైన తడవుకొనక వెంటనే బుద్ధిలో తోచబడుశక్తికి ప్రజ్ఞా దీనికే ప్రతిభ యనియు వ్యవహారము, ''ప్రతిభ దైవదత్తము'' అను విధిప్రకారము, ఈ ప్రజ్ఞాశక్తి దైవబలమునుబట్టి వారివారి జన్మాంతరీయ సుకృత విశేషముచే నలవడును. ఉపాసనా బలమున, తపోబలమున, తీర్థయాత్రాదులు మహాక్షేత్ర సందర్శనాదుల చేతను నీ ప్రతిభ వృద్ధియగును.

(7) బలము = బుద్ధిబలము శరీర బలము అనిబలము ద్వివిధము, బుద్ధిబలముచె నెంతటి ఘనకార్యమునేని, నవలీలగ సాధింపవచ్చునుగాన బుద్ధిబలము సాధింపనగును.

(8) ఉపాయము = సులభముగ నేకార్యమునేని సాధించు యూహకుపాయమందురు. ఉపాయమెంత ఘనకార్యమునేని సునాయాసముగ సాధింప ననువగును.

(9) ప్రనిథి = ప్రార్ధనకు ప్రనిథి యందురు భగవంతుని నిష్కామముగను, నిశ్చలముగను, నిత్యముప్రార్థించు బుద్ధిశక్తిని యలవరచుకొనవలయును.

10 జ్ఞానం = జ్ఞానము రెండువిధములు, లౌకికజ్ఞానము, పారలౌకికజ్ఞానము ఈ పారలౌకిక జ్ఞానమును, సాధించు విధికే వేదాంతశాస్త్ర మేర్పడినది. ఈ శాస్త్ర సాంప్రదాయ రీతిని బ్రహ్మ, సాక్షాత్కార శక్తిని పొందు బుద్ధిబలమునకే ప్రజ్ఞానమందురు ఈ ప్రజ్ఞానశక్తిని మానవుడు సాధించదగియున్నది.

ఈ రీతిని పది బుద్ధి బలశక్తులను తొలుత చెప్పినరీతిని, ఆత్మగుణాష్టకమును, సాధించు మానవుడే, యుత్తమపురుషుడు కాగల్గును, అందుకై, ''గణశంచ, వహ్నిం, విష్ణుం, శివం శివాం.

సంపూజ్య, దేవషట్కంచ, సోధికారీచ పూజనే అను విధి ప్రకారము తొలుత మనవి జేసిన పంచాయత పూజలోని, గణపతి, పార్వతి, పరమేశ్వరుడు, విష్ణువు, ఆదిత్యములతోగూడ, అగ్నిని పూజించినచో, దేవషట్క పూజయగును. ఈ దైవషట్క పూజాఫల మా రీతిని శాస్త్రమున వివరింపబడినది.

ఈరితీని నిత్యము మానవులు మెలగినచో నిహపరసుఖ సంపన్నులై ఆనందోత్సవమున నోలలాడగలరు.

Bharatiya Samskruthi    Chapters